ట్విటర్ సీఈవో జాక్ డోర్సే (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారిపై పోరుకు మద్దుతుగా ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జాక్ డోర్సే ముందుకొచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో తన వంతు బాధ్యతగా వంద కోట్ల (ఒక బిలియన్) డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్-19 సహాయక చర్యలకు మద్దతుగా ఈ నిధులను అందిస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన సంపదలో 28 శాతం తన ఛారిటీ సంస్థ స్టార్ట్ స్మాల్ ఎల్‌ఎల్‌సి ద్వారా గ్లోబల్ కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్టు డోర్సే ట్వీట్ చేశారు. ప్రజలకు సహాయపడటానికి ఈ రోజు మనం చేయగలిగినదంతా చేద్దామని, తన నిర్ణయం ఇతరులకు ప్రేరణగా నిలవాలని ఆశిస్తున్నానంటూ వరుస ట్వీట్లలో వెల్లడించారు.
డిజిటల్ పేమెంట్ గ్రూప్‌నకు సంబంధించిన తన వాటా నుంచి ఈ మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం జాక్ డోర్సీ ఆదాయం 3.3 బిలియన్ డాలర్లు. తన సంపదలో నాలుగింట ఒక వంతు మొత్తాన్ని అతని ఛారిటీ ఫండ్‌కు విరాళంగా ఇస్తానని, అన్ని విరాళాల వివరాలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటాంటూ దీనికి సంబంధించిన లింక్ ను కూడా షేర్ చేశారు జాక్ డేర్సే. ఈ మహమ్మారి నుంచి బయటపడిన అనంతరం తాము కనీస ఆదాయం పథకం, బాలికల ఆరోగ్యం , విద్యపై దృష్టిని కేంద్రీకరిస్తామని చెప్పారు.
I’m moving $1B of my Square equity (~28% of my wealth) to #startsmall LLC to fund global COVID-19 relief. After we disarm this pandemic, the focus will shift to girl’s health and education, and UBI. It will operate transparently, all flows tracked here: https://t.co/hVkUczDQmz
— jack (@jack) April 7, 2020
Comments
Please login to add a commentAdd a comment