చంద్రయాన్‌-3 సక్సెస్‌.. సాహో భారత్‌ అంటున్న క్రికెట్‌ ప్రపంచం | Cricket Fraternity Congratulate ISRO On Chandrayaan-3 Successful Landing - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-3 సక్సెస్‌.. సాహో భారత్‌ అంటున్న క్రీడా ప్రపంచం

Published Wed, Aug 23 2023 7:01 PM | Last Updated on Wed, Aug 23 2023 7:44 PM

Sports World Congratulate ISRO On Chandrayaan 3 Successful Landing - Sakshi

ఖగోళంతో భారత శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై "ఇస్రో" విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్‌-3 సక్సెస్‌ కావడంతో ప్రపంచం మొత్తం సాహో భారత్‌ అంటుంది. యావత్‌ క్రీడా ప్రపంచం ఇస్రోకు సెల్యూట్‌ చేస్తుంది. క్రికెట్‌ దునియాకి సంబంధించి బీసీసీఐ, పలువురు భారత క్రికెట్‌ సెలెబ్రిటీలు మేరా భారత్ మహాన్ అంటున్నారు.

చరిత్ర సృష్టించాం.. మిషన్‌ సక్సెస్‌ఫుల్‌ అంటూ బీసీసీఐ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపింది. ఐర్లాండ్‌లో ఉన్న భారత క్రికెటర్లు చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్న ఫోటోను బీసీసీఐ ఈ పోస్ట్‌కు జత చేసింది.

జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండ్‌ కావడంపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు. ఇదో చారిత్రక ఘట్టం. ఇస్రోకు హృదయపూర్వక అభినందనలు. ఇస్రో శాస్త్రవేత్తల నిబద్ధత మనందరికీ స్ఫూర్తి అంటూ ట్వీట్‌ చేశారు. షాతో పాటు చాలా మంది భారత క్రికెటర్లు చంద్రయాన్‌-3 సక్సెస్‌పై స్పందించారు. 

కాగా, భారత కాలమానం ప్రకారం ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్‌ను  పూర్తి చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement