ట్రక్కుపైభాగంలో ఎల్లిగడ్డల సంచులు. కింద భాగంలో పశువులు
సాక్షి, ఎడపల్లి (నిజామాబాద్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు.
కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు.ఎడపల్లి (బోధన్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు.
గాయపడిన ఎద్దు
సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు.
చదవండి: అందం హిందోళం.. అధరం తాంబూలం
Comments
Please login to add a commentAdd a comment