Lakshmi Mittal
-
ప్రపంచంలోనే రిచెస్ట్ అల్లుడు..
భారతీయ కుటుంబాలలో అల్లుడికి విశిష్ట హోదా ఉంటుంది. ప్రత్యేకించి సంపన్న కుటుంబాల వివాహాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాల్లో అల్లుడికి స్వాగత సత్కారాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఓ వివాహం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అల్లుడు, మామగార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఆరు రోజుల పాటు గ్రాండ్ వెడ్డింగ్బిలియనీర్ స్టీల్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ తన కుమార్తె, అల్లుడి వివాహాన్ని మరచిపోలేని వేడుకగా మార్చాలనుకున్నారు. ఖర్చు ఏమాత్రం వెనుకాడకుండా వనీషా మిట్టల్, అమిత్ భాటియాల వివాహం జరిపించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఆరు రోజులపాటు ఈ వివాహ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. 2004లో జరిగిన ఈ పెళ్లికి రూ. 240 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి.పారిస్ నగరం మొత్తం ఈ వేడుకను జరుపుకుంటున్నట్లు అనిపించేంతగా ఏర్పాట్లు చేశారు. ప్రఖ్యాత సెలబ్రిటీ చెఫ్ మున్నా మహారాజ్‌ను భారత్ నుండి ఫ్రాన్స్‌కు రప్పించారు. ఈ గ్రాండ్ ఇండియన్ వెడ్డింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది అతిథులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీతో సహా బాలీవుడ్, హాలీవుడ్ తారలు తమ ప్రదర్శనలతో హంగామా చేశారు. అంతర్జాతీయ పాప్ సంచలనం కైలీ మినోగ్ కూడా పెళ్లిలో ప్రదర్శన ఇచ్చారు. రూ. ఒక గంట ప్రదర్శనకు ఆమె రూ. కోటి తీసుకున్నట్లు చెబుతారు.ఎవరీ అమిత్ భాటియా ?అమిత్ భాటియా బ్రిటీష్-ఇండియన్ వ్యాపారవేత్త, బిలియనీర్ ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ అల్లుడు. అయేబే క్యాపిటల్ (గతంలో స్వోర్డ్ ఫిష్ ఇన్వెస్ట్మెంట్స్ )వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్. అమిత్ తన ప్రాథమిక విద్యను ఢిల్లీలో పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లారు.అమిత్ తన వృత్తిపరమైన ప్రయాణాన్ని న్యూయార్క్‌లో మెరిల్ లించ్, మోర్గాన్ స్టాన్లీతో ప్రారంభించారు. వెస్ట్ లండన్‌లోని షెపర్డ్స్ బుష్‌లో ఉన్న ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఎఫ్సీకి ఆయన సహ-యజమాని. క్రీడలతో పాటు అమిత్ వ్యాపార సంస్థలు రియల్ ఎస్టేట్, సాంకేతిక రంగాల్లో విస్తరించాయి. స్ట్రాటజిక్ లాండ్ అండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అయిన సమ్మిక్స్ క్యాపిటల్‌లో ఈయన వ్యవస్థాపక భాగస్వామి.గతంలో 2016 ఆగస్టులో బ్రీడాన్ గ్రూప్‌ను కొనుగోలు చేసే వరకు హోప్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత బ్రీడాన్ గ్రూప్ బోర్డ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా చేరారు. కార్పొరేట్ ఫైనాన్స్, ప్రైవేట్ ఈక్విటీలో 20 సంవత్సరాల అనుభవంతో అమిత్ భాటియా విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. వనీషా మిట్టల్, అమిత్ భాటియా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
వైరల్: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అదిరిపోయే ట్విస్ట్!
ప్రపంచ వ్యాప్తంగా సాకర్ ( ఫుట్ బాల్ ) అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఖతర్ లుసైల్ గ్రౌండ్ వైపు స్టేడియంలోని అభిమానులే కాదు.. వరల్డ్ వైడ్ సాకర్ లవర్స్ అర్జెంటీనా, ఫ్రాన్స్ ఆటతీరును తీక్షణంగా చూస్తున్నారు. అదే సమయంలో స్టాండ్స్‌లో ఉన్న మరి కొంత మంది ఫోటోలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగుబడుతున్నారు. నరాలు తెగే ఉత్కంఠతతో మ్యాచ్ జరుగుతుంటే...ఆక్కడ ఏం జరుగుతుందో అర్ధంగాక ఆటను కవర్ చేస్తున్న కెమెరామెన్ తన చూపును స్టాండ్ వైపు మరల్చారు. అంతే మస్క్..మస్క్ అంటూ ఆయన అభిమానులు హోరెత్తించారు. దీంతో మస్క్ సైతం అభిమానులకు అభివాదం చేశారు. ఆటోగ్రాఫ్స్,షేక్ హ్యాండ్స్ ఇచ్చి కొద్ది సేపు అలరించారు. క్షణం తీరిక లేకుండా వ్యాపార రంగంలో తలమునకలయ్యే ఎలాన్ మస్క్ ఖతర్ సాకర్ మ్యాచ్‌లో ప్రత్యక్షమవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక, మస్క్‌తో పాటు ఆర్సెలర్ మిట్టల్ సీఈవో లక్ష్మీ మిట్టల్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జార్డ్ కుష్నర్లు ఉన్నారు. At World Cup right now pic.twitter.com/CG7zMMxSjE — Elon Musk (@elonmusk) December 18, 2022 మ్యాచ్ జరుగుతుండగా ఈ ముగ్గురు వ్యాపార దిగ్గజాలు సీరియస్‌గా మాట్లాడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా మస్క్ సాకర్ మ్యాచ్‌కు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. కానీ ఆయన మాత్రం మ్యాచ్ జరుగుతున్నంత సేపు కామెంటేటర్ అవతారం ఎత్తారు. మొదటి సగం ఆట తర్వాత మస్క్ తన అభిమానుల్ని ఇలా అడిగారు.‘సూపర్ ఎక్సైటింగ్ వరల్డ్ కప్. అర్ధ సమయానికి అర్జెంటీనా 2-0తో ముందంజలో ఉంది. ఫ్రాన్స్ తిరిగి పుంజుకుంటుందా? అని ప్రశ్నించారు. Super exciting World Cup! 🇦🇷 ahead 2-0 at halftime. Can 🇫🇷 come back? — Elon Musk (@elonmusk) December 18, 2022 ఫ్రాన్స్ సాకర్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపే అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన తర్వాత, ‘ఫ్రాన్స్ గోల్ కోసం సెకనుకు 24,400 ట్వీట్లు, ప్రపంచ కప్‌లో అత్యధికం! అంటూ ట్వీట్ చేశారు. 24,400 tweets per second for France’s goal, highest ever for World Cup! — Elon Musk (@elonmusk) December 18, 2022 -
కోట్ల ఖర్చుతో కూతురి పెళ్లి, ఇప్పుడు దివాళా..
సాక్షి, న్యూఢిల్లీ: ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. ప్రస్తుతం అలాంటి ఘటన ఒకటి బడా పారిశ్రామికవేత్త విషయంలో నిజమయ్యింది. లక్ష్మి మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్‌ను లండన్ హైకోర్టు దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటించింది. లక్ష్మి మిట్టల్, ఆయన తండ్రి, భార్య, కొడుకు, బావ మరిది కలిసి వివిధ బ్యాంకులకు 2.5 బిలియన్ డాలర్లు బాకీ పడ్డారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన సోదరుడు లక్ష్మి మిట్టల్ భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరు. స్టీల్ మాగ్నెట్ ఆర్సెలర్ మిట్టల్, యూకేకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2013 లో, ప్రమోద్ మిట్టల్ తన కుమార్తె శ్రీష్టి వివాహానికి ఏకంగా 50 మిలియన్ పౌండ్లు ఖర్చుపెట్టి వివాహం చేసి వార్తల్లో నిలిచారు. కోర్టు దివాళాగా ప్రకటించిన అనంతరం మిట్టల్ మాట్లాడుతూ, తనకంటూ ప్రత్యేకంగా వ్యక్తిగత ఆదాయం ఏమి లేదని తెలిపారు. తన భార్య ఆర్థికంగా తనకు తాను సంపాదించుకుంటుందని, ఆమె ఆదాయానికి సంబంధించిన వివరాలు తెలియవని చెప్పారు. తన వ్యక్తిగత వ్యయం నెలకు సుమారు 2,000 పౌండ్ల నుంచి 3,000 పౌండ్ల వరకు అవుతుందని, ఆ భారాన్ని తన భార్య, కుటుంబ సభ్యులు భరిస్తున్నారని వెల్లడించారు. ఇక తన దివాళాకు సంబంధించి చట్టపరమైన ఖర్చులను థర్డ్ పార్టీ భరిస్తుందని ప్రకటించారు. ప్రమోద్ పతనానికి కారణం బోస్నియన్‌కు చెందిన గ్లోబల్ ఇస్పాట్ కోక్స్నా ఇండస్ట్రిజా లుకావాక్ (జికిల్) అనే బొగ్గు కంపెనీకి హామీ ఇచ్చారు. ఆ సంస్థ 166 మిలియన్ డాలర్లను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. దీంతో ఆ సంస్థకు అప్పు ఇచ్చిన మార్గెట్ కంపెనీ ప్రమోద్ మిట్టల్‌ను అప్పు కట్టాల్సిందిగా కోరింది. దానిని చెల్లించడంలో ఆయన విఫలమయ్యాడు. మరోవైపు భారతదేశంలో కూడా రూ. 2,200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కూడా ప్రమోద్ మిట్టల్ విచారణను ఎదుర్కొంటున్నారు. చదవండి: బడా పారిశ్రామికవేత్త వంద కోట్ల విరాళం -
భారత ఉక్కు రంగంలోకి ‘ఆర్సెలర్’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ఎట్టకేలకు భారత ఉక్కు రంగంలోకి అరంగేట్రం చేసింది. రచ్చ గెలిచిన లక్ష్మీనివాస్ మిట్టల్ ఇంట గెలవడానికి చాలా సమయం పట్టింది. చాలా ఏళ్ల సమయం, ప్రయాసల అనంతరం ఆయన ఉక్కు కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ మన దేశంలోకి అడుగిడింది. భారత్‌లో ఉక్కు కంపెనీని ఏర్పాటు చేయాలన్న ఎల్ఎన్ మిట్టల్ కల ఎట్టకేలకు ఎస్సార్ స్టీల్ టేకోవర్ ద్వారా సాకారమయింది. ఈ టేకోవర్ ప్రక్రియ సోమవారంతో పూర్తయ్యిందని ఆర్సెలర్ మిట్టల్ పేర్కొంది. అతి పెద్ద దివాలా రికవరీ... ఎస్సార్ స్టీల్ కంపెనీని రూ.42,000 కోట్లకు ఆర్సెలర్ మిట్టల్ టేకోవర్ చేయడానికి సుప్రీం కోర్టు గత నెలలోనే ఆమోదం తెలిపింది. దివాలా చట్టం కింద (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్–ఐబీసీ) పరిష్కారమైన అతి పెద్ద రికవరీ ఇదే. నిప్పన్ స్టీల్ కంపెనీతో కలిసి ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీ (ఆర్సెలర్ మిట్టల్ /నిప్పన్ స్టీల్ (ఏఎమ్/ఎన్ఎస్ ఇండియా)) ఇకపై ఎస్సార్ స్టీల్‌ను నిర్వహిస్తుంది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ చైర్మన్‌గా అదిత్య మిట్టల్ (ప్రస్తుత ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సీఎఫ్ఓ, ప్రెసిడెంట్ ) వ్యవహరిస్తారు. ఈ జేవీలో ఆర్సెలర్ మిట్టల్‌కు 60 శాతం, నిప్పన్ స్టీల్ కంపెనీకి 40 శాతం చొప్పున వాటాలున్నాయి. లగ్జెంబర్గ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్... భారత్‌లో అడుగిడాలని చాలా ఏళ్ల కిందటే ప్రయత్నాలు ప్రారంభించింది. జార్ఖండ్, ఒడిశాల్లో 12 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భూ సేకరణ, పర్యావరణ, ఇతర అనేక అవరోధాల కారణంగా ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. -
భారత పారిశ్రామికవేత్త అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: భారతకుచెందిన వ్యాపారవేత్త, స్టీల్ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం, అధికార దుర్వినియోగం ఆరోపణలతో బోస్నియాలో బుధవారం అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈశాన్య పట్టణం లుకావాక్‌లో ఒక కోకింగ్ ప్లాంట్ కేసుకు సంబంధించి ప్రమోద్ మిట్టల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. వ్యవస్థీకృత నేరం, అధికారం దుర్వినియోగం ద్వారా నేరపూరిత చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. ప్రమోద్ మిట్టల్‌తోపాటు, కంపెనీ జనరల్ మేనేజర్ పరమేష్ భట్టాచార్య, పర్యవేక్షక బోర్డు సభ్యుడు రజీబ్ డాష్‌ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తుజ్లా కంటోనల్ ప్రాసిక్యూషన్ విభాగం ప్రాసిక్యూటర్ కాజిమ్ సెర్హాట్లిక్ స్థానిక మీడియాకు తెలిపారు. నిర్వహిస్తోంది. దాదాపు వెయ్యిమందికిపైగా ఉద్యోగులుఉన్నారు. నిందితులను కోర్టుముందు హాజరుపర్చనున్నామని చెప్పారు. ఈ కేసులో దోషులుగా తేలితే 45 సంవత్సరాలదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే నాలుగవ నిందితుడిపై అరెస్ట్ వారంట్ జారీ చేశామన్నారు. అయితే ఈ పరిణామంపై కంపెనీ ప్రతినిధులు ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా బోస్నియాలో అతిపెద్ద ఎగుమతిదారులలో ఒకటి, మెటలర్జికల్ కోక్ ప్రొడ్యూసర్ గ్లోబల్ ఇస్పాత్ కోక్స్నా ఇండస్ట్రిజా లుకావాక్ (జికిల్) నేతృత్వంలోని 2003 నుంచి ప్రమోద్‌మిట్టలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాదాపు వెయ్యిమందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. -
ఎస్సార్ స్టీల్ టేకోవర్‌కు షరతులతో కూడిన ఆమోదం
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ టేకోవర్‌కు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకి ఎన్సీఎల్టీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. దీంతో స్వదేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ చిరకాల స్వప్నం సాకారం కానున్నది. దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న ఎస్సార్ స్టీల్ టేకోవర్ కోసం ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ అండ్ సుమిటొమో మెటల్ కార్ప్‌లు రూ.42,000 కోట్ల ఆఫర్‌ను ఇచ్చాయి. ఎస్సార్ స్టీల్ ప్రమోటర్ల అప్పీల్ నేపథ్యంలో తుది ఉత్తర్వులకు లోబడి ఆర్సెలర్, నిప్పన్ల రిజల్యూషన్ ప్లాన్‌కు ఆమోదం ఆధారపడి ఉంటుందని ఇద్దరు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27న జరగనున్నది. -
బ్రిటిష్ ఆసియన్స్‌లో ధనిక కుటుంబం.. హిందూజా
లండన్: హిందూజా కుటుంబం బ్రిటన్‌లోని బ్రిటిష్ ఆసియన్లలో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. 2017లో ఈ కుటుంబ సంపద విలువ 22 బిలియన్ పౌండ్లు. హిందూజా కుటుంబానికి ఈ తరహా గుర్తింపు లభించడం ఇది వరుసగా ఐదవ ఏడాది. నలుగురు సోదరులు– శ్రీచంద్ పీ హిందూజా, గోపీచంద్ పీ హిందూజా, ప్రకాశ్ పీ హిందూజా, అశోక్ పీ హిందూజా నేతృత్వంలో లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిందూజా గ్రూప్– 2017లో వీరి కుటుంబ సంపద విలువను అంతక్రితం ఏడాదితో పోల్చితే 3 బిలియన్ పౌండ్లు పెంచింది. బ్రిటన్‌కు చెందిన ఆసియన్ మీడియా గ్రూప్ (ఏఎంజీ) ప్రచురించిన వార్షిక ‘ఆసియన్ రిచ్ లిస్ట్’ తాజా వివరాలను తెలిపింది. రెండవ స్థానంలో లక్ష్మీ మిట్టల్ జాబితాలో రెండవ స్థానం– ఇండియన్ స్టీల్ దిగ్గజం– లక్ష్మీ నివాస్ మిట్టల్‌కు దక్కింది. ఆయన సంపద 14 బిలియన్ పౌండ్లు. 2016లో ఈ విలువ 12.6 బిలియన్ పౌండ్లు. ఐదవ స్థానంలో అనిల్ అగర్వాల్ ►పెట్రోకెమికల్, టెక్స్టైల్స్ కంపెనీ– ఇండోరమా కార్పొరేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ ప్రకాశ్ లోహియా 5.1 బిలియన్ పౌండ్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. ►నాల్గవ స్థానంలో 2.35 బిలియన్ పౌండ్లతో పాకిస్తానీ అన్వర్ పర్వేజ్ (బెస్ట్‌వే వ్యవస్థాపకులు) ఉన్నారు. ►రిటైల్ దిగ్గజాలు సిమన్, బాబీ అండ్ రాబిన్ అరోరా, మెటల్ కింగ్ అనిల్ అగర్వాల్‌లు 2.3 బిలియన్ పౌండ్ల సంపదతో సంయుక్తంగా ఐదవ స్థానంలో నిలిచారు. సంపద మొత్తం 80.2 బిలియన్ డాలర్లు... ►దక్షిణాసియాలో మూలాలు ఉన్న 101 మంది బ్రిటన్ మిలియనీర్ల సంపద మొత్తంగా చూస్తే, 2017లో 80.2 బిలియన్ పౌండ్లు. 2016తో పోల్చితే ఈ సంపద 11 బిలియన్ పౌండ్లు పెరిగింది. వీరిలో మొదటి 10 మంది ప్రముఖ బ్రిటిష్ ఆసియన్ల సంపద 54.25 బిలియన్ పౌండ్లు. మొత్తం సంపదలో ఇది 68 శాతం. ►తాజా జాబితాను లండన్‌లో జరుగుతున్న 21వ వార్షిక ఆసియన్ బిజినెస్ అవార్డుల కార్యక్రమంలో లాంఛనంగా ఆవిష్కరిస్తారు. ఆర్థికంగా సవాళ్లు ఉన్నా... బ్రిటన్ ఆసియన్లు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుండటం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంకుకూ... ఈ అవార్డుల కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ (ఆసియన్ బిజినెస్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్), హోటల్స్ వ్యాపారవేత్త జోగీందర్ సింగ్ (బిజినెస్మెన్ ఆఫ్ ది ఇయర్), బ్రిటన్‌లో డిష్యూమ్ ఇండియన్ రెస్టారెంట్ల చైన్ చీఫ్ షామిల్ తక్రార్ (రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్)లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతుండటం గమనార్హం. -
ఫోర్బ్స్ ‘గ్రేటెస్ట్ బిజినెస్ మైండ్స్’లో మనోళ్లు ముగ్గురు
శత వార్షికోత్సవ జాబితాలో చోటు న్యూయార్క్: తన వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ప్రస్తుత జీవించివున్న వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, మేధావుల సమ్మేళనంతో ఫోర్బ్స్ మ్యాగజీన్ తాజాగా ‘వరల్డ్ 100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్’ జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. అర్సిలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్.. టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా ఇందులో ఉన్నారు. శతవార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన తాజా ప్రత్యేకమైన జాబితాలో డొనాల్డ్ ట్రంప్ కూడా స్థానం పొందారు. ఈయనతోపాటు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, వర్జిన్ గ్రూప్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్, బార్క్‌షైర్ హత్వే సీఈవో వారన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రూపెర్ట్ ముర్డోచ్ వంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే సీఎన్ఎన్ ఫౌండర్ టెడ్ టర్నర్, టాల్క్ షో మాస్టర్ ఓఫ్రా విన్ఫ్రే, డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు మైకేల్ డెల్, పేపాల్/ టెస్లా/ స్పేస్ఎక్స్ కో–ఫౌండర్ ఎలెన్ మాస్క్, ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్, స్టార్‌బక్స్ సీఈవో హోవర్డ్ షుల్జ్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ వంటి పలువురు స్థానం పొందారు. కొత్త ఆవిష్కరణలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న, ప్రపంచంపై తన వంతు ప్రభావాన్ని చూపిన 100 ఎంట్రప్రెన్యూర్లతో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. కాగా ఫోర్బ్స్ మ్యాగజైన్‌ను బీసీ ఫోర్బ్స్.. వాల్టర్ డ్రేయ్తో కలిసి 1917 సెప్టెంబర్ 17న ఏర్పాటు చేశారు. -
ఫోర్బ్స్ తాజా జాబితాలో.. ముగ్గురు మనవాళ్లే..!
సాక్షి, న్యూఢిల్లీ : దిగ్గజ భారతీయ వ్యాపార వేత్తలకు ఫోర్బ్స్ మేగజైన్ మరో కితాబునిచ్చింది. ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా హండ్రెడ్ గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్ పేరుతో ఒక జాబితాను రూపొందించింది. అందులో భారత్ నుంచి టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా, ఆర్సెలర్ అధినేత ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్, సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లాలకు అందులో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ మేగజైన్ ఆరంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను విడుదల చేసింది. అందులో వ్యాపార చరిత్రలో సంచలనాలు.. కొత్త పెట్టుబడులు ఎలా పెట్టాలి? వ్యాపారస్తుడి విజన్ ఎలా ఉండాలి? వంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా 100 వంది వ్యాపారస్తుల ఆలోచనలను.. వారి వ్యక్తగత, వ్యాపార విశేషాలను అందులో పొందుపరచడం జరిగింది. ఈ సంచితకపై ఫోర్బ్స్ సిబ్బంది మాట్లాడుతూ..ప్రముఖ వ్యాపారస్తులపై ప్రత్యేక మేగజైన్ తీసుకురావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
అత్యంత సంపన్న ఆసియన్లు వీరే..
లండన్ : ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త హిందూజా బ్రదర్స్ మరోసారి అత్యంత సంపన్న ఆసియన్ గా నిలిచారు. శుక్రవారం రాత్రి విడుదలైన బ్రిటన్ లో అత్యంత సంపన్న ఆసియన్ల వార్షిక ర్యాంకింగ్స్ లో హిందూజా మళ్లీ మొదటి స్థానంలో నిలిచినట్టు వెల్లడైంది. ఈయన మొత్తం సంపద 19 మిలియన్ పౌండ్స్ అంటే రూ.1,54,253 కోట్లకు పైననే. గతేడాది కంటే ఆయన సంపద దాదాపు 2.5 బిలియన్ పౌండ్లకు పైననే పెరిగినట్టు తాజా ర్యాంకింగ్స్ లో తెలిసింది. ఆయన తర్వాత స్థానాన్ని స్టీల్ టైకూన్ గా పేరున్న లక్ష్మి ఎన్ మిట్టర్ దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 6.4 బిలియన్ పౌండ్లను పెంచుకున్న లక్ష్మి మిట్టల్ 12.6 బిలియన్ పౌండ్ల(రూ.1,02,294కోట్లు)తో రెండో స్థానంలో నిలిచారు. బ్రిటన్ లో 101 అత్యంత సంపన్నపరుల ఆసియన్ల 2017 జాబితా శుక్రవారం రాత్రి విడుదలైంది. ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన హిందూజా బ్రదర్స్- లండన్ లోని శ్రీచంద్, గోపి, ముంబాయిలోని అశోక్, జెనీవాలో ప్రకాశ్ లు తమ అశోక్ లేల్యాండ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, గల్ఫ్ ఆయిల్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్ లలో భారీగా లాభాలను పెంచుకున్నారు. బ్రిటన్ లోని 101 సంపన్న ఆసియన్ల సంపద మొత్తం 69.9 బిలియన్ పౌండ్లు(రూ.5,67,492కోట్లకు పైనే)గా ఉంది.. గతేడాది కంటే ఇది 25 శాతం పెరిగింది. హిందూజా బ్రదర్స్, లక్ష్మి మిట్టల్ అనంతరం ఇండోరమ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ లోహియా మూడో సంపన్నవంతుడిగా ఉన్నారు. -
కింగ్ ఆఫ్ స్టీల్!
మన దిగ్గజాలు కష్టం అనుకుంటే... ఆ కష్టానికి పది కష్టాలు తోడై... విజయం ఎప్పుడూ కనిపించదు. ‘సాధించగలను’ అనే పట్టుదల ఉంటే కష్టం అనేది ఒంటరిదైపోతుంది. పోతూ పోతూ విజయాన్ని మన చేతిలో పెట్టి పోతుంది. ఇది సామాన్యుల విషయంలోనే కాదు అసామాన్యులని లోకం కీర్తించేవారి విషయంలోనూ జరిగింది. ‘ది కింగ్ ఆఫ్ స్టీల్’గా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ మిట్టల్ స్కూల్ చదువంతా హిందీ మీడియంలో సాగింది. కాలేజీ చదువు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో హిందీ మీడియం నుంచి వచ్చిన విద్యార్థి, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడలేని విద్యార్థి ఈ కాలేజీలో చదవడం కష్టం అంటూ మొదట్లో ప్రిన్సిపల్ సీటు నిరాకరించాడు. అయితే ప్రిన్సిపాల్ ఆలోచనా విధానం తప్పని తన ప్రతిభతో నిరూపించాడు మిట్టల్... కలకత్తా సెయింట్ జేవియర్ కాలేజీలో సీటు సంపాదించడమే కాదు చదువులో ఎప్పడికప్పుడు భేష్ అనిపించుకున్నాడు. ఇంగ్లిష్ మీడియంలో చదవడం మొదట కష్టంగానే అనిపించింది. అంతమాత్రాన మిట్టల్ వెనక్కు తగ్గలేదు. కష్టపడి చదివాడు. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. ‘ప్రతి ఒక్కరికీ తనను తాను నిరూపించుకునే సమయం వస్తుంది. ఆ సమయంలో చేస్తున్న పనిపట్ల శ్రద్ధ, అంకితభావం, కష్టపడేతత్వం ఉంటే... ఎంత పెద్ద సవాలైనా ఎదుర్కోవచ్చు’ అంటారు మిట్టల్. కాలేజీ రోజుల్లో తెలుసుకున్న ఈ విజయసూత్రం ఆ తరువాత వ్యాపారంలో కూడా ఆయన వెంటే నడిచింది. ఒక స్టీల్మిల్ను స్థాపించడానికి లక్ష్మీ మిట్టల్ తండ్రి మోహన్‌లాల్ మిట్టల్ ఇండోనేషియాలో కొంత భూమి తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సాధ్యపడేలా లేదనుకొని భూమిని అమ్మాలనుకున్నారు. సెలవుల్లో భాగంగా ఇండోనేషియా వెళ్లిన లక్ష్మీ మిట్టల్ భూమిని అమ్మడం మీద కంటే సమస్య మూలం మీదే దృష్టి కేంద్రీకరించాడు. ‘ఈ ప్రాజెక్ట్‌లో మనం ముందుకు వెళ్లవచ్చు. వెనక్కి తగ్గాల్సిన పనిలేదు’ అని చెప్పి సమస్య పరిష్కారం అయ్యేలా చేసి ప్రాజెక్ట్‌ను పట్టాలకెక్కించాడు. అక్కడ ‘స్టీల్ మిల్’ను మొదలుపెట్టిన తరువాత మిట్టల్‌కు వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. మెక్సికన్ గవర్నమెంట్ స్టీల్ పరిశ్రమను ప్రైవేటీకరించడానికి నిర్ణయం తీసుకుంది. తమ ప్రైవేటీకరణ ప్రక్రియలో ఆసక్తి చూపే ప్రపంచంలోని వివిధ స్టీల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. జపాన్ పారిశ్రామికవేత్తలతో మాట్లాడినప్పుడు మిట్టల్ కంపెనీ పేరు సూచించడాన్ని బట్టి మిట్టల్ అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న విషయం అర్థమవుతుంది. ట్రినిడాడ్ అండ్ టుబాగోలో ఒక ఉక్కు కంపెనీ నష్టాల బారిన పడింది. దానిని నష్టాల నుంచి బయటపడేయడానికి ఏవో ప్రయత్నాలు జరిగాయిగానీ అవేమీ ఫలించలేదు. ఈ పరిస్థితుల్లో ఆ కంపెనీని కొనుగోలు చేసి కొద్దికాలంలోనే లాభాల బాటలోకి తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మిట్టల్. ఇది మాత్రమే కాదు... ప్రపంచంలో ఏ మూల నష్టాల్లో ఉన్న ఉక్కు కంపెనీ కనిపించినా దాన్ని కొనుగోలు చేసి లాభాలబాటలో పయనింపచేసేవారు. సరికొత్త వ్యూహాలతో నష్టజాతక కంపెనీలను లాభాలబాట పట్టించడంతో ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేవారు. తన తెలివితేటలతో ఎన్నో దేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు మిట్టల్. ‘ఆర్సెలర్’ కొనుగోలుతో మరో సంచలనాత్మక ముందడుగు వేశారు మిట్టల్. ఉక్కు తయారీలో అగ్రగామి అయిన ‘ఆర్సెలర్’ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ‘ఇదొక దుస్సాహసం’ అని అన్నవారు లేకపోలేదు. ఉక్కుతయారీతో పాటు మైనింగ్, షిప్పింగ్, ఆటోమోటివ్, ప్యాకేజింగ్, నిర్మాణ రంగాలలో పని చేస్తుంది ‘అర్సెలర్ మిట్టల్’ సంస్థ. ‘‘చాలా గట్టి పోటీని తట్టుకుంటూ ఇన్ని విజయాలు ఎలా సాధించారు?’’ అనే ప్రశ్నకు- ‘‘పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ సమయంలో ఎదుటివారి గురించి ఆలోచించడం కంటే మన శక్తిసామర్థ్యాల గురించే ఎక్కువగా ఆలోచించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఈ విషయంలో టీమ్‌వర్క్ ముఖ్యం. అప్పుడు ఎంత పెద్ద విజయాన్ని అయినా సాధించవచ్చు’’ అంటారు. దశాబ్దాలుగా ఉక్కుపరిశ్రమలో కొనసాగుతున్న లక్ష్మీ మిట్టల్ వర్తమానానికి అవసరమైన పాఠాలను తన గత అనుభవాల నుంచి నేర్చుకుంటారు. మిట్టల్‌కు విజయం తెలుసు. సంక్షోభం తెలుసు. ఆ సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కోవడం తెలుసు. అందుకే లక్ష్మీ నారాయణ్ మిట్టల్ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచారు. -
మళ్లీ ముఖేష్దేమొదటి స్థానం
వాషింగ్టన్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారత్‌లో అత్యధిక సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. 23.6 బిలియన్ డాలర్ల ఆస్తితో ఆయన ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారని పోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ముఖేశ్ ఆస్తి గత ఏడాది కంటే 2.6 బిలియన్లు పెరిగింది. దీంతో ఆయన వరుసగా ఎనిమిదో ఏడాది కూడా భారత్‌లో అత్యధిక సంపన్నుల జాబితాలో తొలి స్థానాన్ని కొనసాగించారని పేర్కొంది. భారత్‌లో 100 అత్యధిక సంపన్నుల తాజా జాబితాను గురువారం వాషింగ్టన్లో విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి వంద మంది భారతీయులేని బిలయనీర్లేనని తెలిపింది. కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో స్టాక్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కిందని అభిప్రాయపడింది. అలాగే రెండవ స్థానాన్ని ప్రముఖ ఔషధ కంపెనీ సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సింఘ్వీ అక్రమించారని చెప్పింది. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఎన్నారై వ్యాపారీ, ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌ను ఐదో స్థానానికి నెట్టి మరీ దిలీప్ రెండవ స్థానాన్ని అందుకున్నారని పేర్కొంది. ఆ తర్వాత ఎనిమిది స్థానాలు వరుసగా 16.4 బిలియన్ డాలర్లతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, 15.9 బిలియన్ డాలర్లతో టాటా గ్రూప్ అధినేత పల్లొంజి మిస్త్రీ, 15.8 బిలియన్లతో లక్ష్మీ నివాస్ మిట్టల్, 13.3 బిలియన్లతో హిందూజా బ్రదర్స్, రూ. 12.5 బిలియన్లతో శివ నాడర్, 11.6 బిలియన్లతో గోద్రెజ్ ఫ్యామిలీ, 9.2 బిలియన్లతో కుమార్ బిర్లా, రూ.7.8 బిలియన్లతో సునీల్ మిట్టల్ ఉన్నారని పోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది. -
కుబేర సంపద సగం వీరిదే
న్యూఢిల్లీ: టాప్ 5 భారతీయ కుబేరుల ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 8,550 కోట్ల డాలర్లు! మన కరెన్సీలో రూ.5,23,897 కోట్లు. భారత్‌లో 100 కోట్ల డాలర్లకుపైగా వ్యక్తిగత సంపద ఉన్న శ్రీమంతుల మొత్తం ఆస్తుల విలువలో ఇది దాదాపు సగమని వెల్త్ రీసెర్చ్ కంపెనీ వెల్త్-ఎక్స్ విశ్లేషించింది. దేశంలోని కుబేరుల సిరిసంపదలపై కంపెనీ ఇటీవలే అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించింది. ముకేశ్ అంబానీదే అగ్రస్థానం... రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 2,440 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,49,474 కోట్లు) సంపదతో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఉక్కు రంగ దిగ్గజం లక్ష్మీ మిట్టల్, సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, టాటా సన్స్ వాటాదారు పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విలువైన ముంబై ఇండియన్స్ టీమ్ ముకేశ్ అంబానీకి చెందినదే. ఈ టీమ్ విలువ 11.20 కోట్ల డాలర్లుంటుందని అంచనా. స్టీల్ టైకూన్ మిట్టల్... ప్రపంచంలో ఉక్కును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్, ఎన్నారై పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ నెట్‌వర్త్ 1,720 కోట్ల డాలర్లు. ఆర్సెలర్ మిట్టల్లో 38 శాతం షేరుతో పాటు క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఫుట్‌బాల్ క్లబ్లో 33 శాతం వాటా మిట్టల్‌కు ఉంది. అత్యంత సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న దిలీప్ సంఘ్వీకి 1,563 కోట్ల డాలర్లు, నాలుగో స్థానంలోని విప్రో ప్రేమ్‌జీకి 1,490 కోట్ల డాలర్లు, ఐదో ర్యాంకులోని పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీకి 1,270 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. విద్య, వైద్యం, పర్యావరణం, సామాజిక సంక్షేమం వంటి రంగాలకు ఇతోధిక తోడ్పాటు అందించేందుకు ఈ ఐదుగురు కుబేరులూ ఫౌండేషన్లను ఏర్పాటు చేశారని వెల్త్-ఎక్స్ తెలిపింది. బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్‌కు 60 కోట్ల డాలర్లు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు 16 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయని పేర్కొంది. -
బ్రిటన్‌లో పర్వతాన్ని కొన్న లక్ష్మి మిట్టల్
-
మిట్టల్‌ను మించిన హిందుజా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపన్నుల కేంద్రంగా విరాజిల్లుతున్న బ్రిటన్‌లో మన భారతీయులు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు గోపిచంద్, శ్రీచంద్లు బ్రిటన్‌లో అత్యంత సంపన్నులుగా నిలిచారు. వీరి సంపద 11.9 బిలియన్ పౌండ్లు. అంటే రూ.1,20,190 కోట్లు. వచ్చే వారం విడుదల కానున్న సండే టైమ్స్ యూకే సూపర్ రిచ్ వార్షిక జాబితా ముందస్తు గణాంకాల ప్రకారం.. రష్యా వ్యాపారవేత్త అలిషర్ ఉస్మనోవ్ 10.65 బిలియన్ పౌండ్లతో (రూ.1,07,565 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు. గతేడాది ఆయన తొలి స్థానంలో ఉన్నారు. ఇక కోల్‌కతాలో పుట్టిన లక్ష్మీ మిట్టల్ 10.25 బిలియన్ పౌండ్లతో (రూ.1,03,525 కోట్లు) 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. వాహన, రియల్ ఎస్టేట్, చమురు తదితర రంగాల్లో హిందుజా గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంకా ఉన్నారు.. బ్రిటన్ సంపన్నుల్లో మరింత మంది భారత సంతతివారు తమ స్థానాలను పదిలపర్చుకున్నారు. లక్ష్మీ మిట్టల్ సమీప బంధువు వస్త్ర, ప్లాస్టిక్ రంగంలో ఉన్న ప్రకాశ్ లోహియా 46వ ర్యాంకు దక్కించుకున్నారు. స్టీలు కంపెనీ కపారో అధినేత లార్డ్ స్వరాజ్‌పాల్ 48వ స్థానంలో నిలిచారు. మెటల్, మైనింగ్ రంగంలో ఉన్న వేదాంతా రిసోర్సెస్ చీఫ్ అనిల్ అగర్వాల్ 50వ ర్యాంకు దక్కించుకున్నారు. ఇండస్ గ్యాస్ ఫౌండర్ అజయ్ కల్సి 102వ స్థానంలో నిలిచారు. చమురు, సహజ వాయువు, పాదరక్షలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పలు కంపెనీలను అజయ్ నిర్వహిస్తున్నారు. సూపర్ రిచ్ టాప్-100 జాబితాలో చోటు సంపాదించాలంటే నికర విలువ 1 బిలియన్ పౌండ్లు (రూ.10,100 కోట్లు) దాటాలి. ఇక టాప్ 50 జాబితాకైతే సంపద 1.7 బిలియన్ పౌండ్లు (రూ.17,170 కోట్లు) ఉండాల్సిందే. 10 ఏళ్ల క్రితం 70 కోట్ల పౌండ్లు ఉంటే టాప్ 50 జాబితాలో చోటు దక్కేది. సంపన్నుల నగరం లండన్.. సూపర్ రిచ్ వార్షిక జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా బిలియనీర్లున్న నగరంగా లండన్ నిలి చింది. బ్రిటన్ తొలిసారిగా 100కుపైగా సంపన్నులతో కిక్కిరిసిపోయింది. మొత్తం 104 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన 301 బిలియన్ పౌండ్లు దాటింది. అంటే రూ.30,40,100 కోట్లుగా ఉంది. ఇక కేవలం లండన్ నగరం నుంచే 72 మంది బిలియనీర్లు పోటీపడుతున్నారు. 48 మంది బిలియనీర్లతో మాస్కో, ఆ తర్వాతి స్థానాల్లో న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోలు ఉన్నాయి. కాగా, 104 మంది సంపన్నుల్లో బ్రిటన్ వెలుపల జన్మించిన వారు 44 మంది ఉండడం విశేషం. లండన్ ప్రభుత్వం గురించి సంపన్నుల జాబితా రచయిత ఫిలిప్ బెరెస్ఫోర్డ్ మాట్లాడుతూ పన్నుల విధానం, భద్రతా కారణంగా లండన్ ప్రపంచ ఆర్థిక కేంద్రంగా నిలిచిందన్నారు. -
బ్రిటన్‌లో ‘ఆసియా’ కుబేరులు హిందుజాలు
లండన్: పారిశ్రామిక దిగ్గజాలు హిందుజా సోదరులు.. వరుసగా రెండవ ఏడాదీ బ్రిటన్‌లోనే అత్యంత సంపన్న ఆసియన్లుగా నిల్చారు. 13.5 బిలియన్ పౌండ్లకు పైగా (సుమారు రూ. 1,36,000 కోట్లు) సంపదతో ఆసియన్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. క్రితం ఏడాదితో పోలిస్తే వారి సంపద బిలియన్ పౌండ్లు పెరిగింది. ఆసియన్ మీడియా అండ్ మార్కెటింగ్ గ్రూప్‌కి చెందిన ఈస్టర్న్‌ఐ ప్రచురణ సంస్థ రూపొందించిన ఆసియన్ రిచ్ లిస్ట్ 101 జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 12 బిలియన్ పౌండ్ల సంపదతో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 2వ స్థానంలో నిల్చారు. ఇక, 750 మిలియన్ పౌండ్ల సంపదతో ఎన్నారై పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ 10వ స్థానంలో ఉన్నారు. కాగా హిందుజా గ్రూప్.. ఆసియన్ బిజినెస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని కూడా దక్కించుకుంది. అటు టాటా గ్రూప్.. ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డును అందుకుంది. బ్రిటన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రిటన్ విద్యా మంత్రి మైఖేల్ గోవ్ ఈ పురస్కారాలను అందజేశారు. సంపన్నుల జాబితాలోని 101 మంది కుబేరుల మొత్తం సంపద 52 బిలియన్ పౌండ్ల మేర ఉంటుంది. ఇది 2013తో పోలిస్తే 6 బిలియన్ పౌండ్లు అధికం. -
అదరగొడుతున్న భారత సంతతి
భారత సంతతి అంతర్జాతీయ స్థాయిలో పలు అతి పెద్ద సంస్థల పగ్గాలు చేపట్టి తమ సత్తా చాటుతున్నారు. విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉద్యోగాలు చేస్తున్న టాప్ టెన్ అత్యంతకీలక సిఇఓల సరసన ఇప్పుడు సత్య నాదెళ్ల చేరారు. ప్రమోటర్ కాకుండా అతి పెద్ద సాప్ట్వేర్ కంపెనీ మైక్రోసాప్ట్కు సత్య సిఇఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇంద్రనూయి, లక్ష్మిమిట్టల్, అన్షుజైన్,ఇవాన్ మెనెంజీస్ లాంటి భారతీయ సంతతికి చెందిన వారు విదేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. దాదాపుగా 12 మంది భారతీయ సంతతికి చెందిన వారు వరల్డ్ టాప్‌కంపెనీల్లో అత్యున్నత సిఇఒ పదవుల్లో కొనసాగుతుండటం గర్వకారణం. అటువంటివాటిలో మైక్రోసాప్ట్, పెప్సికో, ఆర్సిలర్ మిట్టల్, డాయిచీ బ్యాంక్, డియాగో, మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీలున్నాయి. ఇంతకు ముందు సిటీ గ్రూప్, వోడాఫోన్, మోటరోలా కంపెనీల సిఇఒలు సైతం భారతీయ సంతతికి చెందిన వారే ఉండేవారు. అతి పెద్ద కంపెనీలు ఆర్సిలర్ మిట్టల్(లక్ష్మీమిట్టల్), రెక్కిట్ బెంకైజర్(రాకేష్ కపూర్), మాస్టర్ కార్డ్(అజయ్ బంగా), డిబిఎస్ గ్రూప్ హోల్డింగ్స్(పియూష్ గుప్త), శాన్డిస్క్(సంజయ్ మెహ్రోత్ర),గ్రోబల్ ఫౌడ్రీస్( సంజయ్ ఝా), ఎడాబ్(శంతనుడు నారాయెన్) భారత సంతతి సారధ్యంలోనే నడుస్తున్నాయి. ఇవాన్ మెనెంజీస్ గత సంవత్సరం యుకె కేంద్రంగా నిర్వహించే అతి పెద్ద మద్యం వ్యాపార సంస్థ డియాజియోకు చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అన్షుజైన్ జర్మనీకి చెందిన డాయిచీ బ్యాంక్‌కు కో-సిఇఓగా వ్యవహరిస్తున్నారు. గతంలో అతి పెద్ద సంస్థలైన సిటీగ్రూప్, ఓడాఫోన్, మోట్రోలా వంటి కంపెనీలకు కూడా భారత సంతతికి చెందినవారే సిఇఓలుగా వ్యవహరించారు. భారత సంతతి సిఇఓలుగా వ్యవహరించే 10 టాప్ కంపెనీల వ్యాపారం విలువ అక్షరాల 350 బిలియన్ డాలర్లని అంచనా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వారి సారధ్యంలో నడిచే వ్యాపారం విలువ భారత ఎగుమతులకంటే ఎక్కువగా ఉంటుందని ఒక అంతర్జాతీయ మ్యాగజైన్ వెల్లడించింది. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో కూడా భారత సంతతి ఉన్నత పదవులు అధిష్టించి తమ ప్రతిభను చాటుతున్నారు. మానవ వనరుల నిపుణుల అంచనాల ప్రకారం భారతదేశంలో నిపుణులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. భారతీయ నిపుణులు సాంకేతికంగా మంచి నైపుణ్యం గలవారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోని ముందుకు సాగిపోగల సమర్ధులని తేల్చారు. s.nagarjuna@sakshi.com మైక్రోసాప్ట్ సిఇఓగా సత్య నాదెళ్ల ఫోటోలు... -
ఐపీఎల్ వైపు మిట్టల్ చూపు!
ముంబై: అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్ కూడా ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ లీగ్‌లో ముకేశ్ అంబానీతో పాటు విజయ్ మాల్యా లాంటి వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. అయితే ఐపీఎల్లో ఆట పరంగా, ఆర్థికంగానూ అంత లాభసాటిగా లేని ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో వాటా తీసుకునేందుకు మిట్టల్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆయన అల్లుడు అమిత్ శర్మ జీఎంఆర్ గ్రూప్‌తో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో క్వీన్స్ పార్క్ రేంజర్స్ జట్టులోనూ మిట్టల్‌కు వాటాలున్నాయి. అయితే ఆ జట్టు ప్రదర్శన కూడా పేలవంగా ఉంది. మరోవైపు ఆర్పీజీ గ్రూపు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టులో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా తమ ఆర్థిక భారాన్ని పంచుకునేందుకు వాటాదార్ల కోసం చూస్తున్నట్టు వినికిడి. -
మళ్లీ ముఖేశ్‌కే పట్టం...
న్యూయార్క్: అత్యంత సంపన్న భారతీయుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేశ్ అంబానీ ఆరో ఏడాది కూడా నిలిచారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ రూపొందించిన భారత కుబేరుల జాబితాలో 2,100 కోట్ల డాలర్ల సంపదతో ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. 2013 ఏడాదికి అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 100 అత్యంత సంపన్న భారతీయుల జాబితాను మంగళవారం వెల్లడించింది. ఈ జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లకు.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కుటుంబం, దివీస్ ల్యాబ్స్‌కు చెందిన మురళి, జీఎంఆర్ గ్రూప్ అధిపతి జీఎంరావులకు స్థానం లభించింది. ఈ నెల 18నాటి స్టాక్ మార్కెట్ ధరల ఆధారంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. ఉక్కు సామ్రాట్ లక్ష్మీ మిట్టల్ 1,600 కోట్ల డాలర్ల సంపదతో రెండోస్థానంలో నిలిచారు. ఇక మూడో స్థానంలోకి సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ దూసుకువచ్చారు. ఆయన సంపద ఈ ఏడాది 50%(470 కోట్ల డాలర్లు) వృద్ధి చెంది 1,390 కోట్ల డాలర్లకు పెరిగింది. గతేడాది మూడో స్థానంలో ఉన్న విప్రో ప్రేమ్‌జీ(ఈ ఏడాది 4) ని తోసిరాజని సంఘ్వీ మూడో స్థానంలోకి వచ్చారు. నిర్మాణ రంగ దిగ్గజం, షాపూర్జీ పల్లోంజి గ్రూప్ అధినేత పల్లోంజి మిస్త్రీ 1,250 కోట్ల డాలర్ల సంపదతో ఐదో స్థానంలో ఉన్నారు. టాటా గ్రూప్‌కు రతన్ టాటా స్థానంలో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సైరస్ మిస్త్రీ ఈయన కుమారుడే. ఈ ఏడాది జాబితాలో బిలియనీర్ల (వంద కోట్ల డాలర్ల సంపద) సంఖ్య 65కు పెరిగింది. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య నాలుగు అధికం. టాప్-100 సంపన్నుల సంపద ఏడాది కాలంలో 3% వృద్ధి చెంది 25,900 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక టాప్ 100 భారత సంపన్నుల జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లకు చోటు దక్కింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన అంజిరెడ్డి కుటుంబం 175 కోట్ల డాలర్ల సంపదతో 31వ స్థానంలో నిలిచింది. 116 కోట్ల డాలర్ల సంపదతో దివీస్ మురళి 60వ స్థానంలోనూ, 102 కోట్ల డాలర్లతో జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన గ్రంధి మల్లికార్జున రావు 63వ స్థానంలోనూ ఉన్నారు. మహిళలు ఐదుగురే.. టాప్ 100 భారత సంపన్నుల జాబితాలో ఐదుగురు మహిళలకే స్థానం దక్కింది. ఈ ఏడాది జాబితాలో సావిత్రి జిందాల్(జిందాల్ గ్రూప్-14 వ స్థానం-490 కోట్ల డాలర్లు), ఇందు జైన్(బెనెట్ కోల్మన్ కంపెనీ-29వ స్థానం-190 కోట్ల డాలర్లు), అను అగా(థెర్మాక్స్-86వ స్థానం-73 కోట్ల డాలర్లు), కిరణ్ మజుందార్ షా(బయోకాన్-96వ స్థానం-65.5 కోట్ల డాలర్లు), శోభన భర్తియ(హిందూస్తాన్ టైమ్స్-98వ స్థానం-64.5 కోట్ల డాలర్లు)లు ఉన్నారు.