ఢిల్లీ: జీ-20కి వేదికగా నిలిచిన భారత్‌కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చేరుకున్నారు. రిషి సునాక్ తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని విమానాశ్రయంలో దిగారు. కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే ఆయనకు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనను రిషి సునాక్ ప్రశంసించారు.
భారత్‌లో జరుగుతున్న జీ20 సమావేశాలకు బ్రిటన్‌లో బయలుదేరే ముందు రిషి సునాక్ మీడియాతో మాట్లాడారు. భారత్ తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనను భారతదేశ అల్లునిగా వ్యవహరించడాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. తనపై ప్రేమతో భారతీయులు అలా పిలుస్తారని అన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా చర్చలు జరుపనున్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు.
జీ-20 సమావేశానికి ప్రపంచ అగ్రదేశాదినేతలు హాజరవుతున్నారు. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి జపాన్ ప్రధాని పుమియో కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఢిల్లీకి చేరుకున్నారు.
ఇదీ చదవండి: భారత్‌ను ఇలా చూడడం గర్వంగా ఉంది: రిషి సునాక్
Comments
Please login to add a commentAdd a comment