తొలి చిత్రాన్ని విడుదల చేసిన చంద్రయాన్‌-3 | Chandrayaan-3 Mission: ISRO Shares First Images Of Moon Land - Sakshi
Sakshi News home page

తొలి చిత్రాన్ని విడుదల చేసిన చంద్రయాన్‌-3

Published Wed, Aug 23 2023 8:30 PM | Last Updated on Wed, Aug 23 2023 10:22 PM

Chandrayaan 3 Mission: ISRO Shares First Images OF Moon Land - Sakshi

చంద్రయాన్‌-3 తొలి చిత్రాన్ని విడుదల చేసింది. ల్యాండ్‌ అయిన తర్వాత విక్రమ్‌ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్‌ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్‌ సెంటర్‌తో ల్యాండర్‌ కమ్యూనికేషన్‌ ఫిక్స్‌ అయినట్లు స్పష్టమవుతోంది. 

చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌తో అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ మరో మైలురాయి దాటేసింది. చంద్రుడిపై విక్రమ్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. బండరాళ్లు, గుంతలు లేని స్థలం చూసుకుని విక్రమ్‌ దిగింది. తద్వారా..  చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండైన తొలి దేశంగా భారత్‌ రికార్డ్‌ సృష్టించింది. మొత్తంగా చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది(అమెరికా, సోవియట్ యూనియన్(USSR), చైనాలు ఉన్నాయి). 


1959లో సోవియట్‌ యూనియన్‌ ‘లూనా’ ప్రయోగం తర్వాత.. మానవ సహిత చంద్రయాత్రలు కూడా సాగాయి. అయితే ఇవన్నీ భూమి వైపు కనిపించే చంద్రుడి మధ్య రేఖ వద్ద జరిగాయి.  అవతల ఎలా ఉంటుందన్న అన్వేషణలో ఎవరూ ముందడుగు వేయలేకపోయారు. పైగా అక్కడంతా బిలాలు, లోయలు, గడ్డ కట్టిన మంచే ఉంటుందని అంచనా వేస్తూ వచ్చారు. 

ఇప్పుడో అప్పుడో ల్యాండర్‌ నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వస్తుంది. చంద్రుడిపై అది రెండువారాల పాటు పరిశోధనలు చేస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై మట్టిని అన్వేషించనున్న రోవర్‌.. మట్టిలో గడ్డకట్టిన మంచు అణువులపైనా అన్వేషణ కొనసాగిస్తుంది. 

మిగతా దేశాలు మన విక్రమ్‌ తర్వాతే.. 
చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీటి జాడల పరిశోధనల కోసం ఏకంగా వ్యోమగాముల్ని పంపాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భావిస్తోంది. ఈ ప్రాజెక్టు 2025లో పట్టాలెక్కనుంది. మరోవైపు చైనా కూడా వ్యోమగామరహిత ప్రయోగాలకు సిద్ధమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement