రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు యాపిల్ తాజా దరఖాస్తు!
న్యూఢిల్లీ: దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి అమెరికా టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’కు మార్గం సుగమం అయ్యింది. ఎఫ్‌డీఐ పాలసీలో మార్పుల నేపథ్యంలో దేశంలో రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు యాపిల్ కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవలసి ఉందని అధికారి ఒకరు తెలిపారు.
కాగా స్టోర్ల ఏర్పాటు కోసం యాపిల్ కంపెనీ లోకల్ సోర్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు కోరుకుంటోన్న విషయం తెలిసిందే. సింగిల్ రిటైల్ బ్రాండ్ ఎఫ్‌డీఐ పాలసీలోని తాజా మార్పుల ప్రకారం.. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉపకరణాలను తయారుచేసే కంపెనీలు లోకల్ సోర్సింగ్ నిబంధనల నుంచి తొలి మూడేళ్ల పాటు మినహాయింపు పొందే అవకాశముందన్నారు. ఇక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.