
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న వలస విధానాల వల్ల అమెరికాలో కంపెనీల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రధాన కంపెనీల సీఈవోలు హెచ్చరించారు. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ కిర్స్‌జెన్ నీల్సన్‌కు ఈ మేరకు లేఖ రాశారు. శుక్రవారం యాపిల్ సీఈవో టిమ్ కుక్, పెప్సికో సీఈవో ఇంద్రా నూయి, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ భంగా, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్ తదితరులతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియలో మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్1బీ ఉద్యోగుల భాగస్వామి విషయంలో నిబంధనలను సరళతరం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చట్టాలకు లోబడి పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల జీవితాలకు విఘాతం కలిగించే నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఉద్యోగ ఖాళీలు ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ప్రతిభ ఉన్న వారిని అడ్డుకోవడం సరికాదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment