ముంబై: టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలిచి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గల్ఫ్ ఆయిల్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో 2005 నాటి ధోని, ప్రస్తుత ధోనిల మధ్య జరిగే ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో జట్టులోకి వచ్చిన కొత్తలో అమాయకంగా కనిపించే నాటి ధోనికి.. రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన నేటి ధోని తన అనుభవాన్ని వివరిస్తుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా షికార్లు కొడుతుంది. గల్ఫ్ ఆయిల్ సంస్థ శుక్రవారం ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.
@msdhoni from 2021 met his younger self from 2005 and they had quite a conversation about consistency. Here’s a sneak peek into what happened. Dhoni fans, cricket fans, bikers, click https://t.co/fp5XiWzmle to join us on April 2nd at 3 pm to know more! #GulfDhoniXDhoni pic.twitter.com/Yd35WajTwB
— Gulf Oil India (@GulfOilIndia) March 31, 2021
కాగా, ఇద్దరు ధోనిల మధ్య జరిగిన సంభాషణ సందర్భంగా ఓ ఆసక్తికర అంశం ప్రస్థావనకు వచ్చింది. 2005 నాటి ధోని.. నేటి ధోనిని తన ఫేవరెట్ వన్డే ఇన్నింగ్స్ ఏది అని అడగ్గా.. 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై చేసిన 91 పరుగుల ఇన్నింగ్సే తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని నేటి ధోని బదులిస్తాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియాను రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టినప్పుడు లభించిన ఆ మజానే వేరు అని నేటి ధోని చెప్తాడు. నాలుగు నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో నేటి ధోని తన కెరీర్ అనుభవాలను, బైక్ రైడింగ్ తదితర అంశాలను నాటి ధోనితో పంచుకుంటాడు. ధోని vs ధోనిగా సాగే ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
చదవండి: సచిన్ కోవిడ్‌ను కూడా సిక్సర్ కొట్టగలడు: వసీం అక్రం
Comments
Please login to add a commentAdd a comment