bosnia
-
లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్ హౌస్ కట్టించాడు!!
ప్రేమకు చిహ్నం చూపమంటే.. షాజహాన్ తన భార్య కోసం కట్టిన తాజ్‌మహల్ వెంటనే మదిలో మెదులుతుంది. ఐతే తరాలుగా ఎందరో తమకు ఇష్టమైన వారికోసం ఎన్నో కట్టారు. కానీ అంతగా గుర్తింపుకు నోచుకోలేదు. తాజాగా ఉత్తర బోస్నియాకు చెందిన 72 యేళ్ల వ్యక్తి భార్య కోసం రొటేటింగ్ హౌస్‌ను కట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆకు పచ్చ ముఖభాగం, రెడ్ మెటల్ రూఫ్‌తో 360 యాంగిల్లో తిరిగే ఈ రొటేటింగ్ హౌస్‌ను వోజిన్ కుసిక్ అనే వ్యక్తి, తన భార్య లుబికా కోసం నిర్మించాడు. కాలేజీ చదువుకూడా లేని కుసిక్ ఈ రొటేట్ హౌస్‌ను స్వయంగా డిజైన్ చేశాడట. కేవలం ఎలక్ట్రిక్ మోటార్లు, పాత మిలిటరీ రవాణా వాహన చక్రాలను ఉపయోగించి కట్టాడని అక్కడి స్థానిక మీడియాకు వెల్లడించాడు. జీవిత చరమాంకానికి చేరుకున్న తర్వాత, పిల్లలు కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఇన్నేళ్లకి నా భార్య కోరిక తీర్చడానికి సమయం దొరికిందని చెప్పుకొచ్చాడు. కుసిక్ వివాహం చేసుకున్నాక భార్య, బిడ్డల కోసం అప్పట్లో ఒక ఇంటిని నిర్మించాడట. ఐతే ఆ టైంలో బెడ్ రూం సూర్యునికి ముఖాముఖిగా ఉండాలని భార్య కోరడంతో, భార్య అభీష్టానికి తగినట్లుగా గదుల నిర్మాణాన్ని మార్చాడు. రోడ్డుకి ఎదురుగా ముఖ ద్వారం వచ్చింది. దీంతో రోడ్డు మీద వెళ్లేవారందరినీ చూడాలనుకోవడం లేదని భర్తకు పిర్యాదు చేసింది భార్య. చాలా కష్టమైన పనైనప్పటికీ భార్య కోరుకున్నట్లు ప్రతిదీ మార్చవలసి వచ్చేదట. ‘ఇప్పుడైతే, మా ముందు తలుపు కూడా తిరుగుతుంది. రోడ్డు మీద వ్యక్తులెవరైనా కనిపిస్తే, ఆమె ఇంటిని తనకిష్టం వచ్చిన వైప్పుకు తిప్పుకోవచ్చు’అని సరదాగా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నాడు. దీంతో ఈ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! -
భారత పారిశ్రామికవేత్త అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: భారతకుచెందిన వ్యాపారవేత్త, స్టీల్ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం, అధికార దుర్వినియోగం ఆరోపణలతో బోస్నియాలో బుధవారం అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈశాన్య పట్టణం లుకావాక్‌లో ఒక కోకింగ్ ప్లాంట్ కేసుకు సంబంధించి ప్రమోద్ మిట్టల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. వ్యవస్థీకృత నేరం, అధికారం దుర్వినియోగం ద్వారా నేరపూరిత చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. ప్రమోద్ మిట్టల్‌తోపాటు, కంపెనీ జనరల్ మేనేజర్ పరమేష్ భట్టాచార్య, పర్యవేక్షక బోర్డు సభ్యుడు రజీబ్ డాష్‌ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తుజ్లా కంటోనల్ ప్రాసిక్యూషన్ విభాగం ప్రాసిక్యూటర్ కాజిమ్ సెర్హాట్లిక్ స్థానిక మీడియాకు తెలిపారు. నిర్వహిస్తోంది. దాదాపు వెయ్యిమందికిపైగా ఉద్యోగులుఉన్నారు. నిందితులను కోర్టుముందు హాజరుపర్చనున్నామని చెప్పారు. ఈ కేసులో దోషులుగా తేలితే 45 సంవత్సరాలదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే నాలుగవ నిందితుడిపై అరెస్ట్ వారంట్ జారీ చేశామన్నారు. అయితే ఈ పరిణామంపై కంపెనీ ప్రతినిధులు ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా బోస్నియాలో అతిపెద్ద ఎగుమతిదారులలో ఒకటి, మెటలర్జికల్ కోక్ ప్రొడ్యూసర్ గ్లోబల్ ఇస్పాత్ కోక్స్నా ఇండస్ట్రిజా లుకావాక్ (జికిల్) నేతృత్వంలోని 2003 నుంచి ప్రమోద్‌మిట్టలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాదాపు వెయ్యిమందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. -
బోస్నియాలో 'బాహుబలులు'
-
ఒక్క బుల్లెట్ ప్రపంచ చరిత్రనే మార్చేసింది!
వందేళ్ల కింద పేలిన ఒక్క బుల్లెట్ ప్రపంచచరిత్రను మార్చేసింది. నాలుగేళ్లు ప్రపంచమంతా రణసీమగా మారిపోయింది. లక్షల మంది చనిపోయారు. అవును... సరిగ్గా ఇదే రోజు అంటే జూన్ 28, 1914 న ఒక 19 ఏళ్ల కుర్రాడు పేల్చిన తుపాకీ మొదటి ప్రపంచయుద్ధానికి దారితీసింది. సెర్బియాకి చెందిన గావ్రిలో ప్రిన్సిప్ అనే జాతీయ వాది ఆస్ట్రియా ప్రభువు ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీలను కాల్చి చంపాడు. ఈ సంఘటన బోస్నియా రాజధాని సరయేవోలో జరిగింది. బోస్నియాకు ఆస్ట్రియా నుంచి స్వాతంత్ర్యాన్ని కోరుతూ వారీ కాల్పులు జరిపారు. నలుగురు బోస్నియన్ యువకులు ప్రభువును చంపేందుకు పథకం వేశారు. ఫెర్నినాండ్ ఓపెన్ టాప్ జీపులో, పూర్తి సైనిక వేషధారణలో ఊరేగుతుండగా నలుగురు యువకులు ఆయనపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో ముగ్గురు చివరి నిమిషంలో భయపడి బాంబులు వేయలేదు. నెడెల్కో కాబ్రినోవిచ్ అనే నాలుగో వ్యక్తి బాంబు వేశాడు. కానీ అది ఫెర్డినాండ్ కారుకి తగిలి కింద పడిపోయింది. ఆయనకు గాయాలు కాలేదు కానీ చాలా మంది ప్రజలు గాయపడ్డారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న వారిని చూసేందుకు ఫెర్డినాండ్ మరో కారులో బయలుదేరాడు. అదే సమయంలో డ్రైవర్ దారి తప్పి ఒక ఇరుకు సందులోకి వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడ తుపాకీతో నిలబడి ఉన్న గావ్రిలో ప్రిన్సిప్ కి గోల్డెన్ చాన్స్ వచ్చింది. ఒక బుల్లెట్ తో ఫెర్డినాండ్ గొంతు చీల్చేశాడు, రెండో బుల్లెట్ తో సోఫీని కాల్చేశాడు. దీంతో ఆస్ట్రియా బోస్నియాపై యుద్ధం ప్రకటించింది. అక్కడి నుంచే రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ వంటి దేశాలన్నీ యుద్ధంలోకి దిగాయి. ఈ యుద్ధంలోనే తొలి సారి ట్రెంచ్ వార్ ఫేర్ మొదలైంది. ఈ యుద్ధం ప్రపంచ చరిత్రను, ప్రపంచ చిత్రపటాన్ని మార్చేసింది. శనివారం మొదటి ప్రపంచ యుద్ధం మొదలై వందేళ్లు పూర్తయింది.