![Jared Kushner has access to top secret intelligence withdrawn - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/1/us.jpg.webp?itok=M3wrQa8e)
డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ హోదాను శ్వేతసౌధం తగ్గించింది. ప్రస్తుతం టాప్ సీక్రెట్ క్లియరెన్స్ జాబితాలో ఉన్న కుష్నర్ పేరును తొలగించి సీక్రెట్ క్లియరెన్స్ జాబితాలో చేర్చింది. దీని ప్రకారం అధ్యక్ష భవనం అధికారులకు ప్రతిరోజూ అందే అత్యంత రహస్య నివేదికలు ఇకపై ఆయనకు అందుబాటులో ఉండవు. ట్రంప్ కుమార్తె ఇవాంకా భర్త, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు కూడా అయిన కుష్నర్.. పశ్చిమాసియా శాంతి చర్చలు, మెక్సికోతో సంబంధాలను పర్యవేక్షిస్తున్నారు. కొన్ని విదేశీ ప్రభుత్వాలు కుష్నర్, అతని కుటుంబంతో ఆర్ధిక, వ్యాపార సంబంధాలను ప్రభావితం చేసి శ్వేతసౌధం రహస్యాలను చేజిక్కించుకునే ప్రమాదముందని అమెరికా నిఘా సంస్థలు భయపడుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment