
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్, ఆమె భర్త జెరెడ్ ఖుష్నెర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం నుంచి ఇవాంక, జెరెడ్ హెలికాప్టర్‌లో న్యూయార్క్‌కు బయలుదేరారు. హెలికాప్టర్ ఎంతోదూరం ప్రయాణించకముందే తిరిగి విమానాశ్రయంవచ్చింది. హెలికాప్టర్‌లో ఇంజిన్ ఫెయిల్ కావడంతో వెంటనే ఫైలట్లు దానిని వెనుకకు తిప్పి వాషింగ్టన్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. దీంతో వారు కమర్షియల్ విమానంలో న్యూయార్క్ బయలుదేరారు. హెలికాప్టర్ బయలుదేరిన సమయంలో ఇవాంక, జెరెడ్, వారి వ్యక్తిగత భద్రతాసిబ్బందితోపాటు ఒక్క పైలట్ మాత్రమే అందులో ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment