item girl
-
ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్
ముంబై : రాఖీ సావంత్.. బిగ్‌బాస్ సీజన్ 14లో మోస్ట్ ఎంటర్టైనర్గా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. బోల్డ్నెస్తో పాటు కాంట్రవర్సీ క్వీన్‌గానూ పేరొందిన రాఖీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో తనకు ఐటెం గర్ల్ అన్న గుర్తింపు రావడం పట్ల ఎలాంటి రిగ్రెట్స్ లేవని, అయినా తనకు హీరోయిన్ పాత్ర పోషించేంత టాలెంట్ కూడా లేదని తెలిపింది. 'బాలీవుడ్లో ప్రతీ ఒక్కరూ హీరోయిన్ కాలేరు. కొందరికి ఐటెమ్ గర్ల్లాగా ఛాన్సులొస్తే.. మరికొందరికేమో తల్లి, చెల్లి, ఫ్రెండ్, నెగిటివ్ రోల్స్ లేదా చిన్న చిన్న పాత్రలు వస్తాయి. అయినా కెరీర్లో ఐటెం సాంగ్స్ చేయడం పట్ల నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే అలా సంపాదిచిన డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. అంతేకాకుండా ఐటెం గర్ల్‌గా బాలీవుడ్లో నాకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించినందుకు ఎంతో గర్వపడుతున్నాను' అని వెల్లడించింది. మొహబత్ హై మిర్చి, దేక్తా హై తు క్యా వంటి స్పెషల్ సాంగ్స్‌లో కనిపించిన రాఖీ తన దూకుడుతో మరింత గుర్తింపు సంపాదించుకుంది. నాచ్ బలియే, పతి పత్ని జౌర్ వో, బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోస్‌తో పాపులారిటీ దక్కించుకుంది. చదవండి : అత్యాచారం చేయబోయారు: బిగ్‌బాస్ కంటెస్టెంట్ పిల్లల్ని కనాలని ఉంది: బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
‘నేను బీజేపీ ఐటమ్ గర్ల్‌ని’
లక్నో : నోటి దురుసుతో వార్తల్లో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజామ్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను బీజీపీ ఐటమ్ గర్ల్‌ను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల క్రితం ఘజియాబాద్‌లో హజ్ హౌస్ ప్రారంభోత్సావానికి హాజరైన అజామ్ ఖాన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. దాంతో అంబేడ్కర్ మహాసభ సభ్యులు అజామ్ ఖాన్ మీద మంగళవారం (నిన్న) హజ్రత్గని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ ‘బీజేపీ గత ఎన్నికల్లో నా పేరే వాడింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా నా పేరును అడ్డు పెట్టుకుని ప్రచారం చేయాలని భావిస్తోంది. ఎందుకంటే బీజేపీ నన్ను తన ఐటమ్ గర్ల్‌గా భావిస్తోంది. ఇక మీదట కూడా నాకు సమన్లు, వారెంట్లూ వస్తూనే ఉంటాయాం’టూ అజామ్ మండిపడ్డారు. -
ఐటం బాయ్‌గా మారిన స్టార్ హీరో
చిత్ర పరిశ్రమలో ‘ప్రత్యేక గీతాల్లో’ నర్తించేందుకు కొన్నాళ్ల క్రితం వరకూ ప్రత్యేకంగా నటీమణులను తీసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మంచి పారితోషికం, క్రేజ్ కోసం స్టార్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్స్ వైపు మక్కువ చూపుతున్నారు. అయితే ఇన్నాళ్లు ‘ఐటం గర్ల్స్’కు మాత్రమే సొంతమైన ఈ పాటల్లో ఇక ‘ఐటం బాయ్స్’ కూడా రాబోన్నారు. బాలీవుడ్ చరిత్రలోనే ‘ఐటం బాయ్’గా కాలు కదపనున్న తొలి హీరోగా అర్జున్ కపూర్ నిలవనున్నారు. ఈ యువ హీరో తన కజిన్ హర్షవర్ధన్ కపూర్ నటిస్తున్న ‘భవేష్ జోషి సూపర్‌హీరో’ చిత్రంలో ‘చుమ్మే మేన్ చవాన్‌ప్రాష్’ పాటలో కనిపించబోతున్నాడు. ప్రత్యేక గీతంలో అర్జున్ తోపాటు ‘దండేకర్ సిస్టర్స్’ అనుషా, షిబానీ నర్తించనున్నారు. తాజాగా ఈ పాటకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లో వీరు ముగ్గురూ మాంచి రంగు రంగులు దుస్తుల్లో ఐటం తారలకు ధీటుగా మెరిసిపోతున్నారు. ‘మిర్జ్యా’ చిత్రం తర్వాత హర్షవర్ధన్ నటిస్తున్న చిత్రం ‘భవేష్ జోషి సూపర్‌హీరో’. ఈ చిత్రంలో హర్షవర్ధన్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఫాంటమ్ ఫిల్మ్స్ బ్యానర్లో, విక్రమాదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. -
'మోదీజీ నా గుండెకు గాయంచేశారు'
ముంబై: బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తొలుత అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీపడుతున్న అభ్యర్థుల గురించి మాట్లాడింది. అందులో భాగంగా రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష స్థానానికి పోటీలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ గురించి కొన్ని విషయాఆలు మాట్లాడింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్ని నెలలుగా దేశమంతా నమో మంత్రాన్ని జపిస్తోందని అయితే కొన్నిరోజుల నుంచి ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని రాఖీ సావంత్ పేర్కొంది. ఇప్పటికీ తాను మోదీజీకి పెద్ద అభిమానినని, నిజం చెప్పాలంటే ఆయన తన గుండెకు గాయం చేయారని వ్యాఖ్యానించింది. ఆయన ఇచ్చిన వాగ్దాలు నెరవేరుస్తారని తనకు నమ్మకం ఉందని అయితే ఇప్పటివరకూ ఏం చేయలేదని అంటోంది. మనం అందరం ఇడియట్స్. నల్లధనాన్ని భారత్ కు తిరిగి తెప్పిస్తామని చెప్పారు కానీ, ఎక్కడుంది ఆ నల్లధనం అంటూ ప్రశ్నించింది. దేశమంతా ఇంకా ఆ నల్లధనం గురించి ఎంతో ఆశగా ఎదరుచూస్తున్నారని చెప్పుకొచ్చింది. దేశంలో చాలా మంది ఇంకా నిరుపేదలు గానే ఉన్నారనీ, లక్షల సంఖ్యల ప్రజల ప్రధాన సమస్య ఇదేనని రాఖీ అభిప్రాయపడింది. భారతీయుల ఎమోషన్స్ తో మోదీ ఆడుకుంటున్నారు.. 'అచ్చే దిన్' అని వాగ్దానాలు చేశారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చేలా కనిపించడంలేదంది. మోదీ చేతుల్లో అందరూ ఆడుతున్నందున మరికొన్ని సంవత్సరాలు భారతీయులు ఇబ్బందులకు గురికావలసిందేనని రాఖీ సావంత్ వివరించింది. -
ఐటం గర్ల్‌గా ఇలియానా???
-
ఐటంసాంగ్స్ బాటలో నిఖిత
-
ఐటం భామగా మారిన ఇల్లిబేబి
-
ఐటం గళ్‌గా మారిన శ్రద్ధా కపూర్
-
ఐటం గర్ల్‌గా మారిన హంసానందిని
-
ఐటం గాళ్‌గా మారిపోతున్న తమన్నా..?
-
ఐటమ్... ప్లీజ్
-
ఆప్.. రాజకీయాల్లో ‘ఐటమ్ గర్ల్’: ఉద్ధవ్ విమర్శ
సాక్షి, ముంబై : శివసేన అధినేత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని రాజకీయాల్లో ‘ఐటమ్ గర్ల్’గా అభివర్ణించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్‌తో పోలుస్తూ ఎద్దేవా చేశారు. ‘సామ్నా’ దినపత్రిక శుక్రవారం సంపాదకీయంలో ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో ఆప్, కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ‘యేడ్యాంచి జాత్రా’ (వెర్రి వెంగళప్పల నాటకం) అనే శీర్షికతో ప్రచురించి సంపాదకీయంలో ఆప్ సర్కారు పనితీరుపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీ పోలీసుల వ్యవహార శైలిపై రోడ్డున పడి ఆందోళన చేసిన తీరును కూడా ఉద్ధవ్ గర్హించారు. సినిమాల్లో హీరోయిన్ పాత్రలు దొరకని స్థితిలో ఒక పాటలో ఇలా వచ్చి మురిపించి అలా మాయమయ్యే ఐటమ్ గర్ల్ మాదిరిగా దేశంలో ఆప్ వ్యవహార శైలి ఉందన్నారు. ‘ఢిల్లీ సర్కారు పనితీరు చూస్తుంటే ఆయన(కేజ్రీవాల్) స్థానంలో హిందీ నటి రాఖీసావంత్ ఉండి ఉంటే ఇంకా సమర్ధవంతంగా వ్యవహరించి ఉండే’దని తన సంపాదకీయంలో పేర్కొన్నారు. -
అనవసరంగా నా పేరు లాగకండి: రాఖీ సావంత్
రాజకీయ నాయకులు ప్రత్యర్థులను విమర్శించడానికి అనవసరంగా తన పేరు లేనిపోని వివాదాల్లోకి లాగడం తగదని బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ మండిపడింది. అరవింద్ కేజ్రీవాల్ కంటే రాఖీ సావంతే నయమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై రాఖీ ఇలా చెప్పింది. ''కేజ్రీవాల్ కంటే నేను మంచి రాజకీయ నాయకురాలిని అవుతానని ఉద్ధవ్ ఠాక్రే భావిస్తే అందుకు ఆయనకు కృతజ్ఞతలు. కానీ, నా పేరును అనవసరంగా రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటే నాకు నచ్చదు. నేను కేవలం కష్టపడి పనిచేసే నటిని మాత్రమే'' అని ఆమె చెప్పింది. అంతకుముందు.. ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కంటే, బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ చాలా నయమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో.. నేరుగా కేజ్రీవాల్‌పై తన విమర్శలు ఎక్కుపెట్టారు. కేజ్రీవాల్ కంటే రాఖీ సావంత్‌ను ఆ కుర్చీలో కూర్చోబెడితే బాగా చేసేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో రాఖీని ఐటెం గర్ల్ అని విమర్శించినవాళ్లు ఇప్పుడామెను సన్మానించాలని తెలిపారు. -
ఐటం బాంబ్