ముంబై: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) చార్జర్ల తయారీ కంపెనీ టైరెక్స్ ట్రాన్స్‌మిషన్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేయనున్నట్లు హిందుజా గ్రూప్ కంపెనీ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండి యా తాజాగా పేర్కొంది.
ఇందుకు రూ.103 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. తద్వారా ఈవీ విభాగంలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నట్లు అంచనా వేసింది. ఈవీ చార్జింగ్ మార్కెట్ ప్రస్తుత అంచనా విలువ 20 బిలియన్ డాలర్లుకాగా.. 2030కల్లా భారీగా 200 బిలియన్ డాలర్లను తాకగలదన్న అంచనాలున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment