
ఎస్సార్ వైజాగ్ టెర్మినల్ రికార్డు స్థాయి రవాణా
న్యూఢిల్లీ: ఎస్సార్ వైజాగ్ టెర్మినల్స్ లిమిటెడ్ (ఈవీటీఎల్) జూన్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో ఏడురెట్ల అధికంగా 2.19 మిలియన్ టన్నుల (ఎంటీ) ఐరన్ ఓర్ రవాణా చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది కేవలం 0.31 ఎంటీలుగానే ఉంది. స్టీల్ రంగంలో పరిస్థితులు మెరుగు పడడంతోపాటు ప్రాజెక్ట్ మెరుగునకు చర్యలు తీసుకోవడమే అధిక వృద్ధికి తోడ్పడిందని కంపెనీ తెలిపింది. ఎస్సార్ పోర్ట్స్ అనుబంధ కంపెనీయే ఈవీటీఎల్. ప్రస్తుతం సగటున గంటకు 3వేల టన్నుల లోడింగ్ రేటు ఉండగా... జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 4వేల టన్నుల లక్ష్యాన్ని కంపెనీ నిర్దేశించుకుంది.