మోదీ నా డ్రీమ్ మ్యాన్: బాలీవుడ్ నటి | Modi ji is my dream man: Rakhi Sawant | Sakshi
Sakshi News home page

మోదీ నా డ్రీమ్ మ్యాన్: బాలీవుడ్ నటి

Published Fri, Aug 12 2016 11:26 AM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM

మోదీ నా డ్రీమ్ మ్యాన్: బాలీవుడ్ నటి - Sakshi

మోదీ నా డ్రీమ్ మ్యాన్: బాలీవుడ్ నటి

ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో ఉన్న డ్రెస్ ధరించి విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన చర్యను సమర్థించుకుంది. మోదీపై ఉన్న అభిమానంతోనే ఇలా చేశానని వివరణయిచ్చింది. మోదీ ఫొటోలతో ఉన్న స్కర్ట్ ధరించి చికాగోలో ఇటీవల జరిగిన భారత స్వాతంత్ర్య ముందస్తు వేడుకల్లో రాఖీ సావంత్ పాల్గొంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

దీనిపై 'ఫస్ట్ పోస్ట్'తో రాఖీ సావంత్ మాట్లాడుతూ...  'బీజేపీని ఆకట్టుకోవాలని ఈ డ్రెస్ ధరించాను. ముఖ్యంగా మోదీ, అమిత్ షా దృష్టిలో పడాలని ఇలా చేశాను. వీరిద్దరినీ విపరీతంగా అభిమానిస్తాను. నన్ను రాజ్నాథ్ సింగ్ కూతురిలా భావిస్తారు. నేను ఇప్పటికే బీజేపీ కూతుర్ని. మోదీని ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఫొటోలతో డ్రెస్ డిజైన్ చేయించుకున్నా. మోదీ నా డ్రీమ్ మ్యాన్. ఆయన మన ప్రధానమంత్రి కావడం నాకు ఆనందం కలిగించింది. మరో 15 ఏళ్లు ఆయన ప్రధానిగా ఉంటారు. ఎక్కడికి వెళ్లినా డ్రెస్ వేసుకుంటాను. మోదీ ఫొటోలతో చీర కూడా డిజైన్ చేయించుకుంటాన'నని రాఖీ సావంత్ తెలిపింది.

తన దుస్తులపై విమర్శలు చేయడం మానుకుని సీరియస్ విషయాలపై దృష్టి పెట్టాలని విమర్శలకు సూచింది. 'మన ప్రియమైన ప్రధానమంత్రిపై నాకున్న అభిమానాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాను. నా డ్రెస్ వివాదాలపై సృష్టించి సమయం వృధా చేసుకోకుండా, మీ కుటుంబంపై దృష్టి పెట్టాలని విమర్శకులకు చెప్పలనుకుంటున్నాను. బాలికలపై అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు వంటి తీవ్రమైన సమస్యలపై మాట్లాడితే బాగుంటుంది. నా డ్రెస్ గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేసుకోవద్ద'ని రాఖీ సావంత్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement