సాక్షి, న్యూఢిల్లీ: భారతకుచెందిన వ్యాపారవేత్త, స్టీల్ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం, అధికార దుర్వినియోగం ఆరోపణలతో బోస్నియాలో బుధవారం అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈశాన్య పట్టణం లుకావాక్‌లో ఒక కోకింగ్ ప్లాంట్ కేసుకు సంబంధించి ప్రమోద్ మిట్టల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
వ్యవస్థీకృత నేరం, అధికారం దుర్వినియోగం ద్వారా నేరపూరిత చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. ప్రమోద్ మిట్టల్‌తోపాటు, కంపెనీ జనరల్ మేనేజర్ పరమేష్ భట్టాచార్య, పర్యవేక్షక బోర్డు సభ్యుడు రజీబ్ డాష్‌ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తుజ్లా కంటోనల్ ప్రాసిక్యూషన్ విభాగం ప్రాసిక్యూటర్ కాజిమ్ సెర్హాట్లిక్ స్థానిక మీడియాకు తెలిపారు. నిర్వహిస్తోంది. దాదాపు వెయ్యిమందికిపైగా ఉద్యోగులుఉన్నారు. నిందితులను కోర్టుముందు హాజరుపర్చనున్నామని చెప్పారు. ఈ కేసులో దోషులుగా తేలితే 45 సంవత్సరాలదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే నాలుగవ నిందితుడిపై అరెస్ట్ వారంట్ జారీ చేశామన్నారు. అయితే ఈ పరిణామంపై కంపెనీ ప్రతినిధులు ఇంకా స్పందించాల్సి ఉంది.
కాగా బోస్నియాలో అతిపెద్ద ఎగుమతిదారులలో ఒకటి, మెటలర్జికల్ కోక్ ప్రొడ్యూసర్ గ్లోబల్ ఇస్పాత్ కోక్స్నా ఇండస్ట్రిజా లుకావాక్ (జికిల్) నేతృత్వంలోని 2003 నుంచి ప్రమోద్‌మిట్టలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాదాపు వెయ్యిమందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment