upper circuit
-
Q2 ఎఫెక్ట్- కేర్ రేటింగ్స్ దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రేటింగ్స్ దిగ్గజం.. కేర్ రేటింగ్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం రూ. 61 జంప్‌చేసి రూ. 365.4 వద్ద ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో ట్రేడింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే ఏకంగా 6.29 మిలియన్ షేర్లు చేతులు మారాయి. ఇది కంపెనీ మొత్తం ఈక్విటీలో 21 శాతం వాటాకాగా.. 15 రెట్లు అధిక పరిమాణం నమోదుకావడం గమనార్హం! రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి 4 లక్షలకుపైగా కొనుగోలు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. పనితీరు భేష్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కేర్ రేటింగ్స్ నికర లాభం నాలుగు రెట్లు ఎగసి రూ. 36 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 76 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన విడుదల చేసిన ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు పెరగనుండటం, బాండ్ మార్కెట్ల పురోగతి, ప్రైవేట్ పెట్టుబడులు వంటి అంశాలు ఇకపై కంపెనీ పనితీరు మరింత మెరుగు పడేందుకు దోహదపడనున్నట్లు కేర్ రేటింగ్స్ సీఈవో అజయ్ మహాజన్ పేర్కొన్నారు. -
స్ట్రైడ్స్ ఫార్మా- జీఎంఎం ఫాడ్లర్ హైజంప్
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న హెల్త్‌కేర్ రంగ కంపెనీ స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇటీవల పతన బాటలో సాగుతున్న ఇంజినీరింగ్ కంపెనీ జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్ పుట్టింది. దీంతో మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో హెచ్చుతగ్గులను చవిచూస్తున్నప్పటికీ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ గత వారం రోజుల్లో 14 శాతం ర్యాలీ చేసిన స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 755ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3.6 శాతం ఎగసి రూ. 733 వద్ద ట్రేడవుతోంది. ఆందోళనవల్ల తలెత్తే తల నొప్పి నివారణలో వినియోగించగల ట్యాబ్లెట్లకు యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి పొందిన తదుపరి ఈ కౌంటర్ జోరందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఎక్టావిస్ ల్యాబొరేటరీకి చెందిన బ్యుటల్బిటల్, ఎసిటామినోఫిన్, కెఫీన్ ట్యాబ్లెట్లకు జనరిక్ వెర్షన్ అయిన ట్యాబ్లెట్లకు అనుబంధ సంస్థ ద్వారా స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి పొందినట్లు పేర్కొన్నారు. దీనికితోడు ఈ ఏడాది క్యూ1లో పటిష్ట పనితీరు చూపడంతో గత మూడు నెలల్లో ఈ షేరు 77 శాతం దూసుకెళ్లింది. జీఎంఎం ఫాడ్లర్ రెండు వారాలుగా పతన బాటలో సాగుతున్న జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎన్ఎస్ఈలో యథాప్రకారం తొలుత 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకిన ఈ షేరు తదుపరి టర్న్అరౌండ్ అయ్యింది. కొనుగోలుదారులు పెరగడంతోపాటు.. అమ్మేవాళ్లు కరువుకావడంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. వెరసి తొలుత నమోదైన ఇంట్రాడే కనిష్టం రూ. 3,433 నుంచి రూ. 3,794కు దూసుకెళ్లింది. ఇది 11 శాతం లాభంకాగా.. మార్కెట్ ధరతో పోలిస్తే భారీ డిస్కౌంట్లో ప్రమోటర్లు 17.6 శాతం వాటాను విక్రయానికి పెట్టిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతోంది. వెరసి గత రెండు వారాల్లో ఈ షేరు 40 శాతం దిగజారింది. ఇటీవల ఓఎఫ్ఎస్ ద్వారా ప్రమోటర్లు షేరుకి రూ. 3,500 ధరలో 17.6 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. -
రూట్ మొబైల్- మజెస్కో జూమ్- ఫాడ్లర్ బోర్లా
రెండు రోజుల క్రితం బంపర్ లిస్టింగ్ సాధించిన రూట్ మొబైల్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. విదేశీ సంస్థలు కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం దీనికి కారణంకాగా.. యూనిఫై వెల్త్ మేనేజ్మెంట్ వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో మజెస్కో లిమిటెడ్ షేరు సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఆఫర్ ఫర్ సేల్కు మార్కెట్ ధర కంటే భారీ డిస్కౌంట్లో ఫ్లోర్ ధర నిర్ణయించడంతో జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. వివరాలు చూద్దాం.. రూట్ మొబైల్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 350తో పోలిస్తే లిస్టింగ్ రోజు సోమవారం 86 శాతం లాభంతో రూ. 650 వద్ద స్థిరపడిన రూట్ మొబైల్ తాజాగా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లి రూ. 829కు చేరింది. వెరసి మూడు రోజుల్లో 134 శాతం ర్యాలీ చేసింది. ప్రస్తుతం 12.5 శాతం జంప్‌చేసి రూ. 781 వద్ద ట్రేడవుతోంది. లిస్టింగ్ రోజు గోల్డ్‌మన్ శాక్స్, కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రూ. 210 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఈ కౌంటర్ జోరు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. షేరుకి రూ. 697 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మజెస్కో లిమిటెడ్ ఎన్ఎస్ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం యూనిఫై వెల్త్ మేనేజ్మెంట్ మంగళవారం మజెస్కో లిమిటెడ్‌లో 2.06 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. షేరుకి రూ. 779 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తొలుత ఎన్ఎస్ఈలో మజెస్కో షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 817 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 801 వద్ద ట్రేడవుతోంది. జీఎంఎం ఫాడ్లర్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు 17.59 శాతం వాటాను విక్రయానికి పెట్టిన నేపథ్యంలో జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్లో వరుసగా రెండో రోజు అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనుగోలుదారులు కరువుకావడంతో 10 శాతం పతనమైంది. రూ. 4,215 దిగువన ఫ్రీజయ్యింది. ఓఎఫ్‌ఎస్‌కు ఫ్లోర్ ధర రూ. 3,500 కావడంతో మంగళవారం సైతం ఈ షేరు 10 శాతం కుప్పకూలిన విషయం విదితమే. నేటితో ఓఎఫ్ఎస్ ముగియనుంది. కంపెనీ ప్రమోటర్ సంస్థలు ఫాడ్లర్ ఇంక్, మిల్లర్స్ మెషీనరీతోపాటు, ఊర్మి పటేల్ సంయుక్తంగా 2.57 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. అధిక స్పందన లభిస్తే మరో 1.52 మిలియన్ షేర్లను సైతం విక్రయించనున్నాయి. తద్వారా మొత్తం 28 శాతంవరకూ వాటాను విక్రయించనున్నట్లు తెలియజేశాయి. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతంగా నమోదైంది. -
647 షేర్ల సర్క్యూట్ బ్రేకర్ల సవరణ
వారాంతం నుంచీ అమల్లోకి వచ్చే విధంగా ముంబై స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) 647 షేర్ల సర్క్యూట్ బ్రేకర్లను సవరించింది. ట్రేడింగ్‌పై నిఘా సమీక్షలో భాగంగా పలు కౌంటర్ల సర్క్యూట్ బ్రేకర్లలో మార్పులు చేసినట్లు బీఎస్ఈ వెల్లడించింది. అయితే ట్రేడ్ టు ట్రేడ్(టీ2టీ) విభాగంలోకి వచ్చిన కౌంటర్లకు యధాప్రకారం 5 శాతం సర్క్యూట్ ఫిల్టర్ అమలవుతుందని తెలియజేసింది. కొన్ని కౌంటర్లను టీ2టీ విభాగం నుంచి తొలగించడంతోపాటు సర్క్యూట్ బ్రేకర్‌ను 20 శాతానికి పెంచింది. ఇదే విధంగా మరికొన్ని కౌంటర్ల ఫిల్టర్లను 10 శాతం నుంచి 20 శాతానికి మార్పు చేసింది. మరికొన్ని కౌంటర్లను టీ2టీ విభాగంలో చేర్చింది. వివరాలు చూద్దాం.. ఇదీ జాబితా బీఎస్ఈ తాజాగా 36 స్టాకులను 5 శాతం నుంచి 20 శాతం ప్రైస్ బ్యాండ్‌లోకి మార్పు చేసింది. ఈ జాబితాలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, డెల్టా కార్ప్, సెంట్రమ్ క్యాపిటల్, ఎవరెడీ ఇండస్ట్రీస్, కేపీఐటీ టెక్నాలజీస్, ఫ్యూచర్ రిటైల్, వాటెక్ వాబాగ్ చేరాయి. ఇదే విధంగా 10 శాతం నుంచి 20 శాతానికి చేరిన కౌంటర్లలో డీమార్ట్, నెల్కో, ఆవాస్ ఆవాస్ ఫైనాన్షియర్స్, స్పైస్‌జెట్, అరవింద్, అతుల్ ఆటో, బీడీఎల్, ట్రైడెంట్, షాపర్స్ స్టాప్, షాలిమార్ పెయింట్స్, హిమత్సింగ్కా సీడ్, హింద్ అల్యూమినియం, ఐఎఫ్సీఐ, ఇగార్షీ మోటార్స్, ఇండియన్ టెరైన్, ఇండియన్ టోనర్స్, ఆదిత్య బిర్లా మనీ, ఏషియన్ గ్రానైటో తదితరాలున్నాయి. ఇక 5 శాతం నుంచి 10 శాతం ఫిల్టర్‌కు 325 కౌంటర్లు చేరాయి. వీటిలో అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అఫ్లే ఇండియా, బజాజ్ హిందుస్తాన్, బీఎఫ్ యుటిలిటీస్, గ్రాఫైట్, జీవీకే పవర్, ఐడీబీఐ బ్యాంక్, ఐబీ రియల్టీ, ఐనాక్స్ విండ్, లెమన్ ట్రీ హోటల్స్‌కు చోటు లభించింది. 10 శాతం నుంచి 5 శాతానికి దిగిన జాబితాలో గొదావరి పవర్, ఆన్‌మొబైల్ గ్లోబల్, నియోజెన్ కెమికల్స్ తదితర 6 షేర్లు చేరాయి. ఈ సవరణలన్నీ ఆగస్ట్ 7(శుక్రవారం) నుంచీ అమల్లోకి వచ్చినట్లు బీఎస్ఈ తెలియజేసింది. 1987లో.. షేర్ల ధరల అనూహ్య పతనం లేదా ర్యాలీని నివారించేందుకు వీలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు సర్క్యూట్ బ్రేకర్లను అమలు చేస్తుంటాయి. ఈ విధానానికి 1987లో బీజం పడింది. 1987 అక్టోబర్ 19న యూఎస్ ఇండెక్స్ డోజోన్స్ ఒక్క రోజులోనే దాదాపు 23 శాతం కుప్పకూలింది. దీంతో సర్క్యూట్ బ్రేకర్ల అంశం తెరమీదకు వచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగా 2001 జులై 2న ఇండెక్స్ ఆధారిత సర్క్యూట్ బ్రేకర్లు ప్రారంభమయ్యాయి. తదుపరి పలు మార్పులకు లోనైన విషయం విదితమే. ఇండెక్సుల విషయంలో ప్రస్తుతం 10 శాతం, 15 శాతం, 20 శాతంగా ఫిల్టర్లు అమలవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. -
ఈ షేర్లు.. అప్పర్- డౌన్ సర్క్యూట్స్
విదేశీ మార్కెట్ల బలహీనతల ప్రభావంతో నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. సెన్సెక్స్ 275 పాయింట్లు క్షీణించి 37,865కు చేరగా.. నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 11,124 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఐనియోస్ స్టైరొల్యూషన్ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టగా.. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వివరాలు చూద్దాం.. ఐనియోస్ స్టైరొల్యూషన్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ చేసేందుకు డిస్కవర్ చేసిన రూ. 1100 ధరను కంపెనీ ప్రమోటర్లు తిరస్కరించినట్లు వెలువడిన వార్తలు ఐనియోస్ స్టైరోల్యూషన్ కౌంటర్లో భారీ అమ్మకాలకు దారితీసింది. దీంతో ఐనియోస్ కౌంటర్ ఎన్ఎస్ఈలో 20 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 175 కోల్పోయి రూ. 700 వద్ద ఫ్రీజయ్యింది. కంపెనీలో ప్రస్తుత యూకే ప్రమోటర్ సంస్థ ఐనియోస్ స్టైరొల్యూషన్ ఏపీఏసీకు 75 శాతం వాటా ఉంది. ఈ నెల 7న ప్రమోటర్లు షేరుకి రూ. 480 ధరలో డీలిస్ట్ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో డీలిస్ట్ చేసేందుకు కౌంటర్ ఆఫర్ ఇవ్వబోమంటూ ప్రమోటర్లు తాజాగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 6 శాతం బలపడి రూ. 201 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 24 శాతం ఎగసి రూ. 1184 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు 2.08 శాతం నుంచి 1.69 శాతానికి తగ్గాయి. ఈ నేపథ్యంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కౌంటర్ ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 38 జమ చేసుకుని రూ. 792 వద్ద ఫ్రీజయ్యింది. గత ఐదు రోజుల్లో ఈ షేరు 21 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
జెట్ ఎయిర్వేస్ షేర్లు జూమ్
సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ విమాన యాన సంస్థ చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయర్‌వేస్‌ను కొనుగోలుకు బిడ్‌ను సిద్ధం చేస్తోందన్న వార్తల మధ్య జెట్ ఎయిర్వేస్ షేర్లు లాభపడుతున్నాయి. మంగళవారం నాటి బలహీన సెషన్లో ఇన్వెస్టర్లు జెట్ ఎయిర్వేస్ షేర్లుకొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ అయ్యి రూ .296 వద్ద లాక్ అయ్యాయి. కాగా హిందూజా సోదరులు గోపిచంద్, అశోక్ హిందూజా నేతృత్వంలోని బృందం జనవరి 15 గడువులోగా జెట్ ఎ యిర్‌వేస్‌కు బిడ్ దాఖలు చేయాలని యోచిస్తోంది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఈ ఏడిది ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
కాఫీ డేకు భారీ ఊరట
సాక్షి, ముంబై : కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య అనంతరం భారీగా నష్టపోయిన కాఫీ డే షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. ఒకవైపు రుణ భారాన్ని తగ్గించుకోనే చర్యలు, మరోపక్క పానీయాల గ్లోబల్ కంపెనీ కోక కోలా వాటాను కొనుగోలు చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కౌంటర్లో జోష్ నెలకొంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 5 శాతానికిపైగా లాభపడి రూ. 65.80 వద్ద అప్పర్ సర్క్యూట్ అయింది. సిద్ధార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడువారాల్లో (జులై 26 నుంచి) 68 శాతం పతనమైంది. పానీయాల రిటైల్ స్టోర్ల కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రూ. 2,400 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో గ్రూప్ రుణ భారం ఆమేర తగ్గనునందని వివరించింది. జులై చివరికల్లా గ్రూప్ రుణభారం రూ.4970 కోట్లుగా నమోదైనట్లు తెలియజేసింది. దీనిలో కాఫీడే రుణభారాన్ని రూ.3472 కోట్లుగా పేర్కొంది. ప్రధానంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ పార్క్‌ను పీఈదిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు విక్రయించడం ద్వారా ఈ రుణభారాన్ని తగ్గించుకోనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోపక్క కంపెనీలో వాటాను విక్రయించేందుకు గ్లోబల్ దిగ్గజం కోక కోలాతో కాఫీ డేలో తిరిగి చర్చలు ప్రారంభించినట్లు మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ అంశంపై రెండు కంపెనీలూ అధికారికంగా స్పందించాల్సి వుంది. -
ఎవరీ అజయ్‌సింగ్?
ఢిల్లీ ఐఐటీలో చదువుకున్న అజయ్‌సింగ్... స్పైస్ జెన్ తొలి ప్రమోటర్లలో ఒకరు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు డెరైక్టర్‌గా వ్యవహరించిన అజయ్... బీజేపీకి చాలా సన్నిహితుడు. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్‌కు సలహాదారుగా పనిచేయటంతో పాటు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘అబ్కీ బార్- మోదీ సర్కార్’ అనే నినాదం రూపకర్త కూడా అజయేనని చెబుతారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో చదివిన అజయ్.. 2005లో లండన్‌కి చెందిన కన్సాగ్రా కుటుంబంతో కలిసి మోదీలుఫ్త్ను 2005లో పునరుద్ధరించి, స్పైస్‌జెట్‌గా మార్చారు. అమెరికన్ ఇన్వెస్టరు విల్బర్ రాస్తో 80 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయించటంతో పాటు, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ స్పైస్‌జెట్‌లోకి పెట్టుబడులు తేగలిగారు. బాలీవుడ్ సినిమాలంటే తెగ ఇష్టపడే సింగ్.. అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతారు. ‘‘ఆయన స్పైస్‌ను వదిలే సమయానికి సంస్థకు 800 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఇపుడు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గటం వల్ల లాభాలు కూడా పెరగాల్సి ఉన్నా స్పైస్ నష్టాల పాలవుతోంది. అందుకే బొంబార్డియర్ విమానాలను తొలగించి, బోయింగ్-737లకు మాత్రమే పరిమితమవ్వాలన్నది ఆయన ఆలోచన. లాభదాయక రూట్లలో తక్కువ సిబ్బందితో నడిపించి వచ్చే ఏడాదికల్లా సంస్థను లాభాల బాటలోకి తీసుకురావటానికి ఆయన ప్రణాళికలు వేస్తున్నారు’’ అని ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. తాజా డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేరు ధర 10 శాతం పెరిగి రూ.20.50(అప్పర్ సర్క్యూట్) వద్ద క్లోజయింది.