ప్రముఖ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ అసెట్స్ కేర్ & రీకన్‌స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతా ముఖర్జీ రాజీనామా చేసినట్లుగా సమాచారం. కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్, సీఈవోగా ఉన్న ఆమె కంపెనీ నుంచి వైదొలిగినట్లు ఎకనమిక్ టైమ్స్ నుంచి ఓ కథనం వెలువడింది.
గ్లోబల్ ఫండ్ ఆరెస్ ఎస్‌ఎస్‌జీ క్యాపిటల్ మద్దతుతో 2020 నవంబర్‌లో అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ అయిన ఏసీఆర్‌ఈలో సీఈగా చేరారు. ఆమె ఐదు సంవత్సరాల కాలానికి నియమితులయ్యారు. నీతా ముఖర్జీ ప్రీమియర్ ఫైనాన్షియల్ సంస్థలలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ బ్యాంకర్. ఏసీఆర్‌ఈలో చేరడానికి ముందు ఆమె ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో చీఫ్ క్రెడిట్ ఆఫీసర్‌గా పని చేశారు. దానికి ముందు అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్ ఆఫ్ ఇండియా (ఆర్సిల్) అధ్యక్షురాలిగా ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌తోనూ పనిచేశారు.
“ముఖర్జీ తన ప్రణాళికల గురించి తెలియజేయలేదు. బోర్డు ఆమె తదుపరివారిని గుర్తించే ప్రక్రియలో ఉంది ” అని కంపెనీకి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పినట్లుగా ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment