మోదీ బొమ్మలతో డ్రస్.. రాఖీసావంత్‌పై కేసు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. గడిచిన ఆగస్టు నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బొమ్మలతో కూడిన ఒక అసభ్యకరమైన డ్రస్ ధరించినందుకు ఆమెపై ఈ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని రాజ్సమంద్ జిల్లాలోని ఒక పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఒక ఎఫ్ఐఆర్ దాఖలైంది.
స్థానికుడొకరు రెండు రోజుల క్రితం ఈ విషయమై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఆమె ఆ దుస్తులు వేసుకోవడం ద్వారా ప్రధానమంత్రిని అవమానించడమే కాక, అసభ్యత కూడా ప్రదర్శించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్సమంద్ జిల్లాలోని కంక్రోలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.