Ex-Employee Kills CEO Managing Director Of Former Company - Sakshi
Sakshi News home page

Bangalore: టెక్‌ కంపెనీ సీఈఓ, ఎండీను హత్య చేసిన మాజీ ఉద్యోగి..

Published Tue, Jul 11 2023 7:58 PM | Last Updated on Tue, Jul 11 2023 9:21 PM

Ex Employee Kills CEO Managing Director Of Former Company - Sakshi

బెంగళూరు: బెంగళూరులో దారుణం జరిగింది. ఓ మాజీ ఉద్యోగి తన పాత కంపెనీకి చెందిన సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌ను హత్య చేశాడు. నిందితుడు సంస్థలోకి చొరబడి కత్తితో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులను ఫణీంద్ర సుబ్రహ్మణ్యం, విను కమార్‌లుగా గుర్తించారు. 

ఫణీంద్ర, విను కుమార్‌లు ఏడాది క్రితం ఏయిరోనిక్స్‌ ఇంటర్నెట్‌ అనే సంస్థను స్థాపించారు. దానికి ఫణీంద్ర సీఈఓ, విను కుమార్‌ ఎండీగా పనిచేస్తున్నారు. అయితే.. నిందితుడు వీరు కంపెనీలో క్రితం ఏడాది ఉద్యోగిగా పనిచేశాడు. అనంతరం బయటకు వెళ్లి అదే రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో ఫణీంద్ర, విను కుమార్‌లు నిందితుని వ్యాపారంలో కలగజేసుకున్నారని పోలీసుల ప్రాథమిక సమాచారం.   

ఈ క్రమంలోనే కక్ష పెంచుకున్న నిందితుడు ఫణీంద్ర, విను కుమార్‌లను కత్తితో కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. బాధితులు ఆస్పత్రికి తీసుకువెళ్లే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: హనుమాన్ టెంపుల్‌లో చోరి.. రూ.10 సమర్పించి.. రూ.5000 దోపిడి..

  


 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement