అశోక్ లేలాండ్ నుంచి ‘బాస్’
అశోక్ లేలాండ్ నుంచి ‘బాస్’
Published Thu, Oct 17 2013 2:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
చెన్నై: అశోక్ లేలాండ్ కంపెనీ మధ్యతరహా వాణిజ్య వాహనం(ఐసీవీ-ఇంటర్మీడియట్ కమర్షియల్ వెహికల్) బాస్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక కారుకు ఉండే సౌఖ్యాన్ని, ఒక ట్రక్కుకు ఉండే కెపాసిటీని కలగలపి ఈ బాస్ వాహనాన్ని అందిస్తున్నామని కంపెనీ ఎండీ వినోద్ కె. దాసరి చెప్పారు. రోబోటిక్ ప్రాసెస్‌లను ఉపయోగించి ఈ వాహనాన్ని రూపొందించామని పేర్కొన్నారు. ఈ బాస్ ఐసీవీని కార్ ట్రక్‌గా ఆయన అభివర్ణించారు. రెండు వేరియంట్ల(ఎల్‌ఈ, ఎల్‌ఎక్స్)లో లభ్యమయ్యే ఈ ఐసీవీలో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్, ఇన్-లైన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్, 6-సీడ్ ఓవర్‌డ్రైవ్ గేర్‌బాక్స్, టిల్టబుల్ టెలిస్కోపిక్ స్టీరింగ్, మల్టీ యాంగిల్ అడ్జెస్టబుల్ సీట్లు, 2-పాయింట్ సస్పెండెడ్ క్యాబిన్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. క్లచ్‌లు, గేర్లు మార్చడం వంటి బాదరబందీ లేని ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను బాస్ ఎల్‌ఎక్స్‌లో అందిస్తున్నామని, ఇలాంటి ఫీచర్ ఉన్న తొలి ఐసీవీ ఇదేనని దాసరి చెప్పారు. మూడేళ్ల వారంటీని ఇస్తున్నామని వివరించారు.
‘యాంటినా’ను కొనుగోలు చేసిన పెగా సిస్టమ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ సేవలను అందించే పెగా సిస్టమ్స్ అమెరికాకు చెందిన మొబైల్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్స్ సంస్థ యాంటినా సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసింది. న్యూ జెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న యాంటినా సాఫ్ట్‌వేర్ ప్రపంచవ్యాప్తంగా 250 మంది సిబ్బంది పనిచేస్తుండటమే కాకుండా బెంగళూరులో ఒక కేంద్రాన్ని కలిగి ఉంది.
Advertisement
Advertisement