Jared Kushner
-
వైరల్: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అదిరిపోయే ట్విస్ట్!
ప్రపంచ వ్యాప్తంగా సాకర్ ( ఫుట్ బాల్ ) అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఖతర్ లుసైల్ గ్రౌండ్ వైపు స్టేడియంలోని అభిమానులే కాదు.. వరల్డ్ వైడ్ సాకర్ లవర్స్ అర్జెంటీనా, ఫ్రాన్స్ ఆటతీరును తీక్షణంగా చూస్తున్నారు. అదే సమయంలో స్టాండ్స్‌లో ఉన్న మరి కొంత మంది ఫోటోలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగుబడుతున్నారు. నరాలు తెగే ఉత్కంఠతతో మ్యాచ్ జరుగుతుంటే...ఆక్కడ ఏం జరుగుతుందో అర్ధంగాక ఆటను కవర్ చేస్తున్న కెమెరామెన్ తన చూపును స్టాండ్ వైపు మరల్చారు. అంతే మస్క్..మస్క్ అంటూ ఆయన అభిమానులు హోరెత్తించారు. దీంతో మస్క్ సైతం అభిమానులకు అభివాదం చేశారు. ఆటోగ్రాఫ్స్,షేక్ హ్యాండ్స్ ఇచ్చి కొద్ది సేపు అలరించారు. క్షణం తీరిక లేకుండా వ్యాపార రంగంలో తలమునకలయ్యే ఎలాన్ మస్క్ ఖతర్ సాకర్ మ్యాచ్‌లో ప్రత్యక్షమవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక, మస్క్‌తో పాటు ఆర్సెలర్ మిట్టల్ సీఈవో లక్ష్మీ మిట్టల్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జార్డ్ కుష్నర్లు ఉన్నారు. At World Cup right now pic.twitter.com/CG7zMMxSjE — Elon Musk (@elonmusk) December 18, 2022 మ్యాచ్ జరుగుతుండగా ఈ ముగ్గురు వ్యాపార దిగ్గజాలు సీరియస్‌గా మాట్లాడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా మస్క్ సాకర్ మ్యాచ్‌కు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. కానీ ఆయన మాత్రం మ్యాచ్ జరుగుతున్నంత సేపు కామెంటేటర్ అవతారం ఎత్తారు. మొదటి సగం ఆట తర్వాత మస్క్ తన అభిమానుల్ని ఇలా అడిగారు.‘సూపర్ ఎక్సైటింగ్ వరల్డ్ కప్. అర్ధ సమయానికి అర్జెంటీనా 2-0తో ముందంజలో ఉంది. ఫ్రాన్స్ తిరిగి పుంజుకుంటుందా? అని ప్రశ్నించారు. Super exciting World Cup! 🇦🇷 ahead 2-0 at halftime. Can 🇫🇷 come back? — Elon Musk (@elonmusk) December 18, 2022 ఫ్రాన్స్ సాకర్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపే అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన తర్వాత, ‘ఫ్రాన్స్ గోల్ కోసం సెకనుకు 24,400 ట్వీట్లు, ప్రపంచ కప్‌లో అత్యధికం! అంటూ ట్వీట్ చేశారు. 24,400 tweets per second for France’s goal, highest ever for World Cup! — Elon Musk (@elonmusk) December 18, 2022 -
లాక్డౌన్: హలీడే ట్రిప్‌లో ఇవాంక!
వాషింగ్టన్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా(కోవిడ్-19) ధాటికి అమెరికాలో 33 వేలకు పైగా మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారానికి 6,54,343కు చేరుకుంది. ఇటువంటి తరుణంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టిందని.. అమెరికన్లు తిరిగి యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్లిన వార్తలు బయటకు రావడంతో ట్రంప్ కుటుంబంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసిన ఇవాంక.. తానే వాటిని ఉల్లంఘించారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహమ్మారిని తేలికగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. (హెల్త్ వాలంటీర్‌గా స్వీడన్ యువరాణి) వివరాలు.. ఇవాంక, తన భర్త జారేద్ కుష్నర్తో కలిసి జ్యూయిష్ హాలిడే(యూదుల పండుగ- పాసోవర్ సెలబ్రేషన్స్) కోసం న్యూజెర్సీకి వెళ్లారు. ఏప్రిల్ 8న ప్రారంభమైన పాసోవర్ సెలబ్రేషన్స్ కోసం వాషింగ్టన్‌లోని తన నివాసం వీడి గురువారం వరకు అక్కడే ఉన్నారు. ఈ విషయం వార్తా పత్రికల్లో ప్రచురితమైన తర్వాత.. ఇవాంక బెడ్మినిస్టర్లోని ట్రంప్ కుటుంబానికి చెందిన గోల్ఫ్ రిసార్టుకు వెళ్లారని శ్వేతసౌధ వర్గాలు ధ్రువీకరించాయి. ఆమెతో పాటు కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని... ఇవాంక నివాసం కంటే అక్కడే తక్కువ జనాభా ఉంటారు కాబట్టి పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి. ‘‘బెడ్‌మినిస్టర్‌లో ఇవాంక భౌతిక దూరం పాటిస్తూనే ఉన్నారు. అక్కడి నుంచే తన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె ప్రయాణం వ్యాపార సంబంధమైనది కాదు. తన కుటుంబంతో వ్యక్తిగతంగా సమయాన్ని గడిపేందుకు వెళ్లారు’’అని ఓ ప్రకటనలో తెలిపాయి. (‘ఏప్రిల్ చివరి నాటికి ఆ రాష్ట్రాలు తెరుచుకుంటాయి’) కాగా న్యూజెర్సీ, న్యూయార్క్‌లో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు 16,251 కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రాణాంతక వైరస్ విస్తరిస్తున్న తొలినాళ్లలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అందరూ ఇంట్లోనే ఉండాలంటూ ఇవాంక ఓ వీడియో సందేశం పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనమంతా తెలిసోతెలియకో కోవిడ్ వ్యాప్తిలో భాగస్వాములం అవుతాం. భౌతిక దూరం ఒక్కటే మన ప్రాణాలు కాపాడుతుంది’’అని ఇవాంక విజ్ఞప్తి చేశారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాంకపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి అందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు’’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(మరణాలు @ 33 వేలు) -
ట్రంప్ వెంటే ఇవాంకా..
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన కూతురు ఇవాంకా కూడా భాగం కానున్నారు. ట్రంప్ సీనియర్ సలహాదారుల హోదాలో ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెద్ కుష్నర్ భారత్‌కు వస్తున్నారు. ట్రంప్‌తో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత పర్యటనలో పాలుపంచుకుంటోంది. ఫిబ్రవరి 24న ఫస్ట్ లేడీ మెలానియా తన భర్త ట్రంప్‌తో పాటు భారత్ వస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన అమెరికా.. తాజాగా ట్రంప్‌తో పాటు వస్తున్న ఉన్నత స్థాయి అధికారుల బృందం వివరాలను ప్రకటించింది. వారిలో ఆర్థిక మంత్రి స్టీవెన్ నుచిన్, వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్, విద్యుత్ శాఖ మంత్రి డాన్ బ్రౌలిటీ, జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్ ఒబ్రీన్ తదితరులున్నారు. 24న తాజ్ మహల్ ఫిబ్రవరి 24న వాషింగ్టన్ నుంచి ట్రంప్ నేరుగా అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడ మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం మొతెరా క్రికెట్ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ కుటుంబం నేరుగా ఆగ్రా వెళ్తుంది. సూర్యాస్తమయంలోపు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. అనంతరం, ఢిల్లీ పయనమవుతారు. 25న రాజ్‌ఘాట్ ఫిబ్రవరి 25వ తేదీన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగతం లభిస్తుంది. అక్కడి నుంచి వారు రాజ్‌ఘాట్ వెళ్లి మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ భవన్లో ట్రంప్, మోదీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. ఉగ్రవాదంపై పోరులో సహకారం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడం, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం, హెచ్1బీ వీసా విషయంలో భారత్ ఆందోళనలు.. మొదలైనవి వారి చర్చల్లో భాగం కావచ్చని సమాచారం. అలాగే, అమెరికా నుంచి 24 ఎంహెచ్–60 రోమియో హెలికాప్టర్లు, 6 అపాచీ హెలీకాప్టర్లను కొనుగోలు చేయడానికి సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశముంది. సర్వం వచ్చేసింది ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఆయనకు అవసరమైన సమాచార, రక్షణ వ్యవస్థలను, ట్రంప్ అధికారిక హెలికాప్టర్ మెరైన్ వన్, రోడ్ షోలో పాలు పంచుకునేందుకు భారీ రక్షణ వ్యవస్థతో కూడిన ఎస్యూవీ తరహా వాహనం(డబ్ల్యూహెచ్‌సీఏ రోడ్‌రన్నర్. దీన్నే మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ వెహికల్ అంటారు).. మొదలైన వాటిని తీసుకుని మూడు సీ 17 గ్లోబ్‌మాస్టర్ కార్గో విమానాలు అహ్మదాబాద్ చేరుకున్నాయి. అమెరికా నుంచి పలువురు సుశిక్షిత భద్రత సిబ్బంది కూడా వచ్చారు. ఢిల్లీలో భద్రత ఏర్పాట్లు ట్రంప్ కుటుంబానికి ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టారు. వారు ఉండే గ్రాండ్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్‌ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ట్రంప్ అందులోని చాణక్య సూట్లో ఉంటారని సమాచారం. గతంలో అందులో అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జిబుష్‌లు సేదతీరారు. ట్రంప్ బృందం వెళ్లేంతవరకు ఇతరులెవరికీ ఆ హోటల్లో గదులను కేటాయించరు. హోటల్లో ఉన్న మొత్తం 438 గదులను వారికే బుక్ చేశారు. కాగా, ఇరాన్– అమెరికాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారని, బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని భద్రత ఏర్పాట్లలో పాలుపంచుకున్న వర్గాలు వెల్లడించాయి. సాదర స్వాగతం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొతెరా క్రికెట్ స్టేడియం వరకు.. ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్ షో మార్గంలో 28 వేదికలను ఏర్పాటు చేస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేదికలపై ప్రదర్శనలు ఉంటాయన్నారు. అయితే, కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియాన్ని ఫిబ్రవరి 24న ప్రారంభించే కార్యక్రమం ఉండబోదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) స్పష్టం చేసింది. కేవలం నమస్తే ట్రంప్ కార్యక్రమం మాత్రమే జరుగుతుందని పేర్కొంది. సబర్మతి ఆశ్రమం సందర్శనపై సందిగ్దం అయితే ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ నిర్ణయం తీసుకుంటుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. -
ప్రతిభ వలసల వీసాలు 57 శాతం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా సరికొత్త వలసవిధానంపై దృష్టి సారించింది. ప్రతిభ ఆధారిత వలసలకు మొత్తం వీసాల్లో 57 శాతం కేటాయించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీనియర్ సలహాదారు, అల్లుడు జరెడ్ కుష్నర్ నేతృత్వంలోని కమిటీ నూతన వలస విధానాన్ని రూపొందించింది. ఈ విషయమై వైట్‌హౌస్‌లో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కుష్నర్ మాట్లాడుతూ..‘నూతన ప్రతిభ ఆధారిత వలసవిధానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను, ప్రతిభావంతులను అమెరికావైపు ఆకర్షించవచ్చు. దీనివల్ల మన దేశానికి రాబోయే పదేళ్లలో పన్నులరూపంలో 500 బిలియన్ డాలర్ల(రూ.34.41 లక్షల కోట్ల) ఆదాయం సమకూరుతుంది. మన సామాజికభద్రత పథకాలకు చెల్లింపులు జరుపుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల అమెరికన్లు లబ్ధి పొందుతారు. మనతోటి దేశాలను పోల్చుకుంటే అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు కాలంచెల్లింది. కెనడాలో 53 శాతం విదేశీ నిపుణులు, ప్రతిభావంతులకు వీసాలు జారీచేస్తున్నారు. ఈ సంఖ్య న్యూజిలాండ్‌లో 59 శాతం, ఆస్ట్రేలియాలో 63 శాతం, జపాన్‌లో 52 శాతంగా ఉంటే, అమెరికాలో మాత్రం 12 శాతానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో నూతన వలసవిధానం ప్రకారం మొత్తం వీసాల్లో 57 శాతం ప్రతిభ ఆధారంగా జారీచేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. దీనివల్ల మిగతా దేశాలతో అమెరికా పోటీపడగలుగుతుంది’ అని కుష్నర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల వలస చట్టాలను అధ్యయనం చేసిన ఈ నూతన వలస విధానాన్ని రూపొందించామనీ, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న దీన్ని త్వరలోనే ప్రజలముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. -
గాలిలో ఇవాంక.. హెలికాప్టర్‌కు సాంకేతిక లోపం!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్, ఆమె భర్త జెరెడ్ ఖుష్నెర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం నుంచి ఇవాంక, జెరెడ్ హెలికాప్టర్లో న్యూయార్క్‌కు బయలుదేరారు. హెలికాప్టర్ ఎంతోదూరం ప్రయాణించకముందే తిరిగి విమానాశ్రయంవచ్చింది. హెలికాప్టర్లో ఇంజిన్ ఫెయిల్ కావడంతో వెంటనే ఫైలట్లు దానిని వెనుకకు తిప్పి వాషింగ్టన్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. దీంతో వారు కమర్షియల్ విమానంలో న్యూయార్క్ బయలుదేరారు. హెలికాప్టర్ బయలుదేరిన సమయంలో ఇవాంక, జెరెడ్, వారి వ్యక్తిగత భద్రతాసిబ్బందితోపాటు ఒక్క పైలట్ మాత్రమే అందులో ఉన్నట్టు తెలుస్తోంది. -
ట్రంప్ అల్లుడు కుష్నర్ హోదా కుదింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ హోదాను శ్వేతసౌధం తగ్గించింది. ప్రస్తుతం టాప్ సీక్రెట్ క్లియరెన్స్ జాబితాలో ఉన్న కుష్నర్ పేరును తొలగించి సీక్రెట్ క్లియరెన్స్ జాబితాలో చేర్చింది. దీని ప్రకారం అధ్యక్ష భవనం అధికారులకు ప్రతిరోజూ అందే అత్యంత రహస్య నివేదికలు ఇకపై ఆయనకు అందుబాటులో ఉండవు. ట్రంప్ కుమార్తె ఇవాంకా భర్త, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు కూడా అయిన కుష్నర్.. పశ్చిమాసియా శాంతి చర్చలు, మెక్సికోతో సంబంధాలను పర్యవేక్షిస్తున్నారు. కొన్ని విదేశీ ప్రభుత్వాలు కుష్నర్, అతని కుటుంబంతో ఆర్ధిక, వ్యాపార సంబంధాలను ప్రభావితం చేసి శ్వేతసౌధం రహస్యాలను చేజిక్కించుకునే ప్రమాదముందని అమెరికా నిఘా సంస్థలు భయపడుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. -
ట్రంప్ అల్లుడు మహిళా ఓటరు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, సలహాదారుడు జరేద్ కుష్నర్ 8 ఏళ్లుగా మహిళా ఓటరుగా ఉన్నారని ఆ దేశ మీడియా వెల్లడించింది. న్యూయార్క్‌లోని ఓటర్ల జాబితాలను పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది. తప్పుడు వివరాలిచ్చి కుష్నర్ గతంలోనూ వివాదాల్లో చిక్కుకున్నారు. శ్వేతసౌధంలోకి అడుగుపెట్టడానికి తొలుత సమర్పించిన పత్రాల్లో తప్పులు దొర్లడంతో మరోసారి వాటిని ఫైల్ చేశారు. 2009కి ముందు న్యూజెర్సీలో ఓటరు నమోదు సమయంలో తాను స్త్రీనో పురుషుడో తెలపలేదు. ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో కుష్నర్ ఓటరుగా నమోదుచేసుకున్నట్లు గతేడాది ఎన్నికల సందర్భంగా బయటపడిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
మా అల్లుడు సూపర్.. గర్వంగా ఉంది: ట్రంప్
న్యూయార్క్: తన అల్లుడిని చూసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గర్వంతో ఉప్పొంగిపోతున్నారంట. రష్యాతో తనకు ఉన్న సంబంధాలను నిర్మొహమాటంగా, పారదర్శకతతో ఉన్నది ఉన్నట్లు ఏ మాత్రం దాచకుండా విచారణ కమిటీకి వెల్లడించడంపట్ల ట్రంప్ తన అల్లుడు, తనకు కీలక సలహాదారు అయిన జేర్డ్ కుష్నర్ను చూసి తెగ సంతోష పడుతున్నారని శ్వేతసౌదం మీడియా అధికారిక ప్రతినిధి సారా శాండర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. 'జేర్డ్ స్వచ్ఛందంగా సెనేట్ సెలక్ట్ కమిటీ ముందుకు వెళ్లడం, రష్యాతో తాను చేసిన ప్రతి సంభాషణను నిష్పక్షపాతంగా చెప్పడంపట్ల అధ్యక్షుడు ట్రంప్ చాలా గర్వపడుతున్నారు' అని ఆమె చెప్పారు. జేర్డ్ చాలా గొప్ప కార్యం నిర్వహించారని, ఏదో ఉందని తనను వేదించేందుకు ప్రయత్నించిన వారికి ఇక ఏ విధంగాను ప్రశ్నించలేని విధంగా సమాధానం చెప్పారని ట్రంప్ భావిస్తున్నట్లు ఆమె వివరించారు. రష్యాతో సన్నిహిత సంబంధాలు ట్రంప్ అల్లుడికి ఉన్నాయని, ఎన్నికల సమయంలో రష్యా సహకారం తీసుకొని తప్పిదాలకు పాల్పడ్డారని కొంతకాలంగా ట్రంప్ కుటుంబంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తుతం సెనేట్ కమిటీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కమిటీ ముందుకు వెళ్లిన ట్రంప్ అల్లుడు జేర్డ్ రష్యాతో తాను ఎలాంటి లాలూచీ పడలేదని, ఆ దేశ ప్రతినిధులతో తనకు ఉన్న సంబంధాలను పూసగుచ్చినట్లుగా వివరించారట. లిఖిత పూర్వక సమాధానం కూడా వారికి ఇచ్చినట్లు వైట్ హౌస్ తెలిపింది. -
అది వారికి నచ్చడం లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికన్లు తమ దేశ ప్రభుత్వంలో ‘నిజంగా’ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇక్కడి మీడియా సంస్థలకు ఇష్టంలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మీడియా సంస్థలు అసత్యపు వార్తలను ప్రసారం చేస్తున్నాయనీ, నిజాలేంటో ప్రజలకు చెప్పడానికి తాను ట్విటర్‌ను వినియోగిస్తుంటే అది వారికి నచ్చడం లేదని పేర్కొన్నారు. ఆధారం చూపకుండా కేవలం ‘విశ్వసనీయ వర్గాలు తెలిపాయి’ అంటూ ప్రసారం చేస్తున్న వార్తలన్నీ మీడియా వండి వార్చిన అబద్ధాలేనన్నారు. అమెరికా అధ్యక్షుడిగా తొలి విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన ట్రంప్ తాను సోషల్ మీడియాలో ఉండడాన్ని సమర్థించుకున్నారు. తన ప్రభుత్వంపై మీడియా కల్పిత కథనాలు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. నకిలీ న్యూస్ రైటర్స్ ఇలాంటి కథనాలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. తన అల్లుడు వైట్‌హౌస్ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ గతంలో రష్యా రాయబారితో జరిపిన భేటీపై మీడియాలో వ్యతిరేక కథనాలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈవిధంగా విరుచుకుపడ్డారు. కాగా, ప్రపంచంలో ఉత్తమమైన హెల్త్‌కేర్ పాలసీని తీసుకొస్తామని ట్రంప్ ప్రకటించారు. ఒబామా కేర్ చచ్చిపోయిందని, తమ పార్టీ దీనికంటే మంచి ఆరోగ్య విధానాన్ని ప్రవేశపెడతామని అన్నారు. -
ట్రంప్ అల్లుడి తెర వెనుక కథ!
► వేడెక్కిన అమెరికా రాజకీయాలు! రష్యా ప్రభుత్వంతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్న తన ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అల్లుడు, వైట్‌హౌస్ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ డిసెంబర్లో అమెరికాలో రష్యా రాయబారితో మాట్లాడడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. అప్పటికి ట్రంప్ అధ్యక్ష పదవి కూడా స్వీకరించలేదు. అంటే ఆయన అల్లుడు సాధారణ పౌరుడు. ఎలాంటి అధికార పదవి లేకుండా ట్రంప్ బృందం తరఫున రష్యా రాయబారి సెర్గీ కిసిలియాక్తో మాట్లాడటంపై రెండు అమెరికా ప్రధాన దినపత్రికలు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాలు ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న దర్యాప్తునకు మరింత పదును పెంచాయి. అయితే, తన అల్లుడిపై రాసిన వార్తలపై ట్రంప్ మండిపడటమే కాక, కుష్నర్ చాలా మంచోడని ప్రశంసించారు. తమతో మంచి సంబంధాలు లేని దేశంతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన మంచిదేనని అమెరికా హోంశాఖ మంత్రి జాన్ కెలీ వ్యాఖ్యానించారు. రహస్య సంబంధాలు ఎందుకు? దౌత్యపరమైన సౌకర్యం ద్వారా రష్యాకు లభించే సమాచార సంబంధాలను ట్రంప్ వాడుకుంటే రష్యన్లతో ఆయనేం మాట్లాడిందీ అమెరికా గూఢచార సంస్థలు తెలుసుకోలేవు. వైట్‌హౌస్‌లోని ముగ్గురు కీలకవ్యక్తులు అందించిన సమాచారంతో ఈ విషయం లీకైంది. కిందటి డిసెంబర్లో న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో రష్యా రాయబారితో జరిగిన సమావేశంలో కుష్నర్తో పాటు వివాదాస్పద మాజీ జనరల్ మైకేల్ ఫ్లిన్ కూడా ఉన్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక కొద్దికాలం ఫ్లిన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రహస్య కమ్యూనికేషన్ సౌకర్యం ఏర్పాటుకు ఎవరు ప్రతిపాదించారో తెలియదు. ట్రంప్ బృందం ఈ విషయాన్ని అప్పట్లో వెల్లడించలేదు. 5 నెలల తర్వాత ట్రంప్ బృందం-పుతిన్ సంబంధాలపై ఎఫ్‌బీఐ, కాంగ్రెస్ కమిటీల దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఈ విషయం మీడియాలో రావడంతో రష్యాతో కుష్నర్ సంబంధాలపై మరోసారి వివాదం చెలరేగింది. రష్యా బ్యాంకు ఉన్నతాధికారితో సమావేశం ఎందుకు? రాయబారితో సమావేశం తర్వాత అప్పటికే అమెరికా ఆంక్షలతో సతమౌతమవుతున్న బడా రష్యా బ్యాంక్ వ్నెషేకానం బ్యాంక్ (వీఈబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గీ గోర్కోవ్తో కుష్నర్ భేటీ కావడానికి ట్రంప్ టవర్ మీటింగ్‌కూ సంబంధం ఉండొచ్చని రెండు పత్రికలూ సూచనప్రాయంగా తెలిపాయి. ఈ బ్యాంక్ సహా ఇతర రష్యా ఆర్థిక సంస్థలపై విధించిన ఆంక్షలు తొలగిస్తే, అందుకు బదులుగా కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్న కుష్నర్ న్యూయార్క్ రియల్ ఎస్టేట్ సంస్థ (666 ఫిఫ్త్ ఎవెన్యూ)కు వాటి నుంచి పెట్టుబడులు సంపాదించే విషయమై ఈ భేటీలో చర్చించి ఉండొచ్చని కూడా తెలుస్తోంది. ఈ కథనాల తర్వాత తన అల్లుడు సమర్ధుడు, మంచివాడని ట్విటర్లో ట్రంప్ ప్రశంసించినా, మరోపక్క కొంతకాలం ‘తగ్గి ఉండాలని’ ఆయనకు సూచించారని వార్తలొచ్చాయి. కుష్నర్ చేసింది కరెక్టే: వికీలీక్స్ అసాంజ్ రష్యాతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటుకు కుష్నర్ చేసిన ప్రయత్నంలో తప్పేమీ లేదని వికీలీక్స్ స్థాపకుడు జూలియన్ అసాంజ్ సమర్ధించారు. కిందటేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నప్పుడు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్‌ను వికీలీక్స్ బయట పెట్టిన విషయం తెలిసిందే. రష్యా గూఢచార సంస్థల సహకారంతోనే అసాంజ్ ఈ పనిచేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. హిల్లరీ ఈ మెయిల్స్ వ్యవహారాన్ని ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకున్న విషయం తెలిసిందే. -
విచారణ కమిటీ ముందుకు ట్రంప్ అల్లుడు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు, అల్లుడు, జేర్డ్ కుష్నర్ అమెరికా విచారణ కమిటీ ముందుకు హాజరుకాబోతున్నాడు. ఆ కమిటీ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో చెప్పింది. ట్రంప్, రష్యా మధ్య అనధికారిక ఒప్పందం జరిగిందని, అమెరికా ఎన్నికల విషయంలో రష్యా జోక్యం చేసుకుందని కావాలనే డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీని ఓడించి ట్రంప్‌ను గెలిపించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అమెరికా సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణ చేస్తోంది. దీని ముందుకు రిపబ్లికన్ పార్టీకి చెందిన డెవిన్ న్యూన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ముందు వ్యక్తిగత వివరణ ఇవ్వాలనడి డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై తానే వివరణ ఇస్తానంటూ ట్రంప్ అల్లుడు కుష్నర్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆయనే వివరణ ఇస్తారని శ్వేతసౌదం తెలిపింది. ఇదే ఆరోపణలపై ఎఫ్‌బీఐ కూడా విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. -
రష్యాతో లింక్: ట్రంప్ మేనల్లుడి విచారణ
వాషింగ్టన్: రష్యాతో సంబంధాలు కలిగి ఉండటంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మేనల్లుడు జారెద్ కుష్నెర్ని విచారించేందుకు యూఎస్ సెనేట్ ఇన్వెస్టిగేషన్ ప్యానెల్ సిద్ధమవుతోంది. ఈ మేరకు కాంగ్రెస్సెనల్ అధికారి ఒకరు సమాచారం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కుష్నెర్ ట్రంప్‌కు సలహాదారుగా ఉన్నారు. ప్రస్తుతం వైట్‌హౌస్‌లో ట్రంప్‌కు అడ్వైజర్‌గా ఉంటున్నారు. కాగా, అమెరికా ఎన్నికల్లో రష్యా హస్తం ఉందని యూఎస్ ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ విచారణకు పిలిచినవారిలో కుష్నెర్ ఒక్కరే ట్రంప్‌కు అతి దగ్గరైన వారు. గత ఏడాది డిసెంబర్లో ట్రంప్ టవర్‌లో రష్యా అంబాసిడర్ సెర్జీ కిస్లేయక్తో, రష్యా ప్రభుత్వ బ్యాంకుతో జరిగిన సమావేశాల్లో జరిగిన సంభాషణలపై కుష్నెర్ను ప్రశ్నించాలని సెనేట్ ఇన్వెస్టిగేషన్ టీం యోచిస్తున్నట్లు తెలిసింది. -
అల్లుడి తీరుపై ట్రంప్ అప్సెట్ అయ్యారట!
వాషింగ్టన్: ఒబామా కేర్ వైద్య పాలసీపై చర్చ జరుగుతున్న కీలక సమయంలో కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ కుష్నెర్ విహారయాత్రకు వెళ్లడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అప్సెట్ అయ్యారట. ట్రంప్‌కు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఈ విషయం చెప్పారు. ఒబామాకేర్ వైద్య పాలసీ స్థానంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాగా బిల్లు ఆమోదానికి తగినంత మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో ట్రంప్ సర్కారు విఫలమైంది. ఇలాంటి సమయంలో ఇవాంకా, కుష్నెర్ తమ పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లడం ట్రంప్‌కు నచ్చలేదట. ఎందుకంటే ట్రంప్ కీలక సలహాదారుల్లో కుష్నెర్ ఒకరు. కీలక సమయంలో అండగా ఉండాల్సిన అల్లుడు సెలవుపై వెళ్లడం ట్రంప్‌కు నచ్చలేదట. వచ్చే గురువారం వరకు ఇవాంకా, కుష్నెర్ టూర్లో ఉంటారు. కాగా వైట్ హౌస్ ప్రతినిధి ఈ వార్తలను తోసిపుచ్చారు. -
అల్లుడికి పెద్ద పదవి ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ సొంత అల్లుడు జారెద్ కుష్నర్కు కీలక పదవి కట్టబెట్టారు. తనకు సీనియర్ సలహారుదారుగా అల్లుడిని నియమించారు. వాణిజ్యం, మిడిల్ ఈస్ట్ వ్యవహారాల్లో సలహాలు ఇచ్చే బాధ్యతను కుష్నర్కు అప్పగించారు. అమెరికా అధ్యక్షుడి బంధువులు కీలక పదవులను చేపట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. చట్టబద్దమైన ఆమోదం లభించిన వెంటనే 35 ఏళ్ల కుష్నర్ సలహాదారు పదవి చేపడతారు. ప్రభుత్వ పదవుల్లో ఆశ్రిత పక్షపాతాన్ని నిరోధిస్తూ 1967లో చేసిన చట్టాన్ని ఉల్లంఘించలేదని నిర్ధారణ అయిన తర్వాతే కుష్నర్ పదవి చేపట్టడానికి వీలవుతుంది. సలహాదారుకు జీతం చెల్లించరు కాబట్టి సెనేట్ ఆమోదం అవసరం లేదు. ‘కుష్నర్ తనకు లభించిన అద్భుత ఆస్తి.. ఎన్నికల ప్రచారం, అధికార బదిలీలో నమ్మకమైన సలహారుదారుగి నిలిచాడ’ని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ కుమార్తె ఇవాంకాను పెళ్లాడిన కుష్నర్.. న్యూయార్క్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యవరించారు. తన భర్తకు కీలక పదవి దక్కడంతో తాను ఇంటికే పరిమితం కావాలని ఇవాంకా భావిస్తున్నారు. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ కు షిప్ట్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.