ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్‌టీ(నాన్ ఫంగిబుల్ టోకెన్) మార్కెట్ ఓపెన్‌సీ హ్యాక్‌కు గురి అయ్యింది. ఓపెన్‌సీపై ఫిషింగ్ అటాక్ జరగడం వల్ల.. కనీసం 32 మంది యూజర్లు 1.7 మిలియన్ డాలర్లు(సుమారు రూ.12.6 కోట్లు) విలువైన ఎన్ఎఫ్‌టీలను కోల్పోయినట్టు ఓపెన్‌సీ కో ఫౌండర్ & సీఈఓ డెవిన్ ఫిన్జర్ ప్రకటించారు. ఇప్పటివరకు 32 మంది వినియోగదారులు ఎన్ఎఫ్‌టీలను కోల్పోయారని ధృవీకరించారు. వారు కోల్పోయిన విలువ $200 మిలియన్ డాలర్లు అనేది అబద్ధమని అన్నారు.
దాడి చేసిన వ్యక్తి దొంగిలించిన ఎన్ఎఫ్‌టీలలో కొన్నింటిని విక్రయించి 1.7 మిలియన్ డాలర్లను ఇథీరియం రూపంలోకి మార్చుకున్నట్లు తెలిపారు. ఓపెన్‌సీ ఇటీవలే కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్ అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది. కొత్త అప్‌గ్రేడ్ వల్ల.. ఓపెన్‌సీలో ఇన్ యాక్టివ్‌లో ఉన్న ఎన్ఎఫ్‌టీలు డీలిస్ట్ అవుతాయి. అందుకోసం యూజర్లు.. ఈటీహెచ్ ఇథీరియంలో తాము లిస్ట్ చేసిన ఎన్ఎఫ్టీలను కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్‌కు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ చైన్ పరిశోధకుడు పెక్ షీల్డ్ మాట్లాడుతూ.. ఫిషింగ్ దాడి గురైన వినియోగదారుని సమాచారం(ఇమెయిల్ ఐడీలతో సహా) లీక్ అయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్‌సీ హ్యాకింగ్ కి సంబంధించిన వార్తలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
(చదవండి: రూ.29 వేల శామ్‌సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.10 వేలకే!)
Comments
Please login to add a commentAdd a comment