son-in-law
-
అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన అత్తా మామ..
టేకులపల్లి: భార్యాపిల్లలను చూసేందుకు అత్తారింటికి వచ్చిన అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఇంట్లోకి వెళ్లి తలుపుపెట్టుకున్నారు. మంటలకు తాళలేక ఎంతగా మెత్తుకున్నా వారు తలుపు తీయకపోవడంతో పక్కనే ఉన్న నీటితొట్టిలో దూకాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం దంతెలబోరు ఎస్సీకాలనీకి చెందిన బల్లెం చినవెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు బల్లెం గౌతమ్ (23).. టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు కుమార్తె కావ్యను రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సుజాతనగర్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత నెల కావ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి రామచంద్రునిపేటలోని పుట్టింటికి వచ్చింది. ఈ నెల 2న రాత్రి గౌతమ్ తన పిల్లలు, భార్యను చూసేందుకు రామచంద్రునిపేటకు వచ్చాడు. గౌతమ్‌ని లోపలికి వెళ్లనీయకుండా అత్తా మామ, బావమరుదులు అడ్డుకున్నారు. దుర్భాషలాడి, దాడి చేయడంతో పాటు గౌతమ్‌పై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనంతరం అందరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తున్నా రక్షించలేదు. పక్కనే ఉన్న నీటి తొట్టిలో దూకిన గౌతమ్‌ని చుట్టు పక్కల వారు బయటకు తీసి, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం, వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స పొందిన గౌతమ్ ఆదివారం మృతి చెందాడు. బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్‌ను వివరణ కోరగా ఈ నెల 2న రామచంద్రునిపేటలో ఘటన జరిగిందని, 11న మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 2న ఘటన జరిగి, 11న ఫిర్యాదు వచ్చినప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
అల్లుడికి 250 రకాల వంటకాలతో విందు
-
ప్రపంచంలోనే రిచెస్ట్ అల్లుడు..
భారతీయ కుటుంబాలలో అల్లుడికి విశిష్ట హోదా ఉంటుంది. ప్రత్యేకించి సంపన్న కుటుంబాల వివాహాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాల్లో అల్లుడికి స్వాగత సత్కారాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఓ వివాహం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అల్లుడు, మామగార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఆరు రోజుల పాటు గ్రాండ్ వెడ్డింగ్బిలియనీర్ స్టీల్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ తన కుమార్తె, అల్లుడి వివాహాన్ని మరచిపోలేని వేడుకగా మార్చాలనుకున్నారు. ఖర్చు ఏమాత్రం వెనుకాడకుండా వనీషా మిట్టల్, అమిత్ భాటియాల వివాహం జరిపించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఆరు రోజులపాటు ఈ వివాహ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. 2004లో జరిగిన ఈ పెళ్లికి రూ. 240 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి.పారిస్ నగరం మొత్తం ఈ వేడుకను జరుపుకుంటున్నట్లు అనిపించేంతగా ఏర్పాట్లు చేశారు. ప్రఖ్యాత సెలబ్రిటీ చెఫ్ మున్నా మహారాజ్‌ను భారత్ నుండి ఫ్రాన్స్‌కు రప్పించారు. ఈ గ్రాండ్ ఇండియన్ వెడ్డింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది అతిథులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీతో సహా బాలీవుడ్, హాలీవుడ్ తారలు తమ ప్రదర్శనలతో హంగామా చేశారు. అంతర్జాతీయ పాప్ సంచలనం కైలీ మినోగ్ కూడా పెళ్లిలో ప్రదర్శన ఇచ్చారు. రూ. ఒక గంట ప్రదర్శనకు ఆమె రూ. కోటి తీసుకున్నట్లు చెబుతారు.ఎవరీ అమిత్ భాటియా ?అమిత్ భాటియా బ్రిటీష్-ఇండియన్ వ్యాపారవేత్త, బిలియనీర్ ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ అల్లుడు. అయేబే క్యాపిటల్ (గతంలో స్వోర్డ్ ఫిష్ ఇన్వెస్ట్మెంట్స్ )వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్. అమిత్ తన ప్రాథమిక విద్యను ఢిల్లీలో పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లారు.అమిత్ తన వృత్తిపరమైన ప్రయాణాన్ని న్యూయార్క్‌లో మెరిల్ లించ్, మోర్గాన్ స్టాన్లీతో ప్రారంభించారు. వెస్ట్ లండన్‌లోని షెపర్డ్స్ బుష్‌లో ఉన్న ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఎఫ్సీకి ఆయన సహ-యజమాని. క్రీడలతో పాటు అమిత్ వ్యాపార సంస్థలు రియల్ ఎస్టేట్, సాంకేతిక రంగాల్లో విస్తరించాయి. స్ట్రాటజిక్ లాండ్ అండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అయిన సమ్మిక్స్ క్యాపిటల్‌లో ఈయన వ్యవస్థాపక భాగస్వామి.గతంలో 2016 ఆగస్టులో బ్రీడాన్ గ్రూప్‌ను కొనుగోలు చేసే వరకు హోప్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత బ్రీడాన్ గ్రూప్ బోర్డ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా చేరారు. కార్పొరేట్ ఫైనాన్స్, ప్రైవేట్ ఈక్విటీలో 20 సంవత్సరాల అనుభవంతో అమిత్ భాటియా విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. వనీషా మిట్టల్, అమిత్ భాటియా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
పారిస్ ఒలింపిక్స్‌లో బిల్‌గేట్స్ అల్లుడు..
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒలింపిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విశ్వ క్రీడా పోటీలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ పోటీలపై అందరికన్నా ఉత్సాహంగా ఉంది మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ కుటుంబం. కారణం ఆయన అల్లుడు ఈ పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడుతుండటం.బిల్ గేట్స్ అల్లుడు, నాయెల్ నాసర్ ఈజిప్ట్ దేశం తరఫున ఈ గ్రాండ్ ఈవెంట్లో పోటీ పడుతున్నారు. నాసర్ ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్. మెలిందా, బిల్ గేట్స్‌ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. ఒలింపిక్స్ పాల్గొంటున్న తన అల్లుడిని ఉత్సాహపరుస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో మెలిందా ఫ్రెంచ్ గేట్స్ మద్దతు తెలియజేశారు.నాసర్ ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్. అంతర్జాతీయ పోటీలలో ఈజిప్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒలింపిక్ అథ్లెట్. ఈజిప్షియన్ తల్లిదండ్రులకు చికాగోలో జన్మించారు. కువైట్‌లో పెరిగారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. ఐదు సంవత్సరాల వయస్సు నుంచే గుర్రపు స్వారీ పట్ల మక్కువ పెంచుకున్న నాసర్ అనేక ప్రపంచ ఈవెంట్లలో పాల్గొన్నారు. బిల్, మెలిందా గేట్స్‌ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్‌ను 2021లో వివాహం చేసుకున్నారు. వీరికో పాపాయి కూడా పుట్టింది. -
Lok Sabha Election 2024: మాజీ మామా అల్లుళ్ల సవాల్
శ్రీరాంపూర్‌లో పర్సనల్ ఫైట్ సిట్టింగ్ ఎంపీ బెనర్జీపై మాజీ అల్లుడు కబీర్ పోటీ గట్టి పోటీ ఇస్తున్న సీపీఎం యువ అభ్యర్థి దీప్సిత పశి్చమబెంగాల్‌లోని శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానంలో ఎన్నికలు మాజీ మామా అల్లుళ్ల మధ్య పోరుగా మారాయి. టీఎంసీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై ఆయన మాజీ అల్లుడు కబీర్ శంకర్ బోస్‌ను బీజేపీ బరిలోకి దింపింది. మూడుసార్లు నెగ్గిన కళ్యాణ్ పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో ఉంటే ఇక్కడ ఎలాగైనా ఖాతా తెరవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. శ్రీరాంపూర్ ఒకప్పుడు పారిశ్రామిక కేంద్రంగా, కమ్యూనిస్టుల కంచుకోటగా విలసిల్లింది. అక్కడ కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ ఎర్రజెండా ఎగరేసేందుకు యువ నాయకురాలు దీప్సితా ధర్‌ను సీపీఎం రంగంలోకి దింపింది... హుగ్లీ నది.. శ్రీరాంపూర్ సంక్లిష్టమైన చరిత్రకు సాక్షి. ఇదే ఇక్కడి ఒండ్రుమట్టిని అన్నం గిన్నెగా మార్చింది. జనపనార, పత్తి, కాగితం పరిశ్రమల ఏర్పాటుతో స్థిరమైన పారిశ్రామికీకరణ జరిగింది. కానీ ఇప్పుడు హింద్ మోటార్స్ మూతబడింది. పత్తి మిల్లులు చరిత్ర పుటల్లోనే మిగిలాయి. జూట్, పేపర్ మిల్లులు లాక్డౌన్లను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు వ్యవసాయ, పారిశ్రామిక శక్తిగా వేలాది మంది వలసదారులకు ఉపాధి కలి్పంచిన ఈ నేల నుంచి ఇప్పుడు వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం ఏడుసార్లు, టీఎంసీ, కాంగ్రెస్ నాలుగేసి సార్లు, సీపీఐ రెండుసార్లు చొప్పున శ్రీరాంపూర్‌ను గెలుచుకున్నాయి. దేశంలో బీజేపీ ఎన్నడూ గెలవని లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి.బెనర్జీది దిగజారుడుతనం: బోస్.. కేవలం ఎన్నికల విజయం కోసం వ్యక్తిగత విషయాలను వక్రీకరించి ప్రజల ముందు పెట్టే స్థాయికి బెనర్జీ దిగజారిపోయారంటూ కబీర్ దుయ్యబడుతున్నారు. ఆయన సానుభూతి డ్రామా ఫలించదని, ప్రజలకు అంతా తెలుసని చెప్పుకొచ్చారు. ‘‘కేవలం బెనర్జీ వల్లే ఆయన కూతురితో నా వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది. తను మళ్లీ పెళ్లి కూడా చేసుకుంది. అలాంటప్పుడు కూతురి గత జీవితాన్నే ఇలా ప్రచారానికి వాడుకోవడం చౌకబారుతనం’’ అంటూ మండిపడ్డారు. మాజీ మామకు గట్టి పోటీ ఇచ్చి తీరతానని కబీర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘‘బెంగాల్లో పరిస్థితి మారింది. మమత ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పురోగతి, అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. సామాన్యులంతా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బెనర్జీ లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో నా చేతిలో ఓడటం ఖాయం. బీజేపీకి బెంగాల్లో 35 లోక్‌సభ స్థానాలకు పైగా వస్తాయి’’ అని బోస్ జోస్యం చెబుతున్నారు.తక్షణావసరం ‘భారత్ బచావో’ సీపీఎం అభ్యర్థి దీప్సితా ధర్ జేఎన్‌యూ విద్యారి్థ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా, మోటివేషనల్ స్పీకర్‌గా, రెడ్ వాలంటీర్‌గా బాగా పేరు సంపాదించారామె. సీఏఏ, ఎన్ఆర్సీ పేరుతో ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బెంగాల్లో ఫలించబోవని అంటున్నారు. ‘‘3 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ మాటలు బూటకమని తేలిపోయింది. ప్రజలు అన్నివిధాలా మోసపోయారు. పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రత, యువతకు ఉద్యోగావకాశాలు, అవినీతిరహిత అభివృద్ధి సీపీఎంతోనే సాధ్యం’’ అంటూ దీప్సిత చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. ప్రజల విచక్షణపై నమ్మకముంది: బెనర్జీ న్యాయశాస్త్ర పట్టభద్రుడైన కళ్యాణ్ బెనర్జీ సీఎం మమతకు నమ్మకస్తుడు. 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత శ్రీరాంపూర్ నుంచి మూడుసార్లు ఎంపీ అయ్యారు. తన కూతురిని వేధించి చివరికి విడాకులు తీసుకున్న వ్యక్తికి టికెటివ్వడం బీజేపీ కుత్సిత మనస్తత్వానికి నిదర్శనమని బెనర్జీ మండిపడ్డారు. బోస్‌కు తన మాజీ అల్లునిగా తప్ప మరో గుర్తింపే లేదంటూ ఎద్దేవా చేశారు. ‘‘నేను మాట నిలుపుకునే వ్యక్తినని నియోజకవర్గ ప్రజలకు తెలుసు. వాళ్లు ఈసారీ నన్నే గెలిపిస్తారు. శ్రీరాంపూర్ నుంచి అత్యధికసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు నాకు కట్టబెడతారు’’ అని అన్నారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సొంత లోక్‌సభ స్థానం గుల్బర్గాలో బీజేపీ నుంచి మరోసారి గట్టి సవాలు ఎదురవుతుతోంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన గుల్బర్గాలో 2009, 2014ల్లో వరుసగా నెగ్గిన ఖర్గే 2019లో బీజేపీ అభ్యర్థి ఉమేశ్ జాదవ్ చేతిలో ఖర్గే ఓటమి చవిచూసి హ్యాట్రిక్‌కు దూరమయ్యారు. ఈసారి కాంగ్రెస్ నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి మరోసారి ఉమేశ్ జాదవ్ పోటీ చేస్తున్నారు. కలబురిగికి చెందిన దొడ్డమణికి పలు విద్యాసంస్థలున్నాయి. ఇంతకాలం ఖర్గే ఎన్నికల ప్రచారం, వ్యూహరచన తదితరాల్లో తెర వెనక దన్నుగా ఉన్నారు. వైద్యుడైన ఉమేశ్ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకుడే. 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీదర్‌లోని చించోలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఖర్గేతో విభేదాల కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. తన గురుతుల్యుడైన ఖర్గేపైనే గెలుపొందారు. గుల్బర్గాలోలో 65 శాతం కంటే ఎక్కువ గ్రామీణ ఓటర్లే. మొత్తమ్మీద 20 శాతం మంది ముస్లిం ఓటర్లు, 24 శాతానికి పైగా దళితులున్నారు. వీరి ఓట్లపై కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. గుల్బర్గా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ కేవలం మూడుసార్లు మాత్రమే ఓడింది. బీజేపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. మూడో విడతలో భాగంగా మంగళవారం ఇక్కడ పోలింగ్ జరుగనుంది. -
అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
-
బోండా ఉమా, చంద్రబాబుకు వెల్లంపల్లి అల్లుడు కౌంటర్
-
1.81 కోట్లు సీజ్.. నారాయణ అల్లుడు పునీత్‌పై కేసు
సాక్షి, నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పి నారాయణ అల్లుడు పునీత్‌పై పన్నుల ఎగవేత కేసు నమోదు అయ్యింది. అంతేకాదు ఈ కేసు విచారణలో భాగంగా బంధువుల ఇళ్లలో సైతం తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. కోటికి పైగా నగదు సైతం సీజ్ చేశారు. ఈ సోదాలపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు. ‘‘ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టాడు. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. రూ.10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే.. రూ. 22 లక్షల మాత్రమే జీఎస్టీ కట్టారు. అంటే 10 కోట్ల పన్ను ఎగవేశారన్నమాట. ఇక నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి సరైన పత్రాలు చూపించనందున రూ. కోటి 82 లక్షలు నగదు సీజ్ చేశాం.. . పునీత్ డైరెక్టర్ గా ఉన్న ఇన్స్పైర్ మేనేజ్మెంట్ కేంద్రంగా రవాణా శాఖకు పన్నులు ఎగగొట్టారు. సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు. డీఆర్ఐ అధికారులు రవాణా శాఖకు ఫిర్యాదు చేయడంతో సోదాలు నిర్వహించాం. ఈ వ్యవహారంపై నారాయణ అల్లుడు పునీత్ పై కేసు నమోదు చేశాం. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి అనుబంధంగా ఈ ఇన్స్పైర్ సొసైటీ ఉంది. అయితే బస్సులు కొనుగోలు సంబంధించి ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పైన రిజిస్ట్రేషన్ చేశారు. నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతి నెలా అద్దె కడుతున్నారు. అలాగే.. నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు చూపించారు’’ అని ఎస్పీ వివరించారు. -
కొత్త అల్లుడికి వందల రకాల నోరూరించే వంటకాలు
-
నారాయణ సంస్థలు, భూములకు లబ్ది చేకూరేలా అలైన్మెంట్ మార్పులు
-
భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన చాలా ప్రత్యేకం: రిషి సునాక్
ఢిల్లీ: జీ-20కి వేదికగా నిలిచిన భారత్‌కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చేరుకున్నారు. రిషి సునాక్ తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని విమానాశ్రయంలో దిగారు. కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే ఆయనకు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనను రిషి సునాక్ ప్రశంసించారు. భారత్‌లో జరుగుతున్న జీ20 సమావేశాలకు బ్రిటన్‌లో బయలుదేరే ముందు రిషి సునాక్ మీడియాతో మాట్లాడారు. భారత్ తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనను భారతదేశ అల్లునిగా వ్యవహరించడాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. తనపై ప్రేమతో భారతీయులు అలా పిలుస్తారని అన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా చర్చలు జరుపనున్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు. జీ-20 సమావేశానికి ప్రపంచ అగ్రదేశాదినేతలు హాజరవుతున్నారు. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి జపాన్ ప్రధాని పుమియో కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇదీ చదవండి: భారత్‌ను ఇలా చూడడం గర్వంగా ఉంది: రిషి సునాక్ -
నిర్మలా సీతారామన్ అల్లుడు.. మోదీకి బాగా దగ్గర!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు వాంగ్మయి వివాహం ఆడంబరాలకు దూరంగా జరిగింది. గురువారం బెంగళూరులో ఓ హోటల్లో వాంగ్మయి, ప్రతీక్ దోషీ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజకీయ ప్రముఖులెవరినీ నిర్మలా సీతారామన్ ఈ వివాహానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ, నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో జర్నలిజం చదువుకున్న వాంగ్మయి.. మింట్ లాంజ్స్ బుక్స్ అండ్ కల్చర్ సెక్షన్లో ఫీచర్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఇక గుజరాత్‌కు చెందిన ప్రతీక్ దోషి నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెల్లడైంది. నరేంద్ర మోదీకి ప్రతీక్ చాలా దగ్గర. అయితే అది చుట్టరికంగా కాదు.. మోదీతో సుదీర్ఘకాలంగానే ప్రతీక్ ప్రయాణం కొనసాగడం ద్వారా. ► గుజరాతీ అయిన ప్రతీక్ దోషి.. సింగపూర్ మేనేజ్మెంట్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయంలో(CMO)లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ప్రతీక్ పని చేశాడు. ► అటుపై 2014 నుంచి ప్రధాని కార్యాలయం(PMO) అనుబంధంగా పని చేస్తున్నారు. 2019 జూన్‌లో దోషికి జాయింట్ సెక్రటరీ ర్యాంక్ దక్కింది. ► ప్రస్తుతం ఆయన పీఎంవోలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ-OSD)గా హోదాలో కొనసాగుతున్నారు. రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ వింగ్‌లో ఆయన పనిచేస్తున్నట్లు పీఎంవో వెబ్సైట్లో ఉంది. ► పరిశోధన & వ్యూహాలకు మాత్రమే పరిమితం కాకుండా.. భారత ప్రభుత్వ (వ్యాపార కేటాయింపు) నియమాలు, 1961 ప్రకారం.. ప్రధానమంత్రికి కార్యదర్శిగా సలహాలు ఇవ్వడమూ చేస్తున్నారు ప్రతీక్. ► ప్రతీక్.. పెద్దగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అలాగే.. చెన్నైలో పుట్టి పెరిగిన వాంగ్మయి కూడా మీడియా కంట పెద్దగా పడింది లేదు. ► వాంగ్మయి-ప్రతీక్ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ హోటల్లో ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ::: సాక్షి వెబ్‌డెస్క్ -
కొవ్వూరులో దారుణం.. సిలిండర్‌తో అత్తమామలపై అల్లుడి దాడి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలపై అల్లుడు విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను చితకబాదాడు. దీంతో మామ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తీవ్ర గాయాల పాలైన అత్తను స్థానికుల సహాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న కొవ్వురు డీఎస్పీ వీఎస్ వర్మ, సీఐ వైవీ రమణ..సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అల్లుడి దాడిలో మృతిచెందిన మామను రాయంకుల శ్రీరాకృష్ణగా, గాయాలైన అత్త బేబీ(61)గా గుర్తించారు. అల్లుడిని దొమ్మేరుకు చెందిన నందిగం గోపి(42)గా తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: విధి అంటే ఇదేనేమో.. స్వగ్రామానికి వస్తూ అనంతలోకాలకు.. -
అల్లుడు బైక్ అడిగినందుకు చెప్పుదెబ్బలతో సాగనంపిన మామ
-
సంగారెడ్డి: అత్తామామల హత్యకు అల్లుడి షాకింగ్ స్కెచ్
సాక్షి, సంగారెడ్డి: చిన్న చిన్న విషయాలే.. ఒక్కోసారి తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా ఉసిగొల్పుతాయి. అలా ఓ అల్లుడు ఏకంగా తనకు పిల్లనిచ్చిన అత్తామామల్ని చంపేయాలని ప్లాన్ వేశాడు. అది మామూలు స్కెచ్‌తో కాదు.. షాకింగ్ స్కెచ్‌తో!. చివరకు ఆ కుట్ర బయటపడడం, అందుకు కారణం ఏంటో తెలిసి పోలీసులతో పాటు స్థానికులు షాక్ తినడం ఒకదాని వెంట మరొకటి జరిగాయి. అత్తమామల హత్యకు షాకింగ్ స్కెచ్ వేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. రమేష్ అనే వ్యక్తి తన భార్య తల్లిదండ్రుల్ని చంపడానికి ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా.. ఈ నెల 12వ తేదీన ఇంటి తలుపులకు కరెంట్ షాక్ పెట్టాడు. అయితే రమేష్ అనుకున్నట్లు జరగలేదు. అత్తామామలకు బదులుగా.. తల్లీకూతుళ్లు ఆ తలుపును తాకడంతో షాక్‌కి గురయ్యారు. కరెంట్ షాక్‌తో విలవిలలాడుతూ.. వాళ్లు వేసిన కేకలకు స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే కరెంట్ ఆఫ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో తాజాగా అల్లుడు రమేష్ కుట్రదారుడని తేలింది. ఇంతకీ ఎందుకు చంపాలని ప్రయత్నించాడో తెలుసా?.. గతంలో ఓసారి ఇంటికి వెళ్లినప్పుడు ఆ అత్తామామలు, అల్లుడు రమేష్‌ను మందలించలేదనట. పలకరించలేదన్న ఆ కోపంతో అప్పటి నుంచి రగిలిపోతున్న రమేష్.. ఎలాగైనా వాళ్లను చంపేయాలని అనుకున్నాడట. చివరకు కరెంట్‌షాక్‌తో యత్నిస్తే తన మీదకు రాదని అలా చేశానని రమేష్ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఆ అల్లుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు. ఇదీ చదవండి: మంచిర్యాలలో దారుణం.. ఊరంతా చూస్తుండగానే.. -
అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన.. అసలు ఏం జరిగిందంటే?
సాక్షి, సూర్యాపేట జిల్లా: అత్తగారింటి ఎదుట అల్లుడు నిరసనకు దిగిన ఘటన కోదాడలో జరిగింది. తన కొడుకుని చూపించకుండా అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆ అల్లుడు ఆరోపిస్తున్నాడు. భార్యాభర్తలైన ప్రవీణ్ కుమార్, పృథ్వీ రమణీల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. బాబుని తల్లిదండ్రుల చెంతనే ఉంచి పృథ్వీ రమణీ కెనడా వెళ్లింది. వారం వారం కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్న ప్రవీణ్.. తన కొడుకును చూడకుండా అత్తామామలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. తన నుంచి కొడుకును దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ప్రవీణ్.. తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగాడు. చదవండి: హైదరాబాద్‌లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ..ఎక్కడో తెలుసా -
వామ్మో ఇదేం ఆచారం రా బాబు! అక్కడ అల్లుడిని గాడిదపై కూర్చొబెట్టి..
భారత్‌లో హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే పలు రాష్ట్రల్లో ఈ పండగను విభిన్న రీతిలో వారి సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటుంటారు. కానీ కొన్ని చోట్ల సంప్రదాయాలు చాలా విడ్డూరంగా ఉంటాయి. వామ్మో ఇదేం ఆచారం అనిపించేలా ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు. అచ్చం అలాంటి విచిత్రమైన సంప్రదాయమే మహారాష్ట్రాలో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలలో 82 ఏళ్లుగా ఒక విచిత్రమైన సంప్రదాయ కొనసాగుతోంది. హోలీ తర్వాత రోజు గ్రామంలో కొత్త అల్లుడిని బ్యాండ్ బాజాలతో గాడిదపై కూర్చొబెట్టి ఊరంతా ఊరేగిస్తారు. ఇదేంటి ఆచారమా!అవమానిస్తున్నారా అన్నట్లుంటుంది ఈ ఆచారం. బీడ్ గ్రామంలోని ప్రజలు మాత్రం గాడిదపై కూర్చొబెట్టడం అనేది సత్కారంగా కింద చూస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అదేమిటంటే..గ్రామంలో నివశిస్తున్న ఠాకూర్ ఆనంద్ దేశ్‌ముఖ్ కుటుంబానికి చెందిన అల్లుడు హోలీకి రంగులు వేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే అతన్ని గాడిదపై కూర్చొబెట్టి, చెప్పుల దండ వేసి ఊరంతా తిప్పుతూ ఉండగా..అతను హోలీ రంగులు వేస్తుండాలి. అందువల్ల అతను రంగులు వేసేందుకు ససేమిరా అన్నాడు. దీంతో అతడి మామగారు అతన్ని ఏదోలా ఒప్పించి గాడిదను చక్కగా అలంకరించి దానిపి కూర్చోబెట్టి ఊరంతా తిప్పి.. ఆ తర్వాత గుడికి తీసుకువచ్చి హరతి ఇచ్చి స్వాగతం పలికారు ఆ అల్లుడికి. ఆ తర్వాత మామగారు కొత్త బట్టలు, బంగారు ఉంగరం బహుకరిచడంతో ముభావంగా ఉన్న అల్లుడు ముఖం కాస్త సంతోషంతో చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. దీంతో అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ ఆచారాన్నే కొనసాగిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. (చదవండి: ఏనుగు ఘీంకారం! క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయేవే... ఆ పసిపాప బిగ్గరగా ఏడవడంతో..) -
హైదరాబాద్ అల్లుడు.. భీమవరం మామ.. 173 రకాలతో..
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి): గోదావరి జిల్లాలంటేనే వెటకారానికి, మమకారానికి పెట్టింది పేరు. గోదావరి వాసుల అతిథి మర్యాదలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి నాగభద్రిలక్ష్మీనారాయణ(బద్రి)–సంధ్య దంపతులు తమ అల్లుడు చవల పృథ్వీగుప్తకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 రకాల వంటలతో శనివారం విందు భోజనం పెట్టి అబ్బుర పరిచారు. సేమ్యదద్దోజనం, పెసర పునుకుల పలావు, కొబ్బరి పలావు, పెసర వడలు, తమలపాకు బజ్జీ, వంకాయ బజ్జీ, స్వీట్స్‌లో శనగపప్పు బూరెలు, పాకం గారెలు, ఎర్రనూక హల్వా, ఆకు పకోడి, సగ్గుబియ్యం వడలు వంటి రకాలతో పాటు వివిధ పండ్లు, పొడులు, అప్పడాలు, వడియాలు, బిర్యానీలు, పచ్చళ్లు, వేపుళ్లు, పప్పు కూరలు, ఆకు కూరలతో పాటు పలు రకాల ఐస్‌క్రీమ్స్ వడ్డించగా, వీటిలో ఎక్కువ శాతం ఇంటిలోనే తయారు చేయించడం విశేషం. చదవండి: ఎత్తిపోతలకు గట్టిమేలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
కనిపెంచిన తండ్రి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దేవుడా ఎంత శిక్ష వేసావయ్యా
రాయవరం(కోనసీమ జిల్లా): ఒక రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. తండ్రిని, భర్తను పోగొట్టుకున్న కుమార్తె ఒక వైపు, భర్తను, అల్లుడిని పోగొట్టుకున్న తల్లి మరొకవైపు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంట తడి పెట్టించాయి. రాయవరం మండలం పసలపూడి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జంధ్యం సుబ్రహ్మణ్యం మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. అదే ప్రమాదంలో గాయపడిన సుబ్రహ్మణ్యం అల్లుడు మాచవరం గ్రామ వలంటీర్ విడియాల మోహన్‌గాంధీ(26) గురువారం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చదవండి: స్కూల్ బస్ మిస్.. బైక్‌లో తీసుకెళ్తుండగా కనిపెంచిన తండ్రిని, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను దూరం చేసి దేవుడా.. ఎంత శిక్ష వేసావయ్యా అంటూ మోహన్‌గాం«ధీ భార్య విజయదుర్గా భవాని బోరున విలపిస్తుంది. ఇక తనకు దిక్కెవరు అంటూ ఆమె విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆస్పత్రి నుంచి భర్త క్షేమంగా వస్తాడనుకున్నంతలోనే చావు కబురు వినాల్సి వచ్చిందంటూ ఆమె ఆవేదన చెందింది. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితమే శస్త్ర చికిత్స చేయించుకుని ఒక పక్క భర్త సుబ్రహ్మణ్యం, మరో పక్క అల్లుడు మోహన్‌గాం«దీని కోల్పోయిన సుబ్రహ్మణ్యం భార్య వెంకటలక్ష్మి మౌనంగా రోదిస్తుంది. మృతుడు మోహన్‌గాంధీకి నిత్య, చైతన్య వర్షిణి చిన్నారులున్నారు. మోహన్‌గాంధీ తండ్రి శ్రీనివాస్ తాపీ మే్రస్తిగా పనిచేస్తూ గతేడాది భవనంపై నుంచి పడి పోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. గత నెలలో శస్త్ర చికిత్స చేయించుకున్న మృతుడు మోహన్‌గాంధీ తల్లి అరుణ నడవలేని స్థితిలో ఉంది. సౌమ్యుడిగా ఉంటూ అందరితో కలుపుగోలుగా ఉండే మోహన్‌గాంధీ మరణం గ్రామంలో ప్రతి ఒక్కరినీ కలచివేసింది. రోజు వ్యవధిలో మామాఅల్లుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల శిక్ష
ఒంగోలు: అత్త పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి ఎంఏ సోమశేఖర్ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..చీరాలకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి చెప్పుల దుకాణం నిర్వహించేది. ఆమె కుమార్తెను చిత్తూరు జిల్లాకు చెందిన కోలా జాన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అదనపు కట్నం కావాలంటూ భార్యను నిత్యం జాన్ వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో జాన్..భార్య తల్లికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధించేవాడు. చివరకు ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో చీరాలకు వచ్చి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించబోగా ఆమె కేకలు వేస్తూ బయటకు వచ్చింది. అనంతరం భర్తతో కలిసి చీరాల పోలీసులకు ఫిర్యాదుచేయగా అప్పటి సీఐ వి.సూర్యనారాయణ దర్యాప్తుచేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. నేరం నిరూపణ అయినట్లుగా న్యాయమూర్తి పేర్కొంటూ నిందితుడు జాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యత్తపు కొండారెడ్డి వాదించగా, కోర్టు లయన్ ఆఫీసర్‌గా లక్ష్మీనారాయణ వ్యవహరించారు. చదవండి: (తప్పుడు ఆరోపణలు చేస్తే.. మీరే ఫూల్స్ అవుతారు: ఆర్కే రోజా) -
రాయదుర్గం ఎమ్మెల్యే అల్లుడు ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆత్మహత్య చేసుకున్నారు. కాపు రామచంద్రారెడ్డి కుమార్తె భర్త అయిన మంజునాథరెడ్డి తాడేపల్లిలోని అవంతి అపార్టుమెంటులోని ఫ్లాట్‌లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కార్పొరేట్ ఆస్పత్రిలో భద్రపర్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. (క్లిక్: ఆర్జీఎఫ్.. ఇది మన కేజీఎఫ్) -
లాలూ అల్లుడి రగడ.. నితీశ్‌కు కొత్త తలనొప్పి
పాట్నా/గయ: బిహార్‌లో ఇటీవలే ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు శైలేష్ కుమార్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. లాలూ కుమార్తె, ఆర్జేడీ రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి భర్త ఈ శైలేష్ కుమార్. ఇటీవల లాలూ పెద్ద కుమారుడు, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ నేతృత్వంలో జరిగిన రెండు అధికారిక భేటీల్లో అతడు పాల్గొన్నట్లు వీడియో దృశ్యాలు, ఫొటోలు శుక్రవారం బయటకు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ తన అధికారిక విధులను బావ శైలేష్ ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చాడని బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ ఆరోపించారు. శైలేష్ నేరుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాడని ఆక్షేపించారు. దీనిపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ఆర్మీలో చేరాలనుకున్నా! కానీ.. -
బావ అధికారిక సమావేశంలో బావమరిది హాజరు...వివాదంలో లాలు ప్రసాద్ కుటుంబం
పాట్న: మరోసారి వివాదంలో లాలు ప్రసాద్ కుటుంబం వివాదంలో చిక్కుకుంది. బిహార్ పర్యావరణ మంత్రి తేజ్ ప్రతాప్ అధికారిక సమావేశంలో లాలు ప్రసాద్ అల్లుడు హాజరవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రి వర్గంలో మంత్రి తేజ్ ప్రతాప్ సంబంధించిన శాఖపరమైన సమావేశానికి లాలు ప్రసాద్ పెద్ద అల్లుడు కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆర్జేడీ పై అధికార పార్టీ బీజేపీ విమర్శల దాడి చేసింది. వాస్తవానికి తేజ్ ప్రతాప్ ఆగస్టు 16న మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అదే రోజున ఆయనకు కేటాయించిన పర్యావరణం, అటవీ వాతావరణ మార్పుల శాఖ బాధ్యతలు చేపట్టారు. ఐతే ఆగస్టు 17న అరణ్య భవన్లో అటవీ వాతావరణ మార్పుల శాఖ సమీక్ష సమావేశానికి తేజ్ ప్రతాప్ అధ్యక్షత వహించారు. అప్పుడు జరిగిన అధికారుల సమావేశానికి లాలు ప్రసాద్ పెద్ద అల్లుడు శైలేష్ కుమార్ కూడా వచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 18న బిహార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో కూడా తేజ్ ప్రతాప్ మరోసారి సమావేశమయ్యారు. ఆ సమావేశానికి కూడా శైలేష్ రావడమే కాకుండా ఆయనతోపాటు కలిసి కూర్చోవడంతో పెద్ద దూమారం రేగింది. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టింది. "తేజ్ ప్రతాప్‌ని ఎవ్వరూ తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే మంత్రులందరిలోనూ ఆర్జేడీ కోటా కుమారుడు శైలేష్ యాదవ్ అత్యంత తెలివైనవాడు అతని ఆశీస్సులు తేజ్ ప్రతాప్‌కు ఉంటే ఉత్తమ మంత్రిగా ఎదుగుతాడు." అని ఎద్దేవా చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి శైలేష్‌ని ఉద్దేశించి విమర్శిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ని మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు!) -
డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్‌పై లైంగిక వేధింపుల కేసు!
ప్రముఖ డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు తెలుస్తోంది. రోహిత్‌తో పాటు మరో అయిదుగురిని పుదుచ్చెరి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. 16 ఏళ్ల మైనర్ బాలికను లైంగిక వేధించారనే ఆరోపణలతో రోహిత్, మిగలిన అయిదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్, అతడి తండ్రి దామోదరన్, కోచ్ థమరాయ్ కన్నన్‌తో పాటు మరో ఇద్దరిపై పుదుచ్చెరిలోని మెట్టుపాళయమ్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులతో కలిసి బాధిత బాలిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన తనని లైంగికంగా వేధించారని సదరు బాధిత బాలిక ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత దీంతో రోహిత్‌తో పాటు అతడి తండ్రి, కోచ్ మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని తనని బెదిరించిట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇచ్చిన మరో ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. అయితే వారిని అరెస్టు చేశారా? లేదా?, ఇంకా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది జూన్‌లో డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్యతో రోహిత్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: ఘనంగా శంకర్ కూతురి వివాహం, హాజరైన సీఎం చదవండి: నాగబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు -
ఇల్లరికం వెళ్లిన అల్లుడు అమ్మమ్మ ఊరికి వచ్చి శవమయ్యాడు
హన్వాడ: అమ్మమ్మ ఊరికి వచ్చిన యువకుడు బావిలో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని ఏనమీదితండా సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన శివకృష్ణ (29)కు నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన అరుణకు మూడేళ్ల కిందట వివాహమైంది. శివకృష్ణ ఇల్లరికం వెళ్లాడు. చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ ఈక్రమంలోనే భార్య అరుణతో తరచూ గొడవలు జరిగేవి. శివకృష్ణ అప్పుడప్పుడు స్వగ్రామం మహమ్మదాబాద్, అమ్మమ్మ వారి గ్రామం ఏనమీదితండాకు వచ్చివెళ్లేవాడు. గత శనివారం కూడా కోస్గి నుంచి నేరుగా అమ్మమ్మ ఇంటికి (ఏనమీదితాండ) వచ్చిన శివకృష్ణ అదేరోజు ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా గ్రామ సమీపంలో దొడ్డుకుంటోని బావిలో పడి మృత్యువాతపడ్డాడు. బుధవారం మృతదేహం బావిలో తేలడంతో స్థానికులు గమనించి బయటికి తీశారు. ఈ సమాచారం తెలుసుకున్న హన్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవపంచనామా చేశారు. జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హన్వాడ పోలీసులు తెలిపారు. చదవండి: సిరిసిల్ల జిల్లా అరుదైన ఫీట్: సంతోషంలో కేటీఆర్ -
అత్త, అల్లుడు అరెస్ట్; వీరి రూటే సపరేటు
శివమొగ్గ: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అత్త, అల్లుడు పోలీసులకు అతిథిగా వెళ్లారు. ఉత్తర కన్నడ జిల్లాలోని శిరావాడ గ్రామానికి చెందిన కమలమ్మ, అల్లుడు మరియప్ప గోపినాయక్‌లు ఇళ్ల్లల్లో చొరబడి దొరికిన విలువైన సొత్తును ఎత్తుకెళ్లేవారు. వారం రోజుల క్రితం ఈ ఇద్దరు కలిసి జిల్లాలోని సోరబ పట్టణంలో ఓ ఇంట్లో చోరీ చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేయగా ఇద్దరూ దొరికిపోయారు. 37 గ్రాముల బంగారు నగలు, 200 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. -
మామ సీఎం.. అల్లుడు ఎమ్మెల్యే
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. మామ, అల్లుళ్ల జంట అసెంబ్లీలోకి త్వరలో అడుగిడనుంది. ఆ మామ, అల్లుళ్లు ఎవరో కాదు సాక్షాత్తూ సీఎం పినరయి విజయన్, ఆయన అల్లుడు పి.ఎ.మొహమ్మద్ రియాస్..!. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్(77) కన్నూర్ జిల్లా ధర్మదామ్ నుంచి, ఆయన అల్లుడు రియాస్(44) కోజికోడ్ జిల్లా బేపోర్ నియోజకవర్గం నుంచి, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విజయన్ కూతురు వీణ, రియాస్ 2020లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. వీణ బెంగళూరులో ఐటీ సంస్థను నడుపుతుండగా రియాస్ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. రియాస్ 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నుంచి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. కేరళ అసెంబ్లీకి 11 మంది మహిళా ఎమ్మెల్యేలు 2001 తర్వాత మొట్టమొదటి సారిగా కేరళ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం ఈసారి రెండంకెలకు చేరింది. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 140 స్థానాలకు 103 మంది మహిళలు బరిలో నిలవగా 11 మంది మాత్రం విజయం సాధించారు. వీరిలో 10 మంది అధికార ఎల్డీఎఫ్కు చెందిన వారు, ఒక్కరు మాత్రమే ప్రతిపక్ష యూడీఎఫ్ ఎమ్మెల్యే. ఆరోగ్యమంత్రి కేకే శైలజ 60 వేల ఓట్ల మెజారిటీతో మత్తన్నూర్ నుంచి ఘన విజయం సాధించారు. 2016 ఎన్నికల్లో 8 మంది మాత్రమే నెగ్గగా, 1996లో 13 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
వరకట్నం వేధింపులు.. అల్లుడ్ని చెట్టుకు కట్టేసి..
భువనేశ్వర్ : కొరాపుట్ జిల్లా సెమిలిగుడ సమితిలోని మాలిగొంజ గ్రామంలో అత్తింటి వారు అల్లుడిని స్తంభానికి కట్టి చితకబాదారు. తాగిన మైకంలో అల్లుడు తమ కుమార్తెను వేధిస్తున్నాడని తెలుసుకున్న అత్తింటివారు ఆగ్రహోదగ్రులై అల్లుడిని మంగళవారం గ్రామానికి తీసుకువచ్చి గ్రామం మధ్యలో గల విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం తెలిసిన పొట్టంగి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి స్పృహతప్పిన ఆ యువకుడిని రక్షించారు. మొదట అతడిని పొట్టంగి హాస్పిటల్లో చేర్చారు. అక్కడినుంచి కొరాపుట్‌లోని సహిద్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల హాస్పిటల్లో చేర్చారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సెమిలిగుడ సమితిలోని మాలిమొరియ గ్రామానికి చెందిన యువకుడు లొఖి ఖొర, మాలిగొంజ గ్రామానికి చెందిన ధనేశ్వర గొలారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన కొన్నాళ్లకు కట్నం తీసుకు రమ్మని భార్యను వేధిస్తూ కొట్టడం ప్రారంభించాడు. ( తెల్లారిన కూలీల బతుకులు) అంతే కాకుండా ఆమెను సోమవారం కన్నవారింటికి తీసుకుని బయలు దేరాడు, మార్గంలో ఆమెను అమానుషంగా కొట్టి దారిలోనే విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబసభ్యులు వెంటనే వచ్చి మార్గమధ్యంలో ఉన్న ధనేశ్వరిని ఆస్పత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. అనంతరం కోపంతో సెమిలిగుడలో ఉన్న అల్లుడు లొఖి ఖొరను ఎత్తుకు వచ్చి మాలిగొంజి గ్రామంలో విద్యుత్ స్తంభానికి కట్టి చితకబాదారు. ఈ సంఘటనపై ధనేశ్వరి, లొఖి ఖొర కుటుంబ సభ్యులు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాట వినడం లేదని అత్తను హత్యచేసిన అల్లుడు
సాక్షి, తాడేపల్లిగూడెం అర్బన్: తన మాట వినడం లేదని అత్తను అల్లుడే హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1న తాడేపల్లిగూడెం 11వ వార్డు చెట్లరోడ్డులో మహిళ మృతి చెందిన సంఘటనపై పోలీసుల దర్యాప్తుతో ఈ విషయం వెలుగుచూసింది. తాడేపల్లిగూడెం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షేక్ ఉస్మాన్ బాషా తాడేపల్లిగూడెంలో అంబులెన్సులు నడిపేవాడు. అతని అత్త రఫీ ఉన్సీసా ఇద్దరు కుమారులతో తాడేపల్లిగూడెం పట్టణంలోని 8వవార్డులో ఉంటుంది. ఇద్దరు కుమారులు వ్యసనాలకు బానిసలై తల్లిని పట్టించుకునేవారు కాదు. అత్తకున్న ఆస్తిలో కొంత పొలాన్ని అమ్మి డబ్బులిస్తే ఇల్లు కట్టిస్తానని అల్లుడు బాషా తరచూ చెప్పేవాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. తన మాట వినడంలేదని కోపంతో ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. నవంబరు 30న ఆమె చిన్నకొడుకుకు నాటు మందు ఇప్పిస్తానని నమ్మించి అత్త ఉన్నీసాను కారులో ఎక్కించుకుని అనంతపల్లికి తీసుకెళ్లాడు. తిరిగి వెంకట్రామన్నగూడెం తీసుకువచ్చి ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆమెను వదిలి నాటు మందు తీసుకొస్తానని వెళ్లాడు. చీకటిపడే వేళకు వచ్చి అత్తపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె మృతి చెందకపోవడంతో ఉన్నీసా ధరించిన చీరను మెడకు బిగించి హత్యచేశాడు. మృతదేహాన్ని కారులోకి చేర్చి తాడేపల్లిగూడెంలోని ఆమె ఉంటున్న ఇంటికి తీసుకొచ్చాడు. చదవండి: ('నన్ను వెతకకండి.. నేను చనిపోతున్నా..’) పోలీసులకు వీఆర్వో సమాచారం తర్వాత రోజు ఉదయం పెద్దకుమారుడు వచ్చి చూసేసరికి తల్లి మృతిచెంది ఉండడాన్ని గమనించాడు. అతను బాషాకు సమాచారం అందించగా.. విషయం పోలీసులకు చెప్పవద్దని కేసు, పోస్టుమార్టం అంటూ ఇబ్బంది పెడతారంటూ ఇద్దరు కుమారులను అంత్యక్రియలకు ఒప్పించాడు. అక్కడి నుంచి అత్త మృతదేహాన్ని తాను అద్దెకుంటున్న ఇంటికి చేర్చాడు. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా విషయం తెలుసుకున్న వీఆర్వో వచ్చి పరిశీలించాడు. హత్య చేసినట్లు ఉందని పోలీసులకు సమాచారం అందించాడు. ఈలోగా బాషా తన కారుతో పరారయ్యాడు. అనుమానం వచ్చిన పోలీసులు బాషా కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ నెల 4న వెంకట్రామన్నగూడెం అడ్డరోడ్డులో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అత్త ఉన్నీసాను తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్లు సీఐ ఆకుల రఘు తెలిపారు. చదవండి: (అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి) -
మామపై రెబెల్‌గా పోటీ చేస్తా..!
సాక్షి, హైదరాబాద్: ‘నా పేరు సర్వే సత్యనారాయణ అల్లుడు కాదు.. క్రిశాంక్ మాత్రమే. ఉస్మానియా విద్యార్థి నేతగా కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితుడిని. 6 నెలలుగా నియోజకవర్గంలో బస్తీ నిద్రలు చేసి ప్రజలకు చేరువయ్యాను. మా జేబులన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఎవరో వచ్చి టికెట్ ఎగరేసుకుపోతే ఎలా.. ఈ రోజు మా మామ.. రేపు ఇంకో పారాచూట్ నేత.. ఇంక మాకు ఓపిక లేదు. నేను రెబ ల్గా పోటీచేసేందుకే సిద్ధమవుతున్నా’ అని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అల్లుడు మన్నె క్రిశాంక్ అన్నారు. ఓయూ విద్యార్థి నేత అయిన క్రిశాంక్‌కు గత ఎన్నికల్లో త్రుటిలో కంటోన్మెంట్ టికెట్ చేజా రింది. గత ఎన్నికల సందర్భంగా తన పేరును అభ్యర్థిగా ప్రకటించి చివరి నిమిషంలో మార్పు చేశారు. అయినా ఆయన అప్పటి నుంచి పార్టీలో కొనసాగు తూ, కంటోన్మెంట్ నియోజకవర్గంలో క్రియాశీలకం గా పనిచేస్తున్నారు. తన మామ సర్వేకు కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై క్రిశాంక్ గళం విప్పారు. మంగళవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 3 సార్లు ఓడిపోయిన సర్వేకు టికెట్ ఎలా ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే ఎవరో ప్రజలకు తెలియదు.. సర్వే సత్యనారాయణ ఎవరో కంటోన్మెంట్ ప్రజలకు తెలియదని, తన పేరు అందరికీ తెలుసని క్రిశాంక్ చెప్పారు. ఈసారి కాంగ్రెస్ ఒక్క ఓయూ విద్యార్థి నాయకుడికి కూడా టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ టికెట్ రావాలంటే గాడ్‌ఫాదర్ ఉండాలని వ్యాఖ్యానించారు. -
భారీ కుంభకోణం: సీఎం అల్లుడు బుక్
సాక్షి, లక్నో: ప్రభుత్వ రంగ బ్యాంకులో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. ప్రైవేట్ చక్కెర ఉత్పాదక సంస్థ శింబోలీ షుగర్స ఓబీసీకి రూ.109 కోట్ల మేర రుణాలు ఎగవేసిన కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అల్లుడు, శింభోలీ షుగర్స్ డిప్యూటీ డైరెక్టర్ గురుపాల్ సింగ్ కీలక నిందితుడుగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంస్థ శింభోలీ షుగర్స్ రుణాల చెల్లింపులో విఫలంకావడంతో ఓబీసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో పంజాబ్ సీఎం కుమార్తె జై ఇందర్ సింగ్ భర్త, కంపెనీ డిప్యూటీ డైరెక్టర్లలో ఒకరైన గురుపాల్ సింగ్, శింభోలీ సీఎండీ, సీఈవో, సీఎఫ్‌వో సహా,13మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం ఎనిమిది కంపెనీల్లో గురుపాల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. 20111 లో చక్కెర రైతులు 5700మందికి సహాయం చేసే ఉద్దేశంతో ఆర్బీఐ పథకంకింద 150కోట్ల మేర రుణం మంజూరైంది. అయితే ఈ మొత్తం రైతులకు పంపణీ చేయకుండా అక్రమార్గాల్లో కంపెనీ అకౌంట్లో మళ్లించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ. అలాగే శింభోలీ సిబ్బందితోపాటు బ్యాంక్ అధికారులు కొందరిపై సైతం కేసు రిజిస్టర్ అయింది. ఈ వార్తలతో శింబోలి షుగర్స్షేరు 15 శాతం కుప్పకూలి నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, హపూర్, నోయిడాలలో కంపెనీల డైరెక్టర్ల నివాసాలు, ఫ్యాక్టరీ, కార్పోరేట్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసు సహా ఎనిమిది ప్రాంగణాలలో సోదాలు నిర్వహించామని సిబిఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ వెల్లడించారు. నిందితులపై నేరపూరిత కుట్ర, మోసంఅవినీతి నిరోధక చట్టంకింత కేసు నమోదు చేశామన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం, 97.85 కోట్ల రూపాయల నగదును బ్యాంకు ప్రకటించగా, అసలు రుణం రూ.109.08 కోట్లకు చేరింది. మరోవైపు ఈ రుణాన్ని తీర్చేందుకు జనవరి 28, 2015 లో రూ.110కోట్ల మరో కార్పొరేట్ రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు మొత్తం రుణాన్ని రూ.113 కోట్లుగా తేల్చింది. అయితే 2016 నవంబరులో ఎన్పీఏగా ప్రకటించింది. కాగా 2017 నవంబరు 17న బ్యాంకు సిబిఐకి ఫిర్యాదు చేయగా, ఫిబ్రవరి 22, 2018 న మాత్రమే నమోదు చేయడం గమనార్హం. -
మోదీజీ ఇదిగో మీ అల్లుడితో కలువండి
-
మోదీగారు మీ అల్లుడు ఇతనే!
ఆ మధ్య రాఖీ సావంత్ ప్రధాని నరేంద్రమోదీ బొమ్మలు ముద్రించిన బ్లాక్ డ్రెస్‌ను వేసుకొని హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. పాపులారిటీ కోసం తెగ తాపత్రయపడే రాఖీ అప్పట్లో ప్రధాని మోదీ తన ‘డ్రీమ్ మ్యాన్’ (కలల రాజు) అని, ఆయనను ఆకట్టుకునేందుకు ఈ డ్రెస్ వేసుకున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మారిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీని తన తండ్రితో పోలుస్తూ తాజాగా ఈ అమ్మడు ఓ పోస్టు పెట్టింది. ఇతనే నా వరుడు అంటూ గతవారం రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో వైరల్ మారింది. అందులో ఏమన్నదంటే.. ‘నేను చేసుకోబోయే వరుణ్ణి ఎప్పుడూ చూపిస్తావంటూ స్నేహితులందరూ ఒకటే అడుగుతున్నారు. ఇతనే ఆ వరుడు. ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నాను. వరుణ్ణి కనుగొన్నాను. ఇతనే నా వరుడు. ప్రియుడు’ అంటూ రాఖీ చెప్పుకొచ్చింది. ‘ప్రధాని మోదీ సహా భారతీయులందరూ ఇప్పుడు నన్ను చూస్తున్నారు. మోదీజీ నాకు అతిపెద్ద అభిమాని. మోదీజీ ఇదిగో మీ అల్లుడితో కలువండి’ అంటూ ఈ హాట్ భామ పేర్కొంది. అన్నట్టు 2009లో స్వయవరం పేరిట ఓ టీవీషోలో పాల్గొని.. ఎలెష్ పురంజన్వాలా అనే యువకుడితో రాఖీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిశ్చితార్థం చేసుకున్న రాఖీ.. డబ్బు కోసమే ఈ స్వయంవరం షోలో పాల్గొన్నట్టు వెల్లడించింది. ఇక సినిమాల విషయానికొస్తే వివాదాస్పద బాబా గుర్మీత్ రాంరహీంసింగ్ జీవిథకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో హనీప్రీత్ సింగ్ పాత్రలో ఈ భామ నటిస్తోంది. -
అల్లుడి కిరాతకం
- భార్యను కాపురానికి పంపలేదని అత్తారింటికి నిప్పుపెట్టిన అల్లుడు - తృటిలో ప్రాణాలతో బయటపడిన పది మంది - మూడు గుడిసెలు దగ్ధం - రూ.2 లక్షల ఆస్తినష్టం - ఆలస్యంగా వెలుగులోకి కుటుంబ కలహాలతో ఓ అల్లుడి కిరాతకంగా మారాడు. భార్య తరపు కుటుంబీకులందరినీ అంతమొందించాలని కుట్ర పన్నాడు. ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి గ్రామానికి చేరుకుని గుడిసెలకు నిప్పుపెట్టాడు. అయితే అంతకు ముందు జరిగినఽ ఓ ఘటనతో పది మంది తృటిలో ప్రాణాలను దక్కించుకున్నారు. వరుసగా ఉన్న మూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. - కొత్తసిద్దేశ్వరం (జూపాడుబంగ్లా) కొత్త సిద్ధేశ్వరం గ్రామానికి చెందిన చెంచురామయ్యకు కుమారుడు శీనుతోపాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె నాగమణికి 15 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా జిల్లా చీమకుర్తి సమీపంలోని భ్రైసీకి చెందిన బ్రహ్మయ్యతో వివాహమైంది. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలతో ఏడాది క్రితం నాగమణి పుట్టింటికి చేరుకుంది. ఇటీవల భార్యను కాపురానికి పంపాలని బ్రహ్మయ్య అత్తామామలను కోరగా పెద్దమనుషులను తీసుకొస్తే పంపుతామని వెనక్కు పంపారు. దీంతో అతను వారిపై కక్ష పెంచుకుని భార్య తరపు వారందరిని తుదిముట్టించాలని కుట్ర పన్నాడు. మేకల పెంపకం, నాటువైద్యం చేస్తూ చెంచురాయమ్య, అతని కుమారుడు శీను, పెద్ద అల్లుడు పోలయ్య ఊరికి శివారులో ఒకరి తర్వాత ఒకరు గుడిసెలు వేసుకొని అందులో జీవనం కొనసాగిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం చెంచురామయ్యకు పక్షవాతం రావటంతో అతనికి దొర్నిపాడు మండలం గుండుపాపలలో పసరు తాపించేందుకు అందరూ వెళ్లారు. ఈ విషయం తెలియని బ్రహ్మయ్య అర్ధరాత్రి కొత్తసిద్దేశ్వరం చేరుకుని భార్య తరుపు కుటుంబీకులను అంతమొందించాలని మూడు గుడిసెలకు నిప్పుపెట్టాడు. ఊరికి శివారులో ఉండటంతో మొదట మంటలను ఎవరూ గుర్తించలేదు. ఆలస్యంగా తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈలోగా గుడిసెలు పూర్తిగా దగ్ధమై అందులోని సామగ్రి కాలి బూడిదైంది. అక్కడికి సమీపంలో పొదల్లో ఉన్న బ్రహ్మయ్యను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు పట్టించే లోపే తప్పించుకొని పారిపోయాడు. ప్రమాదంలో నాలుగు టీవీలు, రూ.30వేల నగదు, బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనం, సైకిల్ తదితర సామగ్రి అంతా కాలిపోయాయి. దాదాపు రూ.2లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పొరపాటున బాధితులు ఇంట్లో నిద్రించి ఉంటే పది మంది సజీవ దహనమయ్యేవారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన చెంచురామయ్య కుటుంబసభ్యులు జరిగిన సంఘటనను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రస్తుతం గ్రామ పాఠశాలలో తలదాచుకున్నారు. శనివారం ఉదయం వారు జరిగిన విషయమై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎంజీఆర్ అల్లుడి హత్యకేసులో ఏడుగురికి జీవితఖైదు
చెన్నై: అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) అల్లుడు విజయన్ హత్య కేసులో చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఎంజీఆర్ పెంపుడు కుమార్తె బాను శ్రీధర్ సహా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఎంజీఆర్ మరో పెంపుడు కూతురు సుధ భర్త అయిన విజయన్ 2008, జూన్ 4న అళ్వార్ పేటలో హత్యకు గురైయ్యారు. ఆయనను కారుతో గుద్ది, ఇనుప రాడ్లతో మోది చంపారు. ఈ కేసులో మొదట అభిరామపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తర్వాత సీబీసీఐడీకి అప్పగించారు. దాదాపు 70 మంది కోర్టులో సాక్ష్యమిచ్చారు. కానిస్టేబుల్ కరుణ సహకారంతో సోదరి భర్తను బాను శ్రీధర్ చంపించినట్టు దర్యాప్తులో తేలింది. ఆస్తి తగాదాలతో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు రుజువైంది. కానిస్టేబుల్ కరుణకు బాను రూ. 4లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. బానుకు సహకరించిన ఆమె స్నేహితురాలు భువన ఇప్పటికి పరారీలో ఉంది. కోర్టు తీర్పుపై విజయన్ భార్య సుధ స్పందించారు. పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తకు చివరికి న్యాయం దక్కిందన్నారు. -
సినిమాల్లోకి చిరంజీవి చిన్నల్లుడు?
హైదరాబాద్: పెద్ద స్టార్ల కొడుకులే కాదు.. అల్లుళ్లు కూడా వారసులుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చరిత్ర టాలీవుడ్లో ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు అంటూ వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న కళ్యాణ్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. క్యూట్ లుక్స్‌తో అదరగొడుతున్న ఇతగాడిని హీరోగా పరిచయం చేయబోతున్నట్టు సమాచారం. 'మెగాస్టార్ చిన్నల్లుడు', 'శ్రీజతో కళ్యాణ్' అంటూ లీకైన ఫొటోలు టీటౌన్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతోపాటు శ్రీజతో పెళ్లయిన తర్వాత చిన్నల్లుడు సినీ రంగ ప్రవేశం చేయనున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అటు ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ట అల్లుడు సుధీర్ బాబు హీరోగా పరిచయమయ్యాడు. ఇపుడు చిరంజీవి చిన్నఅల్లుడు కళ్యాణ్ వంతు వచ్చిందన్నమాట అంటూ టాలీవుడ్ గుసగుసలాడుతోంది. శ్రీజ పెళ్లి వార్తలపై ఇప్పటికీ గోప్యతను పాటిస్తున్నమెగా ఫ్యామిలీ , మరి ఈ వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
భార్య కాపురానికి రాలేదని...
-
చంద్రబాబు వెన్నుపోటుకి 20 ఏళ్లు
-
అత్త ఇంటికి అల్లుడి కన్నం..
దర్శి : జల్సాలు చేయటం రుచి మరిగిన ఓ అల్లుడు..అత్తవారింట్లోనే చేతివాటాన్ని ప్రదర్శించాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా దర్శి పంచాయతీ పరిధిలోని శివరాజ్‌నగర్‌కు చెందిన షేక్ సుభానీకి కురిచేడు గ్రామంలో టైలరింగ్ షాప్ ఉంది. కొంత కాలం కిందట ఇతనికి దర్శికి చెందిన షేక్ నన్నేసాహెబ్ కుమార్తెతో వివాహం జరిగింది. అయితే సుభానీ గత కొన్ని రోజులుగా అత్తవారింట్లో మకాం వేశాడు. కాగా ఈనెల 24వ తేదీన నన్నేసాహెబ్ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.3.25 లక్షల విలువైన 130 గ్రాముల బంగారం చోరీకి గురైందని నన్నేసాహెబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. దొంగతనం జరిగినప్పటి నుంచి అల్లుడు సుభానీ ప్రవర్తనలో మార్పు రావటం పసిగట్టి అతని కదలికలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం కురిచేడు రైల్వేస్టేషన్లో ఉన్న సుభానీని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రెండు జతల బంగారు కమ్మలను, అలాగే తన టైలరింగ్ షాపులో దాచిన 60 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు దర్శిలోని ఓ స్నేహితుడి ద్వారా 60 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు తెలిసింది. వచ్చిన డబ్బును జల్సాలకు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో సుభానీ అంగీకరించాడు. -
నా భార్యనే కొడతావా..?
* తాగిన మైకంలో చిన్నమామను నరికిన అల్లుడు * తీవ్రగాయాలతో అర్థరాత్రి మృతి హైదరాబాద్: తాగిన మైకంలో గొడవకు దిగి భార్యపై చేయి చేసుకున్నాడన్న కోపంతో వరుసకు చిన్న మామను అల్లుడు గొడ్డలితో నరకడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈఘటన పేట్‌బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి కలకలం రేపింది. సీఐ ప్రవీందర్‌రావు కథనం ప్రకారం..పిట్టల ప్రతాప్ కూలీ పనులు చేసుకుంటూ గుండ్లపోచంపల్లిలో గుడిసెలో నివాసముంటున్నాడు. ఈయనకు భార్య,పిల్లలున్నారు. అతని అన్న రాజారెడ్డి బొల్లారంలో ఉంటుండగా కులసంప్రదాయ ప్రకారం పండుగ చేసుకునే విషయంలో శుక్రవారం మధ్యాహ్నం పెద్దలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో అంతా కూర్చొని మద్యం సేవించారు. ఇంతలో ప్రతాప్,రాజారెడ్డికి వరుసకు అల్లుడయ్యే రాజా కూడా అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో ప్రతాప్‌తో రాజా భార్య అనుభాయ్‌కు మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో ప్రతాప్, అనుభాయ్‌పై చేయిచేసుకున్నాడు. ‘నా భార్యనే కొడతావా’ అంటూ రాజా గొడ్డలితో ప్రతాప్ ముఖంపై మూడుసార్లు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. అపస్మారకస్థితిలో ఉన్న ప్ర తాప్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి, అక్కడినుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అర్ధరాత్రి ప్రతాప్ కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని రాజాతోపాటు అతని భార్య అనుభాయ్, రాజారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.