మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహరోత్రాతో భారత ప్రధాని మోదీ
వాషింగ్టన్: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ అమెరికన్ కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని పలు అగ్రగామి కంపెనీల సీఈవోలతో వాషింగ్టన్‌లో చర్చలు నిర్వహించారు. భారత సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని అమెరికన్ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీని కోరారు.
టెక్నాలజీ ప్రాసెస్, ప్యాకేజింగ్ సామర్థ్యాల అభివృద్ధికి భారత్‌కు విచ్చేయాలని సెమీకండక్టర్ రంగంలో పనిచేసే ప్రముఖ సంస్థ అప్లయ్‌డ్ మెటీరియల్స్ సంస్థను ప్రధాని కోరారు. భారత్‌లోని సంస్థలతో సహకారానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అప్లయ్‌డ్ మెటీరియల్స్ సీఈ వో గ్యారీ డికర్సన్‌కు సూచించారు. భారత ఏవి యేషన్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ముఖ్య పాత్ర పోషించాలని జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో హెచ్ లారెన్స్‌కల్ప్‌తో భేటీ సందర్భంగా కోరారు.
సుముఖంగా ఉన్నాం
పరస్పర విజయానికి వీలుగా ప్రధాని మోదీ, భారత్‌లోని ప్రతి ఒక్కరితో కలసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నాం.
– గ్యారీ డికర్సన్, అప్లయ్‌డ్ మెటీరియల్స్
Comments
Please login to add a commentAdd a comment