భారతీయ కుటుంబాలలో అల్లుడికి విశిష్ట హోదా ఉంటుంది. ప్రత్యేకించి సంపన్న కుటుంబాల వివాహాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాల్లో అల్లుడికి స్వాగత సత్కారాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఓ వివాహం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అల్లుడు, మామగార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆరు రోజుల పాటు గ్రాండ్ వెడ్డింగ్
బిలియనీర్ స్టీల్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ తన కుమార్తె, అల్లుడి వివాహాన్ని మరచిపోలేని వేడుకగా మార్చాలనుకున్నారు. ఖర్చు ఏమాత్రం వెనుకాడకుండా వనీషా మిట్టల్, అమిత్ భాటియాల వివాహం జరిపించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఆరు రోజులపాటు ఈ వివాహ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. 2004లో జరిగిన ఈ పెళ్లికి రూ. 240 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి.
పారిస్ నగరం మొత్తం ఈ వేడుకను జరుపుకుంటున్నట్లు అనిపించేంతగా ఏర్పాట్లు చేశారు. ప్రఖ్యాత సెలబ్రిటీ చెఫ్ మున్నా మహారాజ్‌ను భారత్ నుండి ఫ్రాన్స్‌కు రప్పించారు. ఈ గ్రాండ్ ఇండియన్ వెడ్డింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది అతిథులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీతో సహా బాలీవుడ్, హాలీవుడ్ తారలు తమ ప్రదర్శనలతో హంగామా చేశారు. అంతర్జాతీయ పాప్ సంచలనం కైలీ మినోగ్ కూడా పెళ్లిలో ప్రదర్శన ఇచ్చారు. రూ. ఒక గంట ప్రదర్శనకు ఆమె రూ. కోటి తీసుకున్నట్లు చెబుతారు.
ఎవరీ అమిత్ భాటియా ?
అమిత్ భాటియా బ్రిటీష్-ఇండియన్ వ్యాపారవేత్త, బిలియనీర్ ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ అల్లుడు. అయేబే క్యాపిటల్ (గతంలో స్వోర్డ్ ఫిష్ ఇన్వెస్ట్‌మెంట్స్ )వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్. అమిత్ తన ప్రాథమిక విద్యను ఢిల్లీలో పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లారు.
అమిత్ తన వృత్తిపరమైన ప్రయాణాన్ని న్యూయార్క్‌లో మెరిల్ లించ్, మోర్గాన్ స్టాన్లీతో ప్రారంభించారు. వెస్ట్ లండన్‌లోని షెపర్డ్స్ బుష్‌లో ఉన్న ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఎఫ్‌సీకి ఆయన సహ-యజమాని. క్రీడలతో పాటు అమిత్ వ్యాపార సంస్థలు రియల్ ఎస్టేట్, సాంకేతిక రంగాల్లో విస్తరించాయి. స్ట్రాటజిక్ లాండ్ అండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అయిన సమ్మిక్స్ క్యాపిటల్‌లో ఈయన వ్యవస్థాపక భాగస్వామి.
గతంలో 2016 ఆగస్టులో బ్రీడాన్ గ్రూప్‌ను కొనుగోలు చేసే వరకు హోప్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత బ్రీడాన్ గ్రూప్ బోర్డ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా చేరారు. కార్పొరేట్ ఫైనాన్స్, ప్రైవేట్ ఈక్విటీలో 20 సంవత్సరాల అనుభవంతో అమిత్ భాటియా విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. వనీషా మిట్టల్, అమిత్ భాటియా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment