Gulf Oil India
-
టాటా స్టీల్, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్‌కు లాభాలు
టాటా స్టీల్ సెప్టెంబర్ త్రైమాసికంలో తిరిగి లాభాల్లోకి అడుగు పెట్టింది. రూ.759 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.6,511 కోట్ల నష్టం ఎదురుకావడం గమనార్హం. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.55,910 కోట్ల నుంచి రూ.54,503 కోట్లకు తగ్గింది. కంపెనీ వ్యయాలను గణనీయంగా తగ్గించుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వ్యయాలు రూ.55,853 కోట్లుగా ఉంటే, సమీక్షా త్రైమాసికంలో రూ.52,331 కోట్లకు పరిమితమయ్యాయి.సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4,806 కోట్ల మూలధన వ్యయాలను వెచ్చించింది. కంపెనీ నికర రుణభారం రూ.88,817 కోట్లుగా ఉంది. కంపెనీ వద్ద రూ.26,028 కోట్ల లిక్విడిటీ ఉంది. టాటా స్టీల్ యూకే ఆదాయం 600 మిలియన్ పౌండ్లుగా ఉంటే, 147 మిలియన్ పౌండ్ల ఎబిట్డా నష్టం నమోదైంది. నెదర్లాండ్ కార్యకలాపాల నుంచి 1,300 మిలియన్ పౌండ్ల ఆదాయం రాగా, 22 మిలియన్ పౌండ్ల ఎబిట్డా నమోదైంది. దేశంలోనే అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ కళింగనగర్ ప్లాంట్ ప్రారంభమైనట్టు సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయంగా నిర్వహణ వాతావరణం ఎంతో సంక్లిష్టంగా ఉన్నట్టు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కొన్ని కీలక ప్రాంతాల్లో వృద్ధి స్దబ్దుగా ఉన్నట్టు అంగీకరించారు. యూకే ప్రభుత్వంతో నిధులపై ఒప్పందాన్ని చేసుకున్నామని, గ్రీన్ స్టీల్‌కు మళ్లే దిశగా పురోగతిలో ఉన్నట్టు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా స్టీల్ షేరు ధర ఒక శాతం లాభపడి రూ.154 వద్ద స్థిరపడింది.ఇదీ చదవండి: ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్.. ఫర్వాలేదుగల్ప్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం 15 శాతం వృద్ధితో రూ.84 కోట్లకు, ఆదాయం 6 శాతం పెరిగి రూ.849 కోట్లకు చేరాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.74 కోట్లు, ఆదాయం రూ.802 కోట్లుగా ఉండడం గమనార్హం. అనిశి్చత మార్కెట్ పరిస్థితుల్లో మంచి పనితీరు చూపించినట్టు కంపెనీ ప్రకటించింది. మార్జిన్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టామని, దీంతో స్థూల మార్జిన్లలో మెరుగుదల నమోదైనట్టు కంపెనీ సీఎఫ్‌వో మనీష్ గంగ్వాల్ తెలిపారు. లాభదాయకత పెంచుకోవడం ద్వారా వాటాదారులకు మరింత విలువ సమకూర్చుతామని ప్రకటించారు. డిమాండ్‌పై సానుకూల అంచనాలతో ఉన్నామని, మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి భారత లూబ్రికెంట్ల రంగంపై విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. పటిష్ట ఫలితాలతో బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 6 శాతం ఎగసి రూ.1,263 వద్ద ముగిసింది. -
గల్ఫ్ ఆయిల్ చేతికి టైరెక్స్
ముంబై: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) చార్జర్ల తయారీ కంపెనీ టైరెక్స్ ట్రాన్స్‌మిషన్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేయనున్నట్లు హిందుజా గ్రూప్ కంపెనీ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండి యా తాజాగా పేర్కొంది. ఇందుకు రూ.103 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. తద్వారా ఈవీ విభాగంలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నట్లు అంచనా వేసింది. ఈవీ చార్జింగ్ మార్కెట్ ప్రస్తుత అంచనా విలువ 20 బిలియన్ డాలర్లుకాగా.. 2030కల్లా భారీగా 200 బిలియన్ డాలర్లను తాకగలదన్న అంచనాలున్నట్లు తెలిపింది. -
వైరల్ వీడియో: నాటి ధోనితో నేటి ధోని ఏమన్నాడంటే..
ముంబై: టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలిచి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గల్ఫ్ ఆయిల్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో 2005 నాటి ధోని, ప్రస్తుత ధోనిల మధ్య జరిగే ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో జట్టులోకి వచ్చిన కొత్తలో అమాయకంగా కనిపించే నాటి ధోనికి.. రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన నేటి ధోని తన అనుభవాన్ని వివరిస్తుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా షికార్లు కొడుతుంది. గల్ఫ్ ఆయిల్ సంస్థ శుక్రవారం ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. @msdhoni from 2021 met his younger self from 2005 and they had quite a conversation about consistency. Here’s a sneak peek into what happened. Dhoni fans, cricket fans, bikers, click https://t.co/fp5XiWzmle to join us on April 2nd at 3 pm to know more! #GulfDhoniXDhoni pic.twitter.com/Yd35WajTwB — Gulf Oil India (@GulfOilIndia) March 31, 2021 కాగా, ఇద్దరు ధోనిల మధ్య జరిగిన సంభాషణ సందర్భంగా ఓ ఆసక్తికర అంశం ప్రస్థావనకు వచ్చింది. 2005 నాటి ధోని.. నేటి ధోనిని తన ఫేవరెట్ వన్డే ఇన్నింగ్స్ ఏది అని అడగ్గా.. 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై చేసిన 91 పరుగుల ఇన్నింగ్సే తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని నేటి ధోని బదులిస్తాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియాను రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టినప్పుడు లభించిన ఆ మజానే వేరు అని నేటి ధోని చెప్తాడు. నాలుగు నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో నేటి ధోని తన కెరీర్ అనుభవాలను, బైక్ రైడింగ్ తదితర అంశాలను నాటి ధోనితో పంచుకుంటాడు. ధోని vs ధోనిగా సాగే ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చదవండి: సచిన్ కోవిడ్‌ను కూడా సిక్సర్ కొట్టగలడు: వసీం అక్రం -
ఫ్లిప్‌కార్ట్ ఒక్క రోజు సీఈవోగా పద్మిని
న్యూఢిల్లీ: ఒకే ఒక్కడు సినిమాలో ఓ సామాన్య జర్నలిస్టు ఒక్క రోజు సీఎం అయిన తరహాలో తాజాగా ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఓ ఉద్యోగినికి... ఒక రోజంతా సీఈవోగా వ్యవహరించే అవకాశం కల్పించింది. ముప్పై నాలుగేళ్ల వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్ పద్మిని ఈ అవకాశం దక్కించుకున్నారు. పదేళ్ల వేడుకల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రయోగానికి తెరతీసింది. సీఈవోగా వ్యవహరించాలని కోరుకునే ఫ్లిప్స్టర్స్ (ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు) దానికి కారణాలు వివరిస్తూ పోటీలో ఎంట్రీలు పంపాలని సూచించింది. ఇందులో ఎంపికైన పద్మిని... అధికారిక సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తితో కలిసి ఒక రోజు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఫ్లిప్‌కార్ట్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. ‘మా సీఈవోతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌తో రోజు ప్రారంభమైంది. కల్యాణ్ రోజువారీ షెడ్యూల్లో భాగమైన కొన్ని సమావేశాలకు కూడా హాజరయ్యాను. ఇదో అద్భుతమైన అనుభూతి‘ అని నాలుగేళ్లుగా ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేస్తున్న పద్మిని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ వంటి ఒక భారీ సంస్థకు సీఈవోగా పనిచేయడమంటే ఎలా ఉంటుందన్నది తెలుసుకునేందుకు ఫ్లిప్స్టర్స్కి ఇది చక్కని అవకాశంగా కల్యాణ్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. వాస్తవానికి కార్పొరేట్ ప్రపంచంలో ’సీఈవో ఫర్ ఎ డే’ కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. గల్ఫ్ ఆయిల్ ఇండియా ఇటీవలే క్రికెటర్ ధోనీని, అటు పాకిస్తాన్లో ట్యాక్సీ సేవల సంస్థ కరీమ్.. క్రికెటర్ వసీమ్ అక్రమ్‌ని ఒక రోజు సీఈవోలుగా చేశాయి. -
సీఈవోగా ధోనీ సడన్ సర్ ప్రైజ్
⇒ సరికొత్త అవతారంలో ధోనీ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ కంపెనీకి సీఈవో అయ్యాడు. అదేంటీ.. క్రికెటర్ గా కొనసాగుతున్న మహీ కంపెనీ సీఈవోగా చేయడమేంటని ఆలోచిస్తున్నారా.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ 10 కోసం సన్నధ్దమైన పుణే సూపర్ జెయింట్స్ ఆటగాడు ఎంఎస్ ధోనీ సోమవారం ఓ కంపెనీకి ఒకరోజు సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఒకేఒక్కడు మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒకరోజు సీఎంగా వ్యవహరించినట్లే.. ధోనీకి ఒకరోజు సీఈవోగా చాన్స్ వచ్చింది. బ్యాటింగ్ సమయంలో మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల బంతులను స్టాండ్స్ లోకి పంపిస్తూ, ఫీల్డిండ్ సమయంలో కెప్టెన్ కూల్ గా ఇన్నిరోజులు వ్యవహరిస్తూ కనిపించిన ధోనీ.. సూట్ లో గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీకి వెళ్లాడు. సీఈవోగా కొత్త అవతారం ఎత్తాడు. సీఈవో కుర్చీలో ధోనీని చూసిన కంపెనీ ఉద్యోగులు షాక్ తిన్నారు. . ధోనీ స్నేహితుడు ఆ కంపెనీ కమర్షియల్ ఇంటరెస్ట్స్ మేనేజర్ అరుణ్ పాండే ఈ విషయాలను చెప్పారు. గతంలో ఈ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరించాడు. సీఈవోగా చేసిన ధోనీ.. కంపెనీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని తెలిపారు. ఎన్నో రోజుల కిందటే ఈ విధంగా ప్లాన్ చేశామని.. అయితే ఇప్పుడు సాధ్యమైందని పాండే వివరించారు.