ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుతో ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వినియోగించేందుకు ఇష్టపడడం లేదా? అయితే మీకో గుడ్ న్యూస్. ట్విటర్‌కు పోటీగా మరో మైక్రోబ్లాగింగ్ సైట్ అందుబాటులోకి రానుంది.
ట్విటర్ కో- ఫౌండర్ జాక్ డోర్సే ‘బ్లూస్కై’ పేరుతో సోషల్ మీడియా యాప్‌ను డెవలప్ చేశారు. ప్రస్తుతం ఆ యాప్ బీటా వెర్షన్‌పై టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై జాక్ డోర్సే స్పందించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి కనీసం వారం రోజుల ముందు డోర్సే ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గురించి ఓ బ్లాగ్‌లో వెల్లడించారు. ప్రారంభ దశలో బ్లూ స్కై అథంటికేటెడ్ ట్రాన్స్‌ఫర్ ప్రొటోకాల్ (ఏటీ ప్రోటోకాల్) ఆధారంగా పనిచేయనున్నట్లు తెలిపారు. ఇక, సోషల్ మీడియా సైట్లలో యూజర్ల డేటాను వినియోగించుకునేవారికి ప్రత్యామ్నాయంగా నిలవనుందని అన్నారు.
ఏటీ ప్రోటోకాల్ అంటే
ఒక సోషల్ మీడియా సైట్‌ను మల్టిపుల్ సైట్‌ల నుంచి ఆపరేట్ చేయడాన్ని ఏటీ ప్రోటోకాల్ అంటారు. జాక్ డోర్సే 2019లో బ్లూస్కై ప్రాజెక్ట్‌ను ఏటీ ప్రోటోకాల్ తరహాలో ప్రారంభించారు. కాగా, ట్విటర్ కో ఫౌండర్ డోర్సే 201 నవంబర్‌లో ఆ సంస్థ సీఈవో పదవి నుంచి, 2022 మే నెలలో బోర్డు పదవి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment