False advertising
-
రాజకీయ ప్రచారానికి ట్విట్టర్ నో!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ప్రకటనలకు ట్విట్టర్ శక్తిమంతమైన వేదికైనప్పటికీ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఎన్నో సమస్యలున్నాయని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుకుంటే కోట్లాదిమందిపై ప్రభావం పడుతుందని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ చెప్పారు. -
ఇదేం బడాయి..చంద్రబాబు!
బద్వేలు: ముఖ్యమంత్రి ప్రచార యావను చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఇదేం బడాయంటూ నవ్వుకుంటున్నారు. మనం ఎవరికైనా మేలు చేస్తే సాయం పొందిన వ్యక్తులు కృతజ్ఞతలు చెబుతారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు వింతగా ఉంది. సీఎం చంద్రబాబు చేసింది గోరంత చెప్పుకునేది కొండంతగా మారింది. దీంతో పాటు మరీ కోరి కృతజ్ఞతలు చెప్పించుకుంటున్నారని మహిళలు గుసగుసలాడుకుంటున్నారు. సీఎం తీరుతో అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని గాలికొదిలి డ్వాక్రా సంఘాలను నట్టేట ముంచారు. మాఫీ చేస్తారనే ఉద్దేశంతో వారు కంతులు కట్టడం మానేశారు. దీంతో వడ్డీలు, వాటి మీద జరిమానాలు కలిసి తడిపి మోపెడయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా సంఘాలు నిర్వీర్యం కాగా మరికొందరు మధ్యలోనే సంఘాలను నుంచి వైదోలగాల్సి వచ్చింది. పసుపు, కుంకుమ పేరుతో రూ.10 వేలు : ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలు బాబు సర్కారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని తప్పించుకుని వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కో సభ్యురాలికి పెట్టుబడి నిధి (పసుపు, కుంకుమ) పేరుతో రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా సంతోషించే లోపు దీన్ని ఒకే పర్యాయం ఇవ్వడం లేదని నాలుగు విడతలుగా ఇస్తామని చెప్పారు. ఏటా రెండు వేల రూపాయలు వంతున ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఏడాది నాలుగో విడత నిధులు విడుదల చేశారు. ఇందులో కూడా చాలా సంఘాల సభ్యులకు ఇవి కూడా అందలేదు. ఇచ్చిందే అంతంతమాత్రం. మళ్లీ ప్రకటనలు, ప్రచార్భాటాలు చేస్తుండటంపై ఇప్పటికే బాబు సర్కారుపై తీవ్ర విమర్శలున్నాయి. ఇంటింటికి డప్పు : రెండు నెలల కిందట నాలుగో విడత నిదులు మంజూరు చేశారు. జిల్లాలో 32 వేల సంఘాలుండగా వాటిలో 3,21,473 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 2018 అక్టోబరులో నాలుగో విడతకుగాను రూ.64.29 కోట్లు అవసరం. తామేదో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు కలరింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ‘ఆడపడుచులకు ధన్యవాదాలు... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు... సీఎం సర్‌కు ధన్యవాదాలు’ అనే స్టిక్కర్లను పంపిణీ చేసి ప్రతి డ్వాక్రా మహిళ ఇంటికి అంటించమని ఆదేశించారు. అసలు నిధులే అందని వారు చాలా మంది ఉన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో ఆశలుపెట్టి అప్పుల పాలు చేశారని, ఇప్పుడు స్టిక్కర్లు ఏంటని పలువురు నిలదీస్తున్నారు. దీంతో సంఘాల లీడర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. బలవంతపు అభినందనలు : దీంతో పాటు గ్రామ సహాయకుల జీతాలు పెంచామని, డ్వాక్రా సంఘాల వీఓలకు గౌరవ వేతనం పెట్టామని.. ఇలా రకరకాల వర్గాలతో సీఎం చంద్రబాబు చిత్ర పటాలకు బలవంతపు క్షీరాభిషేకాలు చేయిస్తున్నారు. జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి విజయవాడకు వీఆర్ఏలను తరలించి అభినందన సభ ఏర్పాటు చేయించుకున్నారు. తాము అడిగిన దానిలో కనీసం 50 శాతం కూడా చేయకుండానే తమతో అభినందన సభలు ఆయా వర్గాల ప్రజలు వాపోతున్నారు. డ్వాక్రా మహిళలు, మెప్మా సిబ్బందితో కూడా క్షీరాభిషేకాలు చేయించుకున్నారు. తమకు ఇష్టం లేకున్నా అడిగి మరీ డప్పు కొట్టించుకుంటున్నారని ఆయా వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
అబద్దాలు బాబుకు వెన్నతో పెట్టిన విద్య
కడప అగ్రికల్చర్ : అసత్య ప్రచారాలు చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని శాసనమండలి విపక్షనేత సీ.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం కడప ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం అపద్దాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడన్నారు. ఆ రోజుల్లో టీడీపీ రాష్ట్ర విభజనకు మద్దతుగా లేఖ ఇవ్వడం వల్లనే విభజన అయిందని, దీన్ని ప్రజలలో అపోహ సృష్టించి ఏడు నెలలు గడచినా ఇంకా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం తగదన్నారు. జనవరి 1వ తేదీన కూడా ఇవి చేశాం, అవి చేశామని తప్పుడు ప్రచారం చేసుకోవడం విచారకరమన్నారు. ప్రజా రాజధాని పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరులో బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడచిపోయిందని ఈ కాలంలో ఏమేమి చేశావో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రుణమాఫీ చేశామని చెబుతున్నా రాష్ట్రంలోని ఏఏ బ్యాంకులో ఎంత మొత్తంలో రైతుల ఖాతాల్లో వేశారో గుండెల మీద చెయ్యి వేసుకుని సీఎం చెప్పాలని సవాల్ విసురుతున్నామన్నారు. రాష్ట్ర విభజనలో సీతారామలక్ష్మణులు కొలువుండే భద్రాచలం తెలంగాణకు వెళ్లిపోయిన నేపథ్యంలో ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని అభివృద్ధి చేసి రాబోయే శ్రీరామ నవమికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందజేసి కల్యానం జరిపించేందుకు చర్యలు చేపట్టాలని లేఖ పంపుతున్నట్లు రామచంద్రయ్య ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.నజీర్ అహ్మద్, సేవాదళ్ అధ్యక్షుడు బండి జకరయ్య, ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షుడు ఇంతియజ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి సత్తార్, పార్టీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు ప్రకటనలకు ఇక చెక్
విజయనగరం మున్సిపాలిటీ : గట్టిగా గాలి వీచినా.. జోరు వర్షం కురిసి నా... ఎండలు మండినా.. వానలు కురవడం ఆలస్యమైనా.. విద్యుత్ సరఫరాలో కోతలే.. కోత లు. ఇదేమని అడిగితే అవసరానికి తగ్గ విద్యుత్ ఉత్పత్తి జరగటం లేదు.. గట్టిగా అడిగితే మాకేం తెలియదు కోతలన్నీ పై నుంచే... ఇదీ విద్యుత్ యంత్రాంగం నుంచి ఎదరవుతున్న సమాధానం. ఇక ఇటువంటి సమాధానాలకు చెక్ పడనుంది. అక్టోబర్ 2 నుంచి గృహ, పారిశ్రామిక రంగానికి వారి అవసరాల కోసం 24 గంటల విద్యుత్, వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా అంది స్తామని సర్కారు ప్రకటించిం ది. ఇందుకు వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇకపై విద్యుత్ కోతలపై మాకేం తెలియదన్న సమాధానానికి చెల్లు చీటి పడనుంది. సిబ్బంది నిర్లక్ష్యాన్ని కూడా శాఖపై నెట్టేసే పరిస్థితికి తెరపడనుంది. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో విద్యుత్ సర్వీసులు 5లక్షల 70వేల వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీటన్నింటికి అక్టోబర్ 2 నుంచి 24 గంటల విద్యుత్ అందించాలన్నది సర్కా రు లక్ష్యం. జిల్లాలోని సుమారు 25 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడు గంటల పాటు సరఫరా అం దించాలన్నది ఉద్దేశం. ఈ హమీ సమర్థ అమలుకు సంబంధించి న కసరత్తు చురుగ్గా సాగుతోంది. తప్పుడు వివరాల నమోదు ఇక చెల్లదు.. ఇది వరకు సాంకేతిక లోపా లు, మరమ్మత్తుల పేరిట ఎడాపెడా కోతలు విధించే వారు. ఉన్నతాధికారుల కు వివరణ ఇచ్చుకోవాలన్న నెపంతో వీటిలో కొన్నిం టిని మాత్రమే ఉప కేంద్రం వద్దనున్న రిజిస్టర్లో నమోదు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి ఉండదు. సిబ్బంది సేవల్లో లోపాల వల్ల విద్యుత్ సరఫరా నిలిపితే అందుకు గల కారణం కచ్చితంగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉప కేంద్రాల్లో ప్రత్యేక మీటర్లతో పాటు సిమ్ కార్డులున్న మోడెంలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేయటం ద్వారా ఎంత సమయం సరఫరా ఉంది. ఎంత సమయం సరఫరా నిలిచిపోయిందన్న సమాచారం ఉపకేంద్రాల వారీగా కంప్యూటర్ ముందు కూర్చుంటే తెలిసిపోతుంది. కార్పొరేషన్ కార్యాల యంలో ఉన్న సర్వర్‌కు మోడెం కనె క్ట్ కావడం ద్వారా రాష్ట్ర వ్యాప్త నెట్వర్క్ అనుసంధానమై ఉంటుంది. విద్యుత్ సరఫరా ఉన్న సమయం పచ్చగా, విద్యుత్ లేని సమయం ఎర్రటి చారతో నిమిషాలు, సెక్షన్ ల తో సహా కంప్యూటర్లో చూపుతుంది. కింద స్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు, ముఖ్యమంత్రి కూడా ఆన్లైన్లో గ్రామంలో విద్యుత్ సరఫరా 24 గంటలు ఇచ్చారా? లేదా? అనే విషయం తెలుసుకోవచ్చు. జిల్లాలో 83 సబ్స్టేషన్ల పరిధిలో... ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో మొత్తం 83 సబ్స్టేషన్లు ఉండగా.. అందులో 299 ఫీడర్ల ద్వారా వ్యవసాయ, గృహావసర విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందులో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల్లో 54 ఫీడర్లు ఉండగా వాటి ద్వారా వినియోగదారులకు అందించే సేవలను ఇప్పటికే ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మరో 245 ఫీడర్లకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తున్నారు. దాదాపు అన్ని ఫీడర్లకు ఈ ప్రక్రియను పూర్తి చేయగా.. చిన్నపాటి లోపాలను సరిదిద్దే పనిలో ఉన్నారు. లోపాలను అధిగమించడమే ధ్యేయం గృహ, వ్యవసాయ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడమే ధ్యేయంగా విద్యుత్ శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి రెండు సర్వీసులకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విద్యుత్ లోపాలు అధిగమించే క్రమంలో మోడెం విధానం అమలు చేస్తున్నాం. జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశాం. పలు ప్రాంతాల్లో చిన్నపాటి సాంకేతిక ఆటంకాలు ఉన్నాయి వాటిని కూడా సరి చేస్తున్నాం. ఈ ప్రక్రియ అంతా పూర్తయితే అంతా పారదర్శకంగా సాగుతోంది. - సి.శ్రీనివాసమూర్తి, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్, విజయనగరం ఆపరేషన్ సర్కిల్