![ఇసుక స్థావరాలపై దాడులు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51395096141_625x300.jpg.webp?itok=yX0Ei0XM)
ఇసుక స్థావరాలపై దాడులు
లారీ, డీసీఎం, జేసీబీ పట్టివేత
అడ్డాకుల, న్యూస్‌లైన్ : అక్రమంగా నిల్వ ఉంచుతున్న, రవాణా చేస్తున్న ఇసుక స్థావరాలపై పోలీసులు కొరడా ఝులిపించారు. మండలంలోని పెద్దవాగు నుంచి గుట్టుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను కొత్తకోట సీఐ రమేష్‌బాబు అడ్డుకున్నారు.
పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి వాగు వద్ద ఇసుకాసురులపై మెరుపు దాడి చేశారు. దుబ్బపల్లి సమీపంలోని పెద్దవాగు వద్ద కొన్నాళ్ల నుంచి రాత్రి వేళ అక్రమంగా ఇసుక రవాణా సాగుతోంది. రాత్రి వేళ యంత్రాలను వినియోగించి లారీలు, చిన్న డీసీఎంలతో వాగులోంచి నేరుగా అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో సీఐ తన సిబ్బందితో కలిసి దాడులకు దిగారు.
ఆ సమయంలో ఇసుకను తవ్వుతున్న, రవాణా అవుతున్న లారీ, మినీ డీసీఎం, జేసీబీని పట్టుకుని అడ్డాకుల పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చే యాలని ఎస్‌ఐ ముత్తినేని వెంకటేశ్వర్లుకు ఆదేశించారు.
మూడు ట్రాక్టర్ల పట్టివేత
పెద్దకొత్తపల్లి : మండలంలోని యాపట్ల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్టు ఎస్‌ఐ సైదులు తెలిపారు. భాస్కర్‌రెడ్డికి చెంది న ట్రాక్టర్ ఏపీ 22 ఏఎన్1529, యాదగిరికి చెందిన ట్రాక్టర్ ఏపీ 22 1047, హన్మంతురెడ్డి ఏపీ 28 2189 ట్రాక్టర్ల ద్వారా ఆదివారం రాత్రి యాపట్ల వాగు నుంచి ఇసుక తరలిస్తుండగా పెద్దకారుపాముల వద్ద పట్టుకున్నట్టు చెప్పారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌కు తరలించి యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.