జీవితంలో మనీ ఉంటే చాలని కొందరు భావిస్తారు. అందుకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తూ కోట్లు వెనకేసుకుంటుంటారు. ఇంకొందరు పైసలు మాత్రమే కాదు ప్రశాంతత కూడా కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఆస్తులు, బంగ్లాలు, హోదాలు వద్దని సాధరణ జీవితంవైప మొగ్గు చూపుతుంటారు. ఇలా ఎవరికి నచ్చిన దారిలో వాళ్లు తమ గమనాన్ని నిర్ణయించుకుంటుంటారు. తాజాగా ఓ సంస్థ సీఈవో తన లైఫ్ బోరింగ్‌గా ఉందని.. ఆ జీవితానికి స్వస్తి పలుకుతూ ట్రక్కు డ్రైవర్‌గా మారాడు. వినడానికి ఆశ్చర్యం కలిగించినా ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్ రాస్ మొదట్లో కార్ల సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిని ప్రారంభించాడు. అంతా బాగానే సాగుతోంది, జీతం మంచిగానే సంపాదిస్తున్నాడు. అయితే అతని జీవితంలో ఏదో కోల్పోయానన్న అసంతృప్తి మాత్రం పేరుకుపోయింది. అయితే కుటుంబం గురించి ఆలోచించి ఆ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కాలక్రమంలో ఆయన ఓ సినిమా హాళ్ల సంస్థకు సీఈవోగా ఎదిగారు. హోదా, ఆస్తులు, సకల సౌకర్యాలు.. ఇలా ఎన్ని సాధించినా.. ఆయన మనసులో మాత్రం ఆ వెలితి అలానే ఉండిపోయింది.
దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సాధారణంగా, ఒత్తిడికి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకున్నాడు. అప్పటికే గ్రెగ్‌కు ఆరు పదులు నిండాయి. అయినా వయసుకు మనసుకు సంబంధం లేదని గ్రహించాడు. ఉద్యోగాన్ని వదిలి ఓ రవాణా కంపెనీలో ట్రక్కు డ్రైవర్‌గా చేరి హ్యాపీగా జీవిస్తున్నాడు. ప్రస్తుతం గ్రెగ్‌కు 72 ఏళ్లు. 20 ఏళ్ల క్రితం రాస్ థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స చేసిన వైద్యులు కేవలం 3 నెలలు మాత్రమే బతికే అవకాశముందని చెప్పారు. అలాంటి వ్యక్తి క్యాన్సర్‌ను జయించి.. సీఈవో ఉద్యోగాన్ని విడిచిపెట్టి.. గత 12 ఏళ్లుగా ఇలాగే జీవనం సాగిస్తున్నారు.
చదవండి: ఇలా అయ్యిందేంటి.. ముఖానికి సర్జరీ.. అక్కడ వెంట్రుకలు మొలుస్తున్నాయ్!
Comments
Please login to add a commentAdd a comment