
న్యూఢిల్లీ: హిందూజా గ్రూప్‌నకు చెందిన వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ఎండీ, సీఈవో విపిన్ సోంధి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవి నుంచి తప్పుకున్నట్టు ఆయన తెలిపారు. డిసెంబర్ 31 వరకు ఆయన పదవీ కాలం కొనసాగనుంది. ధీరజ్ హిందూజా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం ఆయన నాన్–ఎగ్జిక్యూటివ్, నాన్–ఇండిపెండెంట్ డైరెక్టర్–చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తదుపరి ఎండీ, సీఈవో ఎంపిక కోసం బోర్డు త్వరలో సమావేశం కానుందని అశోక్ లేలాండ్ వెల్లడించింది.