ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ప్రకటనలకు ట్విట్టర్ శక్తిమంతమైన వేదికైనప్పటికీ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఎన్నో సమస్యలున్నాయని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుకుంటే కోట్లాదిమందిపై ప్రభావం పడుతుందని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment