నిస్సాన్‌తో ఓలా ఒప్పందం | Ola agreement with Nissan | Sakshi
Sakshi News home page

నిస్సాన్‌తో ఓలా ఒప్పందం

Published Wed, Nov 4 2015 1:26 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

నిస్సాన్‌తో ఓలా ఒప్పందం - Sakshi

నిస్సాన్‌తో ఓలా ఒప్పందం

హైదరాబాద్: వ్యక్తిగత రవాణా యాప్ ఓలా, నిస్సాన్ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా నిస్సాన్ కంపెనీ కార్లను తమ అనుబంధ సంస్థ ఓలా ఫ్లీట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెట్ కొనుగోలు చేస్తుందని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది.

ఇలా కొనుగోలు చేసిన కార్లను తమ డ్రైవర్-భాగస్వాములకు లీజ్‌కు ఇస్తామని ఓలా వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ సప్లై ఇనీషియేటివ్స్)  రాహుల్ మరోలి పేర్కొన్నారు. ఈ తరహా ఒప్పందాలను మరిన్ని కార్ల కంపెనీలతో కుదుర్చుకోనున్నామని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement