సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే ఇదే చివరి సమ్మె అవుతుందని ప్రభుత్వం హెచ్చరించడాన్ని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. అలా అయితే ఈ ప్రభుత్వానికి కూడా ఇదే చివరి విడత అవుతుందని హెచ్చరించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి సంస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని, చివరి పీఆర్సీ కాలవ్యవధి ముగిసి 14 నెలలు గడిచినా కార్మికులు ఎంతో ఓపికతో ఉన్నారన్నారు.
ఆర్టీసీ నష్టాల్లో ఉందని ముఖ్యమంత్రి చెబుతున్నారని, దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాలే కారణమన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికే కార్మిక వ్యతిరేక వైఖరిని ముఖ్యమంత్రి అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక సంఘాలతో చర్చించి, వారి న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment