విచారణ కమిటీ ముందుకు ట్రంప్ అల్లుడు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు, అల్లుడు, జేర్‌డ్ కుష్నర్ అమెరికా విచారణ కమిటీ ముందుకు హాజరుకాబోతున్నాడు. ఆ కమిటీ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో చెప్పింది. ట్రంప్, రష్యా మధ్య అనధికారిక ఒప్పందం జరిగిందని, అమెరికా ఎన్నికల విషయంలో రష్యా జోక్యం చేసుకుందని కావాలనే డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీని ఓడించి ట్రంప్‌ను గెలిపించారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై అమెరికా సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణ చేస్తోంది. దీని ముందుకు రిపబ్లికన్ పార్టీకి చెందిన డెవిన్ న్యూన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ముందు వ్యక్తిగత వివరణ ఇవ్వాలనడి డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై తానే వివరణ ఇస్తానంటూ ట్రంప్ అల్లుడు కుష్నర్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆయనే వివరణ ఇస్తారని శ్వేతసౌదం తెలిపింది. ఇదే ఆరోపణలపై ఎఫ్‌బీఐ కూడా విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.