Twitter CEO Jack Dorsey Slammed By Brahmins to Hold the Poster Against Them In Delhi - Sakshi
Sakshi News home page

Published Tue, Nov 20 2018 8:52 AM | Last Updated on Tue, Nov 20 2018 12:34 PM

Twitter CEO Jack Dorsey Slammed By Users  - Sakshi

మహిళా జర్నలిస్టులతో జాక్‌ డోర్సీ (ఇన్‌సెట్‌లో వివాదానికి కారణమైన పోస్టర్‌)

న్యూఢిల్లీ : ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సీ ప్రదర్శించిన ఓ పోస్టర్‌ వివాదాస్పదమైంది. భారత పర్యటనలో భాగంగా ఇటీవల కొంత మంది మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఓ ఫొటోకు ఫోజిస్తూ.. ఓ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ ఫొటోను ఆ సమావేశానికి హాజరైన ఓ జర్నలిస్ట్‌ తన ట్విటర్‌ ఖాతాలో ‘మహిళా జర్నలిస్టులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగమయ్యాను. భారత్‌లో ట్విటర్‌ అనుభవంపై చర్చించాం. చాలా సంతోషంగా ఉంది.. ఈ సంభాషణను వర్ణించడానికి మాటలు రావడం లేదు’  అని క్యాఫ్షన్‌గా పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోలో జాక్‌ డోర్సీ ప్రదర్శించిన పోస్టర్‌లో ‘బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి’ అని రాసుంది. 

దీంతో బ్రాహ్మణుల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేవలం వామపక్షవాదులతోనే ఎందుకు సమావేశమయ్యారని నిలదీస్తున్నారు. ట్విటర్‌ ఒక వర్గానికే కొమ్ము కాస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘాటు కామెంట్లతో స్పందించిన ట్విటర్‌.. జాక్‌ డోర్సీ కావాలని ఆ పోస్టర్‌ ప్రదర్శించలేదని, ఆ సమావేశానికి వచ్చిన ఓ దళిత కార్యకర్త ఆమె అనుభవాలు పంచుకోవడంతో పాటు.. ఆ పోస్టర్‌ను ఆఫర్‌ చేయడంతో పట్టుకున్నారని వివరణ ఇచ్చింది. ట్విటర్‌ అందరి వాదనలు వింటుందని స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement