కదలని చక్రం | strike escalates | Sakshi
Sakshi News home page

కదలని చక్రం

Published Thu, May 7 2015 2:57 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

కదలని చక్రం

కదలని చక్రం

సమ్మె ఉధృతం.. తొలి రోజు సక్సెస్
స్తంభించిన రవాణా.. ప్రయూణికుల అవస్థలు
డిపోలకే పరిమితమైన బస్సులు బోసిపోరుున బస్‌స్టేషన్లు
{పత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు
తరలివచ్చిన తాత్కాలిక నిరుద్యోగులు
అభ్యర్థులు, కార్మికుల మధ్య ఘర్షణ
హన్మకొండ బస్టాండ్‌లో 144 సెక్షన్

 
హన్మకొండ :  జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో   రవాణా స్తంభించింది. బస్సులు ఎక్కడికక్కడే నిలిచారుు. వేతన సవరణ చేయూలని ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో సమ్మె అస్త్రాన్ని ప్రయోగించారుు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో బస్‌స్టేషన్లు బోసి పోయాయి. సమ్మె విషయం తెలియక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్సుల నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనాల జోరు పెరిగింది. ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేశారు.
 
కార్మిక సంఘాల మండిపాటు
 
ప్రభుత్వం నష్టాల సాకుతో వేతన సవరణ చేయకుండా తప్పించుకుంటుందని కార్మికులు మండిపడుతున్నారు. నష్టాలను పూడ్చుకోవడానికి అవకాశాలున్నా.. వాటిని వదిలేసి కార్మికులు పొట్ట కొడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వేతనాలు సరిపోక, వడ్డీ వ్యాపారుల వద్ద ఏటీఎం కార్డులు కుదువ పెట్టి అప్పులు తీసుకొచ్చి కుటుంబాలను పోషించాల్సి వస్తుందని కార్మిక సంఘాల నాయకులు వాపోయారు. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నా ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్  ఆర్టీసీ కార్మిక వర్గాన్ని మోసం చేశారని ఆరోపించారు. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు, సూపర్‌వైజర్ల సంఘాలు, మెకానిక్‌లు, ఇతర సిబ్బంది సమ్మెబాట పట్టామని కార్మికులు చెప్పారు. ఆర్‌ఎం డిప్యూటీ సీటీఎం, డిప్యూటీ సీఎం, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, డీఎంలు, సెక్యూరిటీ సిబ్బంది మినహా కార్మికులు, ఉద్యోగులందరూ సమ్మెలో ఉన్నారు.
 
ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆర్టీసీ


జిల్లాలో తొమ్మిది డిపోలలో 965 బస్సులు నిలిచాయి. ఇందులో 758 సంస్థ, 207 అద్దె బస్సులున్నాయి. వరంగల్ రీజియన్‌లో 4,539 మంది కార్మికులు, ఉద్యోగులు, సూపర్‌వైజర్లు, మెకానిక్‌లు సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో కండక్టర్లు, డ్రైవర్లు 3,605 మంది ఉండగా.. మిగతా వారు సూపర్ వైజర్లు, మెకానిక్‌లు, డీసీలు, ఏడీసీలు, ఇతర ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీ అద్దె బస్సులను నడిపించాలని చూసినా కార్మికులు అడ్డుకోవడంతో అద్దె బస్సులు కదలలేదు.

అధికారులు 34 బస్సులు తిరిగాయని చెపుతున్నా ఎక్కడా కనిపించ లేదు. దీంతో సమ్మె ప్రభావంతో మొదటి రోజు దాదాపు రూ.కోటి వరకు ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. కార్మికుల సమ్మెతో ఆర్టీసీ అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించాలనే ఆలోచనతోపాటు, హెవీ డ్రైవింగ్ లెసైన్స్ ఉన్న డ్రైవర్లకు బుధవారం డ్రైవింగ్ పరీక్ష నిర్వహించారు. డ్రైవింగ్‌లో నైపుణ్యం కనబరిచిన వారిని విధుల్లోకి తీసుకుని బస్సులు నడుపాలని అధికారులు చూస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలోకి వెళ్తె ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీరితోపాటు 60 ఏళ్ల లోపు వయసు ఉన్న రిటైర్డ్ డ్రైవర్లను కూడా విధుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. తాత్కాలిక కండక్టర్లను తీసుకోవడానికి అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలించారు. అయినా ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సేవలందించడం కష్టమైన పనే.

సమ్మెతో ఉద్రిక్తత

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. యాజమాన్యం తాత్యాలిక నియామకాలు చేపట్టింది. డ్రైవర్లకు రోజుకు రూ.1000, కండక్టర్లకు రూ.800 ఇస్తామని యూజమాన్యం ప్రకటించడంతో వందల సంఖ్యలో నిరుద్యోగులు బుధవారం హన్మకొండ ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయానికి చేరుకున్నారు. తాత్కాలిక విధులు నిర్వహించడానికి వచ్చిన అభ్యర్థులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మదిర డిపో, కరీంనగర్ డిపోకు చెందిన అద్దె బస్సులు రావడంతో అడ్డుకున్నారు.
 మదిర డిపోకు చెందిన బస్సు అద్దం పగిలింది. తాత్కాలిక ఉద్యోగాలకై వచ్చిన అభ్యర్థులు, బయటి నుంచి వచ్చిన అద్దె బస్సులు అడ్డుకోవడంతో హన్మకొండ బస్‌స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ విధించారు. హన్మకొండ సీఐ కిరణ్‌కుమార్, కేయూ సీఐ ఎస్‌ఎం అలీ నేతృత్వంలో ఎస్సైలు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో బందోబస్తు చేపట్టారు. డిపో మేనేజర్‌ల ఆధ్వర్యంలో అధికారులు సర్టిఫికేట్లు పరిశీలించి ఫోన్ నంబర్లు తీసుకొని సమాచారం ఇస్తామని పంపించారు. డ్రైవింగ్ విధులకై వచ్చిన అభ్యర్థులకు వరంగల్ రీజియన్ కార్యాలయంలో డ్రైవింగ్ లెసైన్స్, సర్టిఫికేట్లు పరిశీలించి అనంతరం డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement