జీ 20 సమ్మిట్ లో యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతదేశంలో మూడు రోజుల పాటు జరిగిన G20 సమ్మిట్‌లో UK ప్రధాన మంత్రి రిషి సునక్ ,భార్య అక్షతా మూర్తి హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా భారతీయ కుటుంబానికి చెందిన అక్షతామూర్తి కట్టు బొట్టుతో తనదైన శైలితో మరింత ఆకట్టుకున్నారు. రెండు రోజులపాటు సాగిన భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది.
An important trip to India for the G20, delivering for the UK on the world stage 🇬🇧 👇 pic.twitter.com/H3MvrCJ7zg
— Rishi Sunak (@RishiSunak) September 11, 2023
ఈ సందర్బంగా భారతదేశానికి వీడ్కోలు పలుకుతున్నప్పుడు సంప్రదాయ చీరలో అత్యంత మనోహరంగా కనిపించారు అక్షత. రా మ్యాంగో లేబుల్ నుండి పింక్ చీర,చెవిపోగులు, చిన్న బిందీతో ఇండియన్ లుక్‌తో అక్షతా మూర్తి తన భారత పర్యటనను ముగించారు. అంతేకాదు భారత సంతతికి చెందిన ఈ జంట ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
భారత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి ముఖ్యంగా అక్షత సాంప్రదాయ చీర లుక్ చర్చనీయాంశంగా నిలిచింది. యూకే ఆధారిత సస్టైనబుల్ లేబుల్ విత్ నథింగ్ అండర్ నీత్‌తో కూడిన తెల్లటి బటన్ డౌన్ షర్ట్‌ను ధరించాలరు. ఢిల్లీలో పూల ప్రింటెడ్ స్కర్ట్‌తో భారత మండపంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నిర్వహించిన G20 డిన్నర్‌లో ఇండో-వెస్ట్రన్ మ్యాక్సీ డ్రెస్ ధరించారు. పర్యటన ముగించుకొని వెడుతున్న సందర్బంగా రిషి సునక్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను,వీడియోను పంచుకున్నారు.దీంతో వైరల్‌గా మారింది.
దేశ రాజధాని నుండి బయలుదేరే ముందు, అక్షత , రిషి సునక్ అక్షరధామ్ ఆలయంలో పూజలు చేశారు. ఇక్కడ కూడా ఆమె పింక్ పలాజో , పింక్ దుపట్టాతో కూడిన ఆకుపచ్చ కుర్తాతో కనిపించగా, మరోవైపు, బ్రిటన్ ప్రధాని అధికారిక దుస్తులు ధరించారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన మిల్లెట్ ఎగ్జిబిషన్‌కు హాజరైనప్పుడు, అక్షత లిలక్ మార్బుల్-ప్రింట్ డ్రెస్‌లో కనిపించారు. కాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి , రచయిత్రి సుధా మూర్తి కుమార్తె అక్షత అన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment