'మోదీజీ నా గుండెకు గాయంచేశారు' | Rakhi Sawant: Modi ji has broken my heart | Sakshi
Sakshi News home page

'మోదీజీ నా గుండెకు గాయంచేశారు'

Published Thu, Mar 17 2016 8:29 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'మోదీజీ నా గుండెకు గాయంచేశారు' - Sakshi

'మోదీజీ నా గుండెకు గాయంచేశారు'

ముంబై: బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తొలుత అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీపడుతున్న అభ్యర్థుల గురించి మాట్లాడింది. అందులో భాగంగా రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష స్థానానికి పోటీలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ గురించి కొన్ని విషయాఆలు మాట్లాడింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్ని నెలలుగా దేశమంతా నమో మంత్రాన్ని జపిస్తోందని అయితే కొన్నిరోజుల నుంచి ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని రాఖీ సావంత్ పేర్కొంది.
ఇప్పటికీ తాను మోదీజీకి పెద్ద అభిమానినని, నిజం చెప్పాలంటే ఆయన తన గుండెకు గాయం చేయారని వ్యాఖ్యానించింది.

ఆయన ఇచ్చిన వాగ్దాలు నెరవేరుస్తారని తనకు నమ్మకం ఉందని అయితే ఇప్పటివరకూ ఏం చేయలేదని అంటోంది. మనం అందరం ఇడియట్స్. నల్లధనాన్ని భారత్ కు తిరిగి తెప్పిస్తామని చెప్పారు కానీ, ఎక్కడుంది ఆ నల్లధనం అంటూ ప్రశ్నించింది. దేశమంతా ఇంకా ఆ నల్లధనం గురించి ఎంతో ఆశగా ఎదరుచూస్తున్నారని చెప్పుకొచ్చింది. దేశంలో చాలా మంది ఇంకా నిరుపేదలు గానే ఉన్నారనీ, లక్షల సంఖ్యల ప్రజల ప్రధాన సమస్య ఇదేనని రాఖీ అభిప్రాయపడింది. భారతీయుల ఎమోషన్స్ తో మోదీ ఆడుకుంటున్నారు.. 'అచ్చే దిన్' అని వాగ్దానాలు చేశారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చేలా కనిపించడంలేదంది. మోదీ చేతుల్లో అందరూ ఆడుతున్నందున మరికొన్ని సంవత్సరాలు భారతీయులు ఇబ్బందులకు గురికావలసిందేనని రాఖీ సావంత్ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement