ట్విట్టర్ సీఈవోకు జీతం లేదట! | No salary but 68,506 dollars in compensation for Twitter CEO Jack Dorsey | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ సీఈవోకు జీతం లేదట!

Published Sat, Apr 16 2016 12:05 PM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

ట్విట్టర్ సీఈవోకు జీతం లేదట!

ట్విట్టర్ సీఈవోకు జీతం లేదట!

ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. అయితే తన వ్యక్తిగత, నివాస భద్రత కోసం మాత్రం రూ. 46 లక్షలు తీసుకుంటున్నారట. ఆయనకంటే ముందున్న సీఈవో డిక్ కాస్టోలో రూ.62 లక్షల జీతం తీసుకున్నారు. అందులో వేతనతంతో పాటు కారు సర్వీసు, సెక్యూరిటీ ఖర్చులన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ట్విట్టర్‌కు దాదాపు 30 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. అయితే ఫేస్‌బుక్‌కు మాత్రం ఏకంగా 150 కోట్ల మంది యూజర్లున్నారు. దాంతో మార్కెటింగ్ వర్గాలు కూడా ట్విట్టర్ కంటే ఫేస్‌బుక్ వైపే మొగ్గు చూపుతున్నారు.

ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి 30.7 కోట్ల మంది యూజర్లుండగా, ఈ త్రైమాసికం చివరకు 30.5 కోట్ల మంది ఉన్నారు. యూజర్లు పెద్దగా పెరగకపోవడంతో ట్విట్టర్ షేరు ధర కూడా దాదాపు 13 శాతం వరకు పడిపోయిందని టెక్ క్రంచ్ తెలిపింది. ట్విట్టర్‌లో చాలా మార్పులు చేయాలని అనుకుంటున్నామని, ప్రస్తుతమున్న 140 క్యారెక్టర్ల పరిమితి ఇబ్బందిగా ఉందని, అయితే దానివల్ల తక్కువ మాటల్లో బలమైన స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి కూడా వీలవుతోందని డోర్సీ అన్నారు. దీనివల్లే ట్విట్టర్‌కు విభిన్నమైన గుర్తింపు కూడా వస్తోందని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement