ప్రపంచ వ్యాప్తంగా సాకర్ ( ఫుట్ బాల్ ) అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఖతర్ లుసైల్ గ్రౌండ్ వైపు స్టేడియంలోని అభిమానులే కాదు.. వరల్డ్ వైడ్ సాకర్ లవర్స్ అర్జెంటీనా, ఫ్రాన్స్ ఆటతీరును తీక్షణంగా చూస్తున్నారు.
అదే సమయంలో స్టాండ్స్‌లో ఉన్న మరి కొంత మంది ఫోటోలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగుబడుతున్నారు. నరాలు తెగే ఉత్కంఠతతో మ్యాచ్ జరుగుతుంటే...ఆక్కడ ఏం జరుగుతుందో అర్ధంగాక ఆటను కవర్ చేస్తున్న కెమెరామెన్ తన చూపును స్టాండ్ వైపు మరల్చారు.
అంతే మస్క్..మస్క్ అంటూ ఆయన అభిమానులు హోరెత్తించారు. దీంతో మస్క్ సైతం అభిమానులకు అభివాదం చేశారు. ఆటోగ్రాఫ్స్,షేక్ హ్యాండ్స్ ఇచ్చి కొద్ది సేపు అలరించారు. క్షణం తీరిక లేకుండా వ్యాపార రంగంలో తలమునకలయ్యే ఎలాన్ మస్క్ ఖతర్ సాకర్ మ్యాచ్‌లో ప్రత్యక్షమవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక, మస్క్‌తో పాటు ఆర్సెలర్ మిట్టల్ సీఈవో లక్ష్మీ మిట్టల్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జార్డ్ కుష్నర్‌లు ఉన్నారు.
At World Cup right now pic.twitter.com/CG7zMMxSjE
— Elon Musk (@elonmusk) December 18, 2022
మ్యాచ్ జరుగుతుండగా ఈ ముగ్గురు వ్యాపార దిగ్గజాలు సీరియస్‌గా మాట్లాడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా మస్క్ సాకర్ మ్యాచ్‌కు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. కానీ ఆయన మాత్రం మ్యాచ్ జరుగుతున్నంత సేపు కామెంటేటర్ అవతారం ఎత్తారు.
మొదటి సగం ఆట తర్వాత మస్క్ తన అభిమానుల్ని ఇలా అడిగారు.‘సూపర్ ఎక్సైటింగ్ వరల్డ్ కప్. అర్ధ సమయానికి అర్జెంటీనా 2-0తో ముందంజలో ఉంది. ఫ్రాన్స్ తిరిగి పుంజుకుంటుందా? అని ప్రశ్నించారు.
Super exciting World Cup!
— Elon Musk (@elonmusk) December 18, 2022
🇦🇷 ahead 2-0 at halftime.
Can 🇫🇷 come back?
ఫ్రాన్స్ సాకర్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపే అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన తర్వాత, ‘ఫ్రాన్స్ గోల్ కోసం సెకనుకు 24,400 ట్వీట్లు, ప్రపంచ కప్‌లో అత్యధికం! అంటూ ట్వీట్ చేశారు.
24,400 tweets per second for France’s goal, highest ever for World Cup!
— Elon Musk (@elonmusk) December 18, 2022
Comments
Please login to add a commentAdd a comment