
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ -- ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కొంతకాలం కొందట తన బాయ్‌ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. హైస్కూల్‌లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో శామ్ విడిపోయారు.

టిమ్ కుక్, యాపిల్ సీఈవో -- యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2014లో స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. ఆ సంవత్సరం జూన్‌లో ‘శాన్ ఫ్రాన్సిస్కో గే ప్రైడ్ పరేడ్’లో యాపిల్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు

పీటర్ థీల్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు -- 2016లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పీటర్ థీల్ తాను స్వలింగ సంపర్కుడిగా గర్విస్తున్నట్లు చెప్పారు. 2002లో, ‘ఈబే’ పేపాల్‌ను 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ థీల్‌ను బిలియనీర్‌గా మార్చింది

క్రిస్ హ్యూస్, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు -- మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు ఫేస్‌బుక్ నలుగురు సహ వ్యవస్థాపకులలో క్రిస్ హ్యూస్ ఒకరు. అతడు బహిరంగంగా ‘గే’గా ప్రకటించుకున్నారు. హ్యూస్ 2012లో సీన్ ఎల్‌డ్రిడ్జ్‌ను వివాహం చేసుకున్నారు

క్లాడియా బ్రిండ్, మేనేజింగ్ డైరెక్టర్, ఐబీఎం -- క్లాడియా బ్రిండ్ ఐబీఎంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1990లో ఆ సంస్థలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె తాను ఒక లెస్బియన్‌గా ప్రకటించుకున్నారు

ఆన్ మే చాంగ్, కాండిడ్, సీఈవో -- యాపిల్, గూగుల్, ఇన్‌టుఇట్ కంపెనీల్లో కీలక స్థానాల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం సామాజిక రంగానికి సంబంధించిన డేటాను అందించే ఒక నాన్‌ప్రాఫిట్ సంస్థ కాండిడ్‌లో పని చేస్తున్నారు. లెస్బియన్ల హక్కుల కోసం వివిధ వేదికలపై ఆమె మాట్లాడారు