ఇసుకదిబ్బలు కూలి భార్యాభర్తలు మృతి | couple died in accident | Sakshi
Sakshi News home page

ఇసుకదిబ్బలు కూలి భార్యాభర్తలు మృతి

Feb 28 2018 11:04 AM | Updated on Jul 10 2019 7:55 PM

couple died in accident - Sakshi

శవాల గదిలో అశ్విని, మల్లేష్‌

బిజినేపల్లి రూరల్‌: మండల పరిధిలోని మమ్మాయిపల్లికి చెందిన కృష్ణయ్య, వెంకటమ్మ దంపతుల కుమారుడు మల్లేష్‌(26), కోడలు అశ్విని(23) వలస వెళ్లిన చోట ప్రమాదానికి గురై చనిపోయారు. మల్లేష్‌ మూడు నెలల కిందట బతుకుదెరువు కోసం తన భార్యను తీసుకుని కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి మట్టి పని కోసం వెళ్లాడు.

 రోజులాగే మంగళవారం ఉదయం అక్కడ పనులు చేస్తుండగా ఇసుక దిబ్బలు కూలిపడ్డాయి. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. తోటి కూలీలు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే బంధువులు మృతదేహాలను తీసుకరావడానికి అక్కడికి బయల్దేరి వెళ్లారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement