రష్యాతో లింక్: ట్రంప్ మేనల్లుడి విచారణ
రష్యాతో లింక్: ట్రంప్ మేనల్లుడి విచారణ
Published Mon, Mar 27 2017 8:55 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
వాషింగ్టన్: రష్యాతో సంబంధాలు కలిగి ఉండటంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మేనల్లుడు జారెద్ కుష్నెర్‌ని విచారించేందుకు యూఎస్ సెనేట్ ఇన్వెస్టిగేషన్ ప్యానెల్ సిద్ధమవుతోంది. ఈ మేరకు కాంగ్రెస్సెనల్ అధికారి ఒకరు సమాచారం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కుష్నెర్ ట్రంప్‌కు సలహాదారుగా ఉన్నారు. ప్రస్తుతం వైట్‌హౌస్‌లో ట్రంప్‌కు అడ్వైజర్‌గా ఉంటున్నారు.
కాగా, అమెరికా ఎన్నికల్లో రష్యా హస్తం ఉందని యూఎస్ ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ విచారణకు పిలిచినవారిలో కుష్నెర్ ఒక్కరే ట్రంప్‌కు అతి దగ్గరైన వారు. గత ఏడాది డిసెంబర్‌లో ట్రంప్ టవర్‌లో రష్యా అంబాసిడర్ సెర్జీ కిస్లేయక్‌తో, రష్యా ప్రభుత్వ బ్యాంకుతో జరిగిన సమావేశాల్లో జరిగిన సంభాషణలపై కుష్నెర్‌ను ప్రశ్నించాలని సెనేట్ ఇన్వెస్టిగేషన్ టీం యోచిస్తున్నట్లు తెలిసింది.
Advertisement