Twitter Loses Case Against Centre Takedown Ordered Fined Rs 50 Lakh - Sakshi
Sakshi News home page

 ట్విటర్‌కు షాక్: రూ.50 లక్షల జరిమానా

Published Fri, Jun 30 2023 4:23 PM | Last Updated on Fri, Jun 30 2023 4:50 PM

Twitter Loses Case Against CentreTakedown Order Fined  50 Lakh - Sakshi

మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు భారీ షాక్‌   తగిలింది. కేంద్రం ప్రభుత్వ ఆదేశాలపై  అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ  దాఖలు చేసిన పిటీషన్‌ విషయంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ  పిటీషన్‌ను కర్ణాటక హైకోర్టు  కొట్టివేసింది. అంతేకాదు రూ.50 లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విటర్‌ ఇవ్వలేదని న్యాయమూర్తి దీక్షిత్ వ్యాఖ్యానించారు. 

కోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌  సంతోషం  వ్యక్తం చేశారు.  ఈ తీర్పును ట్విటర్‌లో షేర్‌ చేసిన అన్ని ప్లాట్‌ఫారమ్‌లు భారతీయ చట్టానికి అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.  కానీ జాక్‌  నేతృత్వంలోని ట్విటర​ పదే పదే ఉల్లంఘించిందని ట్వీట్‌ చేశారు.  2021 ఫిబ్రవరి నుంచి 2022 మధ్య కేంద్ర ప్రభుత్వం 10 సార్లు ట్విటర్‌ను బ్లాక్‌ చేసిందని ఆరోపించింది. అలాగే ఎలక్ట్రానిక్స్  అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ  బ్లాక్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ  గత ఏడాది జూలైలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రంఆదేశాలు,  ఏకపక్షంగా  వాక్, భావప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్నాయని వాదించింది. 

2021లో రైతుల నిరసనల నిర్వహణపై విమర్శనాత్మకమైన ఖాతాలను పరిమితం చేయాలనే ఆదేశాలను పాటించకపోతే దేశంలో సోషల్ మీడియాను మూసివేస్తామని  ఇండియా బెదరించిందని ట్విటర్‌మాజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఆరోపించిన  తరువాత తాజా తీర్పు వెలువడటం విశేషం. గత ఏడాది జూన్ 28న, జూలై 4లోగా ఉత్తర్వులను పాటించాలని కోరుతూ ప్రభుత్వం ట్విటర్‌కు లేఖ రాసింది, లేకపోతే మధ్యవర్తిగా తన చట్టపరమైన కవచాన్ని కోల్పోతారని హెచ్చరించింది. లీగల్ షీల్డ్‌ను కోల్పోతే,యూజర్లు ఐటీ చట్టాన్ని ఉల్లంఘించిన కేసుల్లో ట్విటర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement