
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, సలహాదారుడు జరేద్ కుష్నర్ 8 ఏళ్లుగా మహిళా ఓటరుగా ఉన్నారని ఆ దేశ మీడియా వెల్లడించింది. న్యూయార్క్‌లోని ఓటర్ల జాబితాలను పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది. తప్పుడు వివరాలిచ్చి కుష్నర్ గతంలోనూ వివాదాల్లో చిక్కుకున్నారు. శ్వేతసౌధంలోకి అడుగుపెట్టడానికి తొలుత సమర్పించిన పత్రాల్లో తప్పులు దొర్లడంతో మరోసారి వాటిని ఫైల్ చేశారు.
2009కి ముందు న్యూజెర్సీలో ఓటరు నమోదు సమయంలో తాను స్త్రీనో పురుషుడో తెలపలేదు. ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో కుష్నర్ ఓటరుగా నమోదుచేసుకున్నట్లు గతేడాది ఎన్నికల సందర్భంగా బయటపడిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.