నిబంధనలు పాటించని వాహనాలపై రవాణా శాఖాధికారులు కొరడా ఝుళిపించారు. స్పెషల్ డ్రైవ్ పేరుతో మంగళవారం రవాణా శాఖాధికారులు జిల్లావ్యాప్తంగా
రవాణా స్పెషల్ డ్రైవ్
Dec 4 2013 3:53 AM | Updated on Sep 2 2017 1:13 AM
అరసవల్లి, న్యూస్‌లైన్: నిబంధనలు పాటించని వాహనాలపై రవాణా శాఖాధికారులు కొరడా ఝుళిపించారు. స్పెషల్ డ్రైవ్ పేరుతో మంగళవారం రవాణా శాఖాధికారులు జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 337 వాహనాలపై కేసులు నమోదు చేశారు. వీటిలో 43 స్కూల్ బస్సులు ఉన్నాయి. సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్, అధిక మోతాదులో ప్రయాణికులను తరలించడం, లెసైన్స్, ఫిట్‌నెస్, లెసైన్స్ లేకుండా నడపడం తదితర అంశాలపై కేసులు నమోదు చేశారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం, అత్యవసర ద్వారాలు పని చేయకపోవడం, అనుభవం లేని వారు డ్రైవర్లుగా ఉండడం, ఫైర్ సేఫ్టీలేకపోవడం తది తర అంశాలను గుర్తించి 43 పాఠశాలల బస్సులపై కేసులు నమోదుచేశారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిపిన దాడుల్లో ఏరియల్ స్టిక్కర్లు, లైటింగ్ తదితర అంశాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రవాణా శాఖ డెప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంగళవారం ఉదయం జిల్లాలో ఏడు బృందాలుగా జాతీయ రహదారిపై దాడులు చేపట్టామన్నారు. ఉదయం 208 వాహనాలు, సాయంత్రం 129 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహన చోదకుల నుంచి సుమారు రూ.7 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు.
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహన చోదకులపై కూడా కేసులు నమోదు చేశారు. ఎచ్చెర్ల సమీపంలో జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా సమీపంలో ఆర్టీఏ ఎంవీఐలు డి.సంజీవరావు, శివరాం గోపాల్, గణేష్ రెడ్డితో కూడిన బృందం మంగళవారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్కూల్,కళాశాల బస్సులలను తనిఖీ చేశారు. అనధికారంగా తిరుగుతున్న 12 వాహనాలను గుర్తించి కేసు నమోదు చేశారు.
నిబంధనలు పాటించకపోతే చర్యలు
మందస : నిబంధనలు పాటించని ప్రైవేట్, వివిధ పాఠశాలల వాహనాలపై చర్యలు తీసుకుంటామని పలాస, ఇచ్ఛాపురం మోటారు వాహనాల తనిఖీ అధికారులు బి.బాలాజీరావు, జి.సత్యంనాయుడు అన్నారు. జిల్లా డిప్యూటీ ట్రాఫిక్ కమిషనర్ ఆదేశాల మేరకు రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా మంగళవారం కొర్రాయిగేటు సమీపంలో గల జాతీయ రహదారిపై వాహనాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. నిబంధనలు అతిక్రమించిన వాహనచోదకుల నుంచి రూ.13300 అపరాాధ రుసుం వసూలు చేసినట్లు తెలిపారు.
Advertisement
Advertisement