మోదీగారు మీ అల్లుడు ఇతనే! | Rakhi Sawant says Narendra Modi ji meet your son-in-law | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 16 2017 1:48 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Rakhi Sawant says Narendra Modi ji meet your son-in-law - Sakshi

ఆ మధ్య రాఖీ సావంత్‌ ప్రధాని నరేంద్రమోదీ బొమ్మలు ముద్రించిన బ్లాక్‌ డ్రెస్‌ను వేసుకొని హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. పాపులారిటీ కోసం తెగ తాపత్రయపడే రాఖీ అప్పట్లో ప్రధాని మోదీ తన ‘డ్రీమ్‌ మ్యాన్‌’ (కలల రాజు) అని, ఆయనను ఆకట్టుకునేందుకు ఈ డ్రెస్‌ వేసుకున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మారిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీని తన తండ్రితో పోలుస్తూ తాజాగా ఈ అమ్మడు ఓ పోస్టు పెట్టింది. ఇతనే నా వరుడు అంటూ గతవారం రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో వైరల్‌ మారింది. అందులో ఏమన్నదంటే.. ‘నేను చేసుకోబోయే వరుణ్ణి ఎప్పుడూ చూపిస్తావంటూ స్నేహితులందరూ ఒకటే అడుగుతున్నారు. ఇతనే ఆ వరుడు. ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నాను. వరుణ్ణి కనుగొన్నాను. ఇతనే నా వరుడు. ప్రియుడు’ అంటూ రాఖీ చెప్పుకొచ్చింది.

‘ప్రధాని మోదీ సహా భారతీయులందరూ ఇప్పుడు నన్ను చూస్తున్నారు. మోదీజీ నాకు అతిపెద్ద అభిమాని. మోదీజీ ఇదిగో మీ అల్లుడితో కలువండి’ అంటూ ఈ హాట్‌ భామ పేర్కొంది. అన్నట్టు 2009లో స్వయవరం పేరిట ఓ టీవీషోలో పాల్గొని.. ఎలెష్‌ పురంజన్‌వాలా అనే యువకుడితో రాఖీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిశ్చితార్థం చేసుకున్న రాఖీ.. డబ్బు కోసమే ఈ స్వయంవరం షోలో పాల్గొన్నట్టు వెల్లడించింది. ఇక సినిమాల విషయానికొస్తే వివాదాస్పద బాబా గుర్మీత్‌ రాంరహీంసింగ్‌ జీవిథకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో హనీప్రీత్‌ సింగ్‌ పాత్రలో ఈ భామ నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement